ఇన్‌స్టా ఇన్‌ఫ్లూయెన్సర్ సౌమ్యాశెట్టి నిర్వాకం మరోసారి బయటపడింది. ఇద్దరు యువకులపై వలపుల వల విసిరిన సౌమ్యాశెట్టి ఏకంగా కోటి రూపాయలు వసూలు చేసింది. సౌమ్యాశెట్టి హానీట్రాప్ కు తెలంగాణకు చెందిన లక్ష్మీకాంత్ రెడ్డి అనే యువకుడు చిక్కుకున్నాడు.
ఇన్‌స్టా ఇన్‌ఫ్లూయెన్సర్ సౌమ్యాశెట్టి నిర్వాకం మరోసారి బయటపడింది. ఇద్దరు యువకులపై వలపుల వల విసిరిన సౌమ్యాశెట్టి ఏకంగా కోటి రూపాయలు వసూలు చేసింది. సౌమ్యాశెట్టి హానీట్రాప్ కు తెలంగాణకు చెందిన లక్ష్మీకాంత్ రెడ్డి అనే యువకుడు చిక్కుకున్నాడు. ఇన్‌స్టాగ్రామ్ లో ఇద్దరికి పరిచయం ఏర్పడింది. ఈ ఏడాది మార్చి 29న లక్ష్మీకాంత్ సౌమ్యశెట్టి కోసం వైజాగ్ కు వచ్చాడు లక్ష్మీకాంత్. ఈ ఇద్దరు భీమిలి సమీపంలోని ఒక రిసార్టులో కలిశారు. ఆ తర్వాత ఇద్దరి మధ్య సాన్నిహిత్యం పెరిగింది. రెండో భార్యగా ఉంటానంటూ ఆఫర్ ఇచ్చింది సౌమ్యాశెట్టి . ఆ తరువాత అనారోగ్యం, తన ఖర్చులు అంటూ దాదాపు రూ.86 లక్షలు, ఆరు గ్రాముల బంగారం దోచేసింది. ఆ తరువాత అతన్ని పక్కన పెడుతూ వచ్చింది. నెంబర్ కూడా బ్లాక్ చేసింది.
లాయర్ తో బెదిరింపులు
తనకు ఫోన్ చేస్తే బాగుండదని తన తరుపు లాయర్ తో బెదిరింపులకు దిగింది. ఇదే తరహాలోనే రాజేష్ ను కూడా వలలో వేసింది. అతని దగ్గర నుంచి డబ్బులు వసూలు చేసి బెదిరింపులకు దిగింది. దీంతో ఆమెపై చట్టప్రకారం చర్యలు తీసు కోవాలని విశాఖపట్నం సీపీ శంఖబ్రత బాగ్చికి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు బాధితులు. వెంటనే స్పందించిన సీపీ శంఖబ్రతబాగ్చి ఫిర్యా దుదారుడి చెబుతున్నదాంట్లో వాస్తవమెంతో విచారణ చేయాలని భీమిలి సీఐ తిరుమలరావును పెందుర్తి పోలీసులను ఆదేశించారు. గతంలోనూ ఇదే తరహా మోసాలకు పాల్పడింది సౌమ్యాశెట్టి. గతంలో ఫ్రెండ్ ఇంట్లో 70 తులాల గోల్డ్ చోరీ చేసింది సౌమ్యాశెట్టి. సౌమ్యాశెట్టిపై కఠిన చర్యలు తీసుకోవాలని బాధితుల డిమాండ్ చేస్తున్నారు.
Also read
- షుగర్ ఉన్నట్లు చెప్పలేదని భార్య హత్య
- భార్యను చంపి బోరు బావిలోపాతిపెట్టి.. పార్టీ ఇచ్చాడు!
- చిన్నారులను చంపి తండ్రి ఆత్మహత్య
- విజయవాడలో భారీగా స్టెరాయిడ్స్ పట్టివేత
- నరక యాతన పడి వ్యాన్ డ్రైవర్ మృతి