April 16, 2025
SGSTV NEWS
Andhra PradeshSpiritual

విజయ దుర్గాదేవిగా శ్రీ వాసవి మాత.- దుర్గాష్టమి సందర్భముగా వాసవికి అష్టఫల నివేదన.

విజయ దుర్గాదేవిగా శ్రీ వాసవి మాత.
– దుర్గాష్టమి సందర్భముగా వాసవికి అష్టఫల నివేదన.

ఒంగోలు::

దేవీ శరన్నవరాత్రి మహోత్సవంలో భాగంగా గురువారం దుర్గాష్టమి పర్వదినాన్ని పురస్కరించుకొని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవి విజయ దుర్గా దేవిగా భక్తులను అనుగ్రహించారు.
ఒంగోలు అమలనాధుని వారి వీధిలో కొలువైయున్న ఆర్యవైశ్యుల ఇలవేల్పు శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవి దేవస్థానంలో ఆలయ తది ఆరాధన సంఘం ఆధ్వర్యంలో జరుగుతున్న దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి గురువారం ఉదయం ఆలయ అర్చకులు శర్మ సాయి శ్రీ సూక్త సహితంగా గంధంతో అమ్మవారిని అభిషేకించారు

అనంతరం అలంకార స్వామి బండేపల్లి వెంకటేశ్వర శాస్త్రి అమ్మవారిని విజయ దుర్గాదేవిగా అలంకరించారు తదుపరి అమ్మవారికి అష్టఫల నివేదన సహస్రనామార్చన మంత్రపుష్పం శాస్త్రోక్తంగా నిర్వహించారు. సాయంత్రం శ్రీ వాసవి కోలాట భజన మండలి వారిచే గుడి ఉత్సవంలో వాసవిమాత పాటలకు కోలాటం ఆడారు.
పెద్ద సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించి భక్తితో అలౌకిక ఆనందం పొందారు.

Also read

Related posts

Share via