శ్రీ కాళిదాస్ సేవా సమితి ప్రారంభం.
ఒంగోలు::
సమాజ హితం కోరి తమ కార్యాలను సైతం ప్రక్కన పెట్టి దేశ సేవలో, అభాగ్యుల సేవలో ఎందరో తమ జీవితాలను త్యాగం చేశారు, అలాంటి వారిలో తీగల కాళిదాసు ఒకరు అని మాజీ శాసనసభ్యులు భారతీయ జనతా పార్టీ నాయకులు దారా సాంబయ్య పేర్కొన్నారు.


స్థానిక మంగమూరు రోడ్డు, గాంధీనగర్ లో తీగల కాళిదాస్ ప్రథమ వర్ధంతి సందర్భంగా తీగల కేదార్నాథ్ సత్యవతి దంపతుల నిర్వహణలో ప్రారంభమైన సామాజిక సేవ సంస్థ శ్రీ కాళిదాసు సేవా సమితి ప్రారంభ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొని తీగల కాళిదాస్ చిత్రపటానికి పూలమాలాంకృతం చేసి నివాళులర్పించారు. “శ్రీ కాళిదాసు సేవా సమితి” పేరుతో సంస్థను ఏర్పాటు చేసి సామాజిక సేవలు నిర్వహించాలని నిర్ణయించుకున్న తీగల కేదార్నాథ్ సత్యవతి లను అభినందించారు.
ఈ సందర్భంగా దేశ భక్తులు, జాతీయతావాది, కవి, రచయిత, సంఘసంస్కర్త, రాష్ట్రీయ స్వయం సేవక్ తీగల కాళిదాస్ వ్యక్తిత్వాన్ని, సంఘ పరివార్ సభ్యునిగా నిర్వహించిన అనేక విషయాలను, వారిచే విరచితమైన రచనలను కాళిదాస్ చిరకాల మిత్రులు చెంగంశెట్టి శివరామకృష్ణ వివరించారు. తండ్రి పేరును చిరస్థాయిగా నిలవడానికి సామాజిక సేవా సమితిని ఏర్పాటు చేసి ఈ సందర్భంగా పలువురు పేద మహిళలు, పురుషులకు వస్త్ర దానం చేశారు.
స్వర్గీయ కాళిదాస్ కుమారుడు కేదార్నాథ్ మరియు కోడలు భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యదర్శి తీగల సత్యవతి మాట్లాడుతూ తీగల కాళిదాసు పేరున వారి స్ఫూర్తితో సామాజిక సేవలు నిర్వహించడానికి సేవా సమితి స్థాపించామని వారి పేరున ప్రతి సంవత్సరం అనేక కార్యక్రమాలు సామాజిక సేవలు నిర్వహించడానికి నిర్ణయం తీసుకున్నామని తెలిపారు.
కార్యక్రమంలో బి విజయరావు, జజ్జర కృష్ణవేణి, ధనిశెట్టి పావని రాము మరియు పలువురు కాళిదాస్ స్నేహితులు, అభిమానులు, సంఘ సభ్యులు పాల్గొన్నారు.
Also read
- హనుమాన్ జయంతిని ఏడాదిలో రెండు సార్లు ఎందుకు జరుపుకుంటారో తెలుసా..
- ఆర్ధిక ఇబ్బందులా, జీవితంలో సమస్యలా హనుమాన్ జయంతి రోజున ఇంట్లో ఇలా పూజ చేయండి..
- హనుమంతుడికి ఇష్టమైన ఈ నైవేద్యం పెడితే మీ కోరికలు నెరవేరుతాయి..!
- సతీసమేత హనుమంతుడు..! తెలంగాణలో ఈ ప్రత్యేక ఆలయం
- Nellore: నెల్లూరు జిల్లాలో భర్త, అత్తమామల పైశాచికం.. కోడలిని వివస్త్రను చేసి హత్య!
Duvvada Srinivas: అటా.. ఇటా.. రచ్చ రచ్చ.. దువ్వాడ ఫ్యామిలీ సర్కస్.. అర్ధరాత్రి ఏం జరిగిందంటే..