హైదరాబాద్ లో ఓ SI నీచమైన చర్యకు పాల్పడ్డాడు. ఓ మహిళా భర్త వేధింపులపై ఫిర్యాదు చేయడానికి పోలీస్ స్టేషన్ కి వెళ్ళింది. అయితే కేసు నమోదు చేసే క్రమంలో ఆమె నెంబర్ తీసుకున్న SI సైదులు మహిళను వేధింపులకు గురిచేశాడు. కేసు పరిష్కరిస్తా.. తన కోరిక తీర్చలాంటు ఒత్తిడి చేశాడు.
Hayathnagar: ప్రజలు ఏదైనా ఆపద వస్తే తమ ఆత్మరక్షణ కోసం పోలీసులు, న్యాయస్థానాలను ఆశ్రయిస్తారు. కానీ పోలీసులే వారి రక్షణకు భంగం కలిగించేలా ప్రవర్తిస్తే…? ఇలాంటి సంఘటనే హైదరాబాద్ లో చోటుచేసుకుంది. ఉన్నతమైన పోలీస్ అధికారి పదివిలో ఉండి నీచమైన చర్యకు పాల్పడ్డాడు ఓ SI. కేసు పరిష్కరిస్తా.. కోరిక తీరుస్తావా అంటూ మహిళ పట్ల దుర్మార్గంగా ప్రవర్తించాడు.
ఓ మహిళా తన భర్త వేధింపులపై ఫిర్యాదు చేయడానికి హయత్‌నగర్‌లోని పోలీస్ స్టెన్షన్ కి వెళ్ళింది. అయితే అక్కడ కేసు నమోదు చేసే క్రమంలో ఆ మహిళా ఆమె ఫోన్ నెంబర్ తీసుకున్న స్టేషన్ SIసైదులు నీచానికి తెగించాడు. రోజూ ఆమెకు ఫోన్ చేస్తూ వేధింపులకు గురిచేశాడు. వాట్సప్‌లో మెసేజ్ లు పంపడం.. ఇంట్లో ఎవరూ లేని సమయంలో వస్తాను అంటూ మహిళను టార్చర్ చేశాడు. న్యాయం కోసం వెళితే కమిట్మెంట్ అడిగాడు. కేసు పరిష్కరిస్తా.. తన కోరిక తీర్చాలంటూ ఆ మహిళను ఒత్తిడి చేశాడు SI సైదులు. వేధింపులు తట్టుకోలేకపోయిన మహిళ SI సైదులు పై రాచకొండ కమిషనర్ సుధీర్ బాబుకు ఫిర్యాదు చేసింది. దీంతో ఈ కీచక SI బాగోతం బయటపడింది. గత 40 రోజులుగా వేధిస్తున్నట్లు మహిళ ఫిర్యాదులో పేర్కొంది
Also read
- అమెరికా వీసా రాక యువతి ఆత్మహత్య
- తల్లితో వివాహేతర సంబంధం.. కూతురుపై అత్యాచారం..!
- Andhra: రేయ్.. ఏంట్రా ఇది.. బయట బోర్డేమో ఒకటి.. లోపల మాత్రం కథ వేరు.. అనుమానం వచ్చి వెళ్లగా..
- AP Crime: నెల్లూరులో దారుణం.. మహిళను వేధించాడు.. నడి రోడ్డుపై నరికారు
- నేటి జాతకములు….14 ఆగస్టు, 2025