చెన్నైలో దారుణం జరిగింది. మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి భద్రతా విభాగంలో ఎస్‌ఐగా పనిచేసిన జాకీర్‌హుస్సేన్(57)ను దుండగులు వేటకొడవళ్లతో నరికి నరికి చంపారు. భూవివాదమే దీనికి కారణమై ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. కాగా హత్య చేసిన వారిలో ఇద్దరు లొంగిపోయారు
చెన్నైలో దారుణం జరిగింది. పట్టపగలే నడిరోడ్డుపై ఎస్సైను అతి కిరాతకంగా కొందరు దుండగులు హత్య చేశారు. వేటకొడవళ్లతో తలపై నరికి నరికి చంపారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో సైతం నెట్టింట వైరల్‌గా మారింది. అది చూసి నెటిజన్లు ఖంగుతింటున్నారు. నేటి సమాజంలో ఒక పోలీస్‌కే రక్షణ లేకపోతే సామాన్యుల పరిస్థితి ఏంటని చర్చించుకుంటున్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే
దారుణ హత్య
జాకీర్‌హుస్సేన్ (57) గతంలో మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి భద్రతా విభాగంలో ఎస్‌ఐగా పనిచేశాడు. రంజాన్ ఉపవాస దీక్షలో భాగంగా దర్గాకు వెళ్ళి ఇంటికి తిరిగి పయనమయ్యాడు. అదే సమయంలో కొందరు దుండగులు బైక్‌పై వచ్చి జాకీర్ హుస్సేన్‌ను వేటకొడవళ్లతో దాడిచేసి అతి కిరాతకంగా హత్య చేశారు. వారిబారి నుంచి తప్పించుకునేందుకు జాకీర్ ఎంత ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. అతడు కారులో ఉండగానే కత్తులతో దాడి చేసి మెరుపువేగంతో పరారయ్యారు.
కారణం ఇదే?
నడి రోడ్డుపై జరగడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తిరునల్వేలి గవర్నమెంట్ హాస్పిటల్‌కు తరలించారు. అయితే ఈ హత్య ఒక స్థలం వివాదం కారణంగా జరిగినట్లు తెలుస్తోంది. తొట్టిపాళం మెయిన్ రోడ్డులో 36 సెంట్ల భూమికి సంబంధించి జాకీర్‌హుస్సేన్‌కు అదే ప్రాంతానికి చెందిన మరో వ్యక్తికి ఇది వరకే పాత గొడవలు ఉన్నట్లు సమాచారం.
ఇదే విషయంలో ఈ ఇద్దరూ ఒకరిపై ఒకరు కక్షలు సాధించుకున్నట్లు సమాచారం. ఇందులో భాగంగానే జాకీర్ హుస్సేన్‌ను హత్య చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఇక ఈ హత్య చేసిన తర్వాత నిందితులలో అక్బర్ బాషా, తవఫీక్ అనే ఇద్దరు పోలీసులకు లొంగిపోయినట్లు తెలిసింది.
Also read
- సీతాదేవి తనువు చాలిస్తూ భూమిలో ఐక్యం అయిన ప్రదేశం ఎక్కడుందో తెలుసా..
- దైవ దర్శనకోసం వెళ్తే దారుణం.. ఆ రోజు రాత్రి ఏం జరిగిందంటే.. సంచలన విషయాలు..
- శ్రీ రామ నవమి పండగ విషయంలో గందరగోళం.. ఏప్రిల్ 5 లేదా 6 ఎప్పుడంటే
- మహిళల రుతు సమయం గురించి గరుడ పురాణం ఏం చెబుతుందో తెలుసా..?
- AP Crime: ఏపీలో దారుణం.. యువకుడిపై పెట్రోల్ పోసి నిప్పంటించిన యువతి!