బెట్టింగులకు బానిసై అప్పుల్లో కూరుకుపోయిన సాఫ్ట్‌వేర్ ఉద్యోగి సూసైడ్ చేసుకున్నాడు. బెట్టింగుల కారణంగా అయిన అప్పుల బాధ భరించలేక రమణబాబు తుని రైల్వే స్టేషన్ దగ్గర రైలు పట్టాలపై ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడు ఉద్దండపురంలో ఉంటూ వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నాడు.
బెట్టింగ్ భూతం ఎందరో యువకుల ప్రాణాలు బలిగొంది. తాజాగా మరో ఘటన కాకినాడ జిల్లా తుని రైల్వే పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. బెట్టింగ్‌కు బానిసైన సాఫ్ట్‌వేర్ ఉద్యోగి సోమవారం ఆత్మహత్య చేసుకున్నాడు. బెట్టింగ్ వేస్తూ అప్పుల్లో కూరుకుపోయిన కొలనాటి మరణబాబు రైలు కింద పడి చనిపోయాడు. మృతుడు అనకాపల్లి జిల్లా నక్కపల్లికి చెందిన సాఫ్ట్‌వేర్ ఎంప్లాయ్. రమణబాబు ఉద్దండపురం గ్రామంలో ఉంటూ వర్క్ ఫ్రం హోమ్ చేస్తున్నాడు.
సోమవారం రైలు కింద పడి బలవన్మరణానికి పాల్పడ్డాడు. రమణబాబు పూర్తిగా బెట్టింగ్‌కు బానిసై జీతం డబ్బులు కూడా ఇంటికి ఇవ్వకపోయేది. బెట్టింగ్స్ వేస్తూ అప్పులపాలైన రమణబాబు అప్పుల బాధ బరించలేక ఇక తనకు చావే దిక్కనుకున్నాడు. రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Also Read
- Vijayawada:పోలీస్ ల నుండి తప్పించుకునేందుకు.. అపార్ట్మెంట్ పైనుంచి దూకేసిన యువకుడు
- Guntur: కాల్ బాయ్‌గా చేస్తే సూపర్ ఇన్‌కం.. టెమ్ట్ అయి కమిటయిన కొందరు.. ఆ తర్వాత
- Hyderabad: చదువుకోమని తల్లి మందలించిందని..
- Crime News: కరీంనగర్లో దారుణం.. బాలికపై గ్యాంగ్ రేప్.. ఆపై వీడియో తీసి..
- BIG BREAKING: తెనాలిలో కలకలం.. పట్టపగలు నడిరోడ్డుపై దారుణ హత్య!