ఓ చిన్నపాటి వివాదం ఒకరి ప్రాణం తీసింది. ఇరుగు పొరుగున ఉండేవారి మధ్య పశువును కట్టే విషయంలో చిన్న వివాదం మొదలైంది. అది కాస్త తీవ్రమై ఓ వివాహిత మృతికి దారి తీసింది. ఈ సంఘటన తెలంగాణలోని కామారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి.
Crime News: ఇరుగు పొరుగున ఉండేవారి మధ్య చిన్న చిన్న గొడవలు జరుగుతుంటాయి. అప్పటికప్పుడు పరిష్కారమవుతుంటాయి. అలా జరిగిన ఓ చిన్న గొడవ ఒకరి ప్రాణం తీసింది. పరస్పరం గొడవ పడిన అనంతరం దాడి చేసుకునే స్థాయికి చేరుకుంది. చివరికి ఓ వివాహిత మృతి చెందింది. పశువును కట్టే స్థలం విషయంలో ఇద్దరు మహిళల మధ్య మొదలైన గొడవ.. చివరకు 55 ఏళ్ల మహిళ మృతికి దారితీసింది. కామారెడ్డి జిల్లాలోని గాంధారి మండలం నేరల్ తండాలో జరిగిన ఈ ఘటన కలకలం రేపింది. ఘర్షణను అడ్డుకునేందుకు వెళ్లిన మదారి బాయిపై కర్రతో దాడి జరిగినట్లు స్థానికులు చెబుతున్నారు. ఘటనతో గాంధారిలో ఉద్రిక్తత నెలకొనగా, పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
కామారెడ్డి జిల్లా గాంధారి మండలం నేరల్ తండాలో పశువును కట్టే స్థలం విషయంలో ఇద్దరు మహిళల మధ్య వివాదం తలెత్తింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మదారి బాయి ఇంటి పక్కనే నివసించే ఇద్దరు మహిళల మధ్య గేదెను తన స్థలంలో ఎందుకు కట్టేశావనే విషయంపై వాగ్వాదం మొదలైంది. కొద్దిసేపటికే ఈ వివాదం తీవ్ర రూపం దాల్చింది. ఇరువురి మధ్య జరుగుతున్న గొడవను ఆపేందుకు మధ్యలోకి వెళ్లిన మదారి బాయిపై పూర్ణ అనే మహిళ కర్రతో దాడి చేసినట్లు సమాచారం. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన ఆమెను గాంధారిలోని ఓ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారు.
మహిళ మృతి చెందిన విషయం తెలియడంతో తండావాసులు భారీగా గాంధారికి చేరుకున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఇరువర్గాలను సముదాయించారు.ప్రస్తుతం ఘటనకు దారితీసిన పరిస్థితులపై పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు.దాడికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
పంట పొలాల్లో చైన్ స్నాచింగ్
నగరాలు, పట్టణాల్లో జరుగుతున్న చైన్ స్నాచింగ్ ఘటనలు ఇప్పుడు పల్లెలకు పాకాయి. పంట పొలాల్లో పనిచేస్తున్న ఓ మహిళ మెడలో పుస్తెలతాడు దొంగతనం చేసేందుకు ప్రయత్నించారు. ఈ సంఘటన సంగారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది. సంగారెడ్డి జిల్లా జిన్నారం మండంలోని సోలక్ పల్లి గ్రామంలో కిష్టమ్మ తన వ్యవసాయ క్షేత్రంలో గురువారం పొలం పనులు చేస్తుండగా ఇద్దరు వ్యక్తులు బైక్ పై వచ్చారు. ఆమె మెడలో ఉన్న పుస్తెలతాడు లాక్కున్న ప్రయత్నం చేశారు. కిష్టమ్మ కేకలు వేయడంతో చుట్టుపక్కల ఉన్న పొలాల్లో వ్యవసాయం చేస్తున్న వారు వచ్చి ఆ ఇద్దరు నిందితులకు దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. నిందితులు ఇద్దరు హత్నూర మండలం ముచ్చర్లకు గ్రామానికి చెందిన వడ్డే సాయిలు, మీనంపల్లి అరవింద్ అని గుర్తించారు. వారిద్దరూ పాత నేరస్తులని.. వారిపై పలు కేసులు ఉన్నాయని జిన్నారం సీఐ నాగార్జున గౌడ్ తెలిపారు. నిందితులు ఇద్దరిపై హత్నూర పోలీస్ స్టేషన్లో నాలుగు కేసులు ఉన్నాయని చెప్పారు. నిందితులపై కేసు నమోదు చేసి పోలీసులు రిమాండ్కు తరలించారు.
Also read
- UP News: బ్లూ డ్రమ్ముల్లో నోట్ల కట్టలు.. భూమి కింద కోట్ల రూపాయల నగదు..
- Chennai: పట్టపగలే దారుణం.. బిర్యానీ సెంటర్ క్యాషియరై కత్తులతో దాడి, నగదు లూటీ..!
- ఎక్సెజ్ కానిస్టేబుల్ సాహసం: అర కిలోమీటరు ఛేజ్ చేసి దొంగను పట్టుకున్న వైనం
- Gold Hunt: ఓ వైపు తుఫాన్.. మరోవైపు ఉప్పాడ తీరంలో బంగారం కోసం వేట..
- Tragedy: అది ఆత్మహత్య కాదు.. ఫోన్ ఎక్కువగా వాడుతోందని కుమార్తెను గొంతు నులిమి చంపిన కన్నతల్లి..





