November 22, 2024
SGSTV NEWS
Andhra PradeshSpiritual

ఘనంగా శ్రవణా నక్షత్రం శ్రీగిరి గిరి ప్రదక్షిణ- పెద్ద సంఖ్యలో మహిళా భక్తులు.


ఒంగోలు::

సామూహికంగా భక్తులందరూ స్వామి వారి గోవింద నామాలను చదువుచూ శ్రీగిరి గిరి ప్రదక్షిణ చేసి శ్రీగిరి పై కొలువైయున్న శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకోవడం అలౌకిక ఆనందాన్ని అందిస్తుందని శ్రీగిరి గిరి ప్రదక్షిణ కమిటీ ఉపాధ్యక్షులు దాసరి నారాయణ రావు, కార్యదర్శి త్రిపురం మల్లిఖార్జున రావు పేర్కొన్నారు.



శ్రీ వెంకటేశ్వర స్వామి వారి జన్మ నక్షత్రం శ్రవణా నక్షత్రమును పురస్కరించుకొని శ్రీగిరి గిరి ప్రదక్షిణ కమిటీ ఆధ్వర్యంలో గురువారం వందలాది మంది భక్తులు గోవింద నామాలు పలుకుతూ, స్వామివారి ఉత్సవ విగ్రహమును ఊరేగింపు చేస్తూ గరుడ, హనుమాన్, శంఖు, చక్ర, నామాలు చేతబట్టి శ్రీగిరి పాదపీఠం వద్ద గల బాపూజీ గో శాల వద్ద గోపూజ నిర్వహించారు. గోమాత ముందు నడువగా నాదస్వరము రవముల  మధ్య శ్రీగిరి గిరి ప్రదక్షిణ పూర్తి చేశారు అనంతరం స్వామివారిని దర్శించి పరవశులైనారు.

శ్రీగిరి గిరి ప్రదక్షిణ కమిటీ అధ్యక్షులు రాగారముల గుప్తా జంధ్యం, సహకాదర్శి నేరెళ్ల శ్రీనివాసరావు, కార్యవర్గ సభ్యులు ధనిశెట్టి రాము తదితరులు కార్యనిర్వహణ చేశారు. పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు. గిరి ప్రదక్షిణ మార్గంలోని పలు దేవాలయములలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్థానిక భగీరథ సెంటర్ భగీరథ ఆలయం వద్ద సగర పుత్రులు ప్రదక్షణలో పాల్గొన్న భక్తులకు పాల ప్రసాదం అందించారు.

గిరి ప్రదక్షిణ అనంతరం భక్తులకు అన్నప్రసాదాన్ని వితరణ చేశారు ఈ సందర్భంగా అన్నప్రసాద కైంకర్యదారులకు శాలువ కప్పి స్వామి వారికి ఆశీస్సులు అందించారు.

Also read

Related posts

Share via