ఆ ఇంటి ముందున్న దృశ్యం చూస్తే గుండె పగిలిపోతుంది.. అక్కడ కన్నీళ్లు ఆగడం లేదు.. మాటలు రావడం లేదు.. కాలమే ఆగిపోయినట్టుంది. అప్పుల భారం మోయలేక కుమారుడు ఆత్మహత్య చేసుకుంటే.. కొడుకు మృతిని తట్టుకోలేక తల్లి గుండెపోటుతో మృతి చెందింది. ఈ విషాధ ఘటన జగిత్యాల జిల్లాలో చోటుచేసుకుంది. జగిత్యాల అర్బన్ మండలం మోతె గ్రామానికి చెందిన దోడ్ల సంపత్ (25) జీవిత భారాన్ని మోయలేకపోయాడు. అప్పుల బాధ అతన్ని మింగేసింది. గడ్డి మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. వెంటనే గమనించిన కుటుంబసభ్యులు ఆసుపత్రికి తరలించించారు. కానీ, పరిస్థితి విషమించడంతో.. కరీంనగర్ ఆసుపత్రిలో చనిపోయాడు.
అయితే.. కొడుకు మృతదేహం చూసిన తల్లి మల్లవ్వ ఆ బాధను భరించలేకపోయింది. కన్నకొడుకు తన కళ్లముందే చనిపోవడం చూసి.. తట్టుకోలేక మానసిక ఆవేదనతో కుంగిపోయింది.. తీవ్ర అస్వస్థతకు గురికాగా ఆమెను జగిత్యాలలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు.. చికిత్స అందిస్తున్న క్రమంలోనే.. మల్లవ్వ గుండెపోటుతో కన్నుమూసింది. ఇద్దరూ ఒకేసారి చనిపోవడంతో గ్రామంలో విషాధఛాయలు అలుముకున్నాయి.. కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
కాగా.. పెద్ద కుమారుడు సంతోష్ గల్ఫ్ దేశం టర్కీలో ఉన్నాడు. అతనికి ఫోన్ చేసి.. ఈ విషాద ఘటన కు సంబంధించిన సమాచారాన్ని గ్రామస్థులు తెలియజేశారు. కానీ అక్కడ యుద్ధ పరిస్థితులు నెలకొనడంతో అతను స్వదేశానికి చేరుకుంటాడా.. లేదా.. అన్న ఆందోళన అందరిలో ఉంది. దీంతో గ్రామస్థులు మానవత్వంతో ముందుకొచ్చారు. తల్లి, తమ్ముడి మృతదేహాలను ఇంటి ముందు ఉంచి పెద్ద కొడుకు వచ్చే వరకు వేచి చూస్తున్నారు. ఎప్పుడెప్పుడు ఆ కొడుకు వస్తాడా అన్న ఆశతో ఎదురు చూస్తున్నారు గ్రామస్తులు..
అప్పులు ఒక ప్రాణాన్ని తీయగా.. కొడుకు చనిపోయిన బాధ మరో ప్రాణాన్ని తీసింది. యుద్ధం మూడో కొడుకును ఇంటికి రానీయకుండా అడ్డుకుంటోంది.. దీంతో… ఉగాది పండుగ పూట ఈ గ్రామంలో విషాదం నెలకొంది
Also read
- Lord Shani: శత్రువెవరో మిత్రులెవరో తెలుస్తుంది..! శని దోషం కూడా వీరికి ఒక వరమే!
- Garuda Purana: కాకి పిండం తింటే పితృ దేవతలకు చేరినట్టేనా..? అసలు గరుడ పురాణం ఏం చెప్తుంది
- Vijayawada Accident: ఒక చేత్తో సెల్ఫోన్.. మరో చేత్తో డ్రైవింగ్.. అదుపుతప్పి కిందపడ్డ యువతి
- సంగారెడ్డిలో కిడ్నాప్ గ్యాంగ్ హల్చల్.. ఐదుగురు పిల్లలను..
- బాలికతో అసభ్య ప్రవర్తన కేసు.. హెడ్ కానిస్టేబుల్ కు పదేళ్ల జైలుశిక్ష





