నటుడు మోహన్ బాబు కుటుంబంలో కొద్ది నెలలుగా తీవ్రమైన గొడవలు జరుగుతున్నాయి. ఆ గొడవలు పోలీస్ స్టేషన్, కోర్టుల వరకు వెళ్లాయి. ఈ వివాదం ఇలా ఉండగానే.. ఖమ్మం జిల్లాలో మోహన్ బాబుపై ఒక విచిత్రమైన కేసు నమోదైంది. సౌందర్యను చంపింది మోహన్ బాబు అన్నది కేసు సారాంశం
Manchu Mohan Babu : టాలీవుడ్ నటుడు మంచు మోహన్ బాబు కుటుంబంలో కొద్ది నెలలుగా తీవ్రమైన గొడవలు జరుగుతున్నాయి. ఆ గొడవలు పోలీస్ స్టేషన్, కోర్టుల వరకు వెళ్లాయి. మంచు మనోజ్, మంచు విష్ణు మధ్య జరుగుతున్న వివాదంలో మోహన్ బాబు కూడా భాగమయ్యారు. అయితే ఈ వివాదానికి ఆస్తుల పంపకాలే కారణమనే విషయం మీడియాలో చర్చనీయాంశమైంది. అయితే ఈ వివాదం ఇలా కొనసాగుతుండగానే.. ఖమ్మం జిల్లాలో మోహన్ బాబుపై ఒక విచిత్రమైన కేసు నమోదైంది. ప్రముఖ నటి సౌందర్యది ప్రమాద వశాత్తు సంభవించిన మృతి కాదని పక్కా హత్యేనని, ఆ హత్యకు మోహన్‌బాబే కారణమంటూ ఓ వ్యక్తి జిల్లా కలెక్టర్, పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
ఖమ్మం జిల్లా ఏదులాపురం గ్రామ పంచాయితీ పరిధిలోని ఎదురుగట్ల చిట్టిమల్లు ఖమ్మం జిల్లా కలెక్టర్, ఏసీపీకి ఫిర్యాదు చేశారు. ఫిర్యాదులో పేర్కొన్న ప్రకారం.. సినీ నటి, స్వర్గీయ సౌందర్యకు శంషాబాద్ పరిధిలోని జల్‌పల్లి గ్రామంలో 6 ఎకరాల భూమి ఉంది. ఆమెను ఆ భూమి విక్రయించమని మోహన్ బాబు అడిగారు. అందుకు సౌందర్య, ఆమె సోదరుడు అమర్నాథ్ నిరాకరించారు అని తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇక 6 ఎకరాల భూమిని అమ్మడానికి నిరాకరించడంతో సౌందర్య కుటుంబ సభ్యులపై కక్ష్య పెంచుకొన్నారు. 2004 సంవత్సరం ఏప్రిల్ 17వ తేదీన తెలంగాణలోని పార్టీ ప్రచారానికి బెంగళూరు నుంచి వస్తున్న సౌందర్య, ఆమె సోదరుడి హెలికాప్టర్ ప్రమాదం రూపంలో హత్య చేయించాడు. సాక్ష్యాలు దొరకకుండా చేశాడు. ఆ తర్వాత జల్‌పల్లిలో ఉన్న 6 ఎకరాల భూమిని అక్రమంగా అనుభవిస్తున్నాడు అని తన ఫిర్యాదులో తెలిపారు. మంచు మోహన్ బాబు కబ్జాలో ఉన్న భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలి. ఆ భూమిని అనాథ ఆశ్రమానికి గానీ, లేదా మిలిటరీ సోదరులకు గానీ, పోలీసులకు గానీ, మీడియా మిత్రులకు గానీ ఇవ్వాలని కోరుతున్నాను అని ఖమ్మం ఏసీపీకి, అలాగే ఖమ్మం జిల్లా కలెక్టర్‌కు చిట్టిమల్లు తన ఫిర్యాదులో పేర్కొన్నారు.
సౌందర్య మృతిపై రీ ఎంక్వైరీ చేయాలని డిమాండ్ చేశాడు. అంతేకాకుండా అలాగే మంచు ఫ్యామిలీలో జరుగుతున్న వివాదాన్ని కూడా తన ఫిర్యాదులో ప్రస్తావించారు. మంచు మనోజ్‌కు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నాను. అలాగే జల్‌పల్లిలోని 6 ఎకరాల్లో ఉన్న గెస్ట్ హౌజ్‌ను స్వాధీనం చేసుకోవాలని కోరుచున్నాను. అలాగే నాకు మంచు మోహన్ బాబు నుంచి ప్రాణహాని ఉంది. కాబట్టి తగు రక్షణ కల్పించాలని ఫిర్యాదుదారు పోలీసులకు సమర్పించిన ఫిర్యాదులో వెల్లడించారు. డిమాండ్ల సాధన కోసం చిట్టిమళ్లు నిరాహార దీక్ష చేపట్టనున్నట్లు తెలిపారు. ఇటీవల మంచు మోహన్ బాబు అనుచరులు తనను బెదిరింపులకు గురిచేస్తున్నారని కూడా చిట్టిమల్లు ఆరోపిస్తున్నాడు. కాగా ఈ లేఖ సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. అయితే ఈ ఫిర్యాదుపై జిల్లా కలెక్టర్, ఏసీపీ, మోహన్ బాబు ఎలా స్పందిస్తారో వేచి చూడాల్సిందే.
Also read
- Rajahmundry: కన్నతండ్రే కాలునాగులా కాటేశాడు.. నరకం చూసిన మైనర్ బాలిక
- Telangana: ప్రభుత్వ ఉద్యోగం కోసం భార్య స్కెచ్.. భర్తను సైలెంట్‌గా ఏం చేసిందంటే..
- డెలివరీ కోసమని తీసుకెళ్తే చంపేశారు.. పాప పుట్టిందని చెప్పి..!
- AP: రాజమండ్రిలో లొంగిపోయిన బోరుగడ్డ..
- Lok Sabha New Immigration Bill: వారెంట్ లేకుండానే అరెస్టు చేయొచ్చు- కొత్త చట్టం తీసుకొచ్చిన కేంద్రం