గుంటూరులో అశ్లీల వీడియోలు కలకలం రేపాయి. గుంతకల్‌లో కాల్ సెంటర్ పేరుతో శృంగార వీడియోలు తీసి పోర్న్ సైట్లకు సరఫరా చేస్తున్న వారిని పోలీసులు అరెస్టు చేశారు. వీటితో పాటు లైవ్ షోస్‌ను కూడా విక్రయిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.
పోర్న్ సైట్లకు ఏపీ నుంచి వీడియోలు సరఫరా చేస్తున్న ముఠాని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వివరాల్లోకి వెళ్తే.. గుంటూరు జిల్లా గుంతకల్‌కు చెందిన లూయిస్ కాల్ సెంటర్ నడుపుతున్నాడు. ఈ కాల్ సెంటర్‌లో పనిచేసే వారితో బలవంతంగా అశ్లీల వీడియోలు చిత్రీకరిస్తున్నాడు. ఈ వీడియోలను అశ్లీల వెబ్‌సైట్లకు సరఫరా చేస్తున్నారు. ఈ ముఠాను అరెస్టు చేసినట్లు ఈగల్, సైబర్ సెక్యూరిటీ ఐజి ఆకే రవి క్రిష్ణ తెలిపారు.
క్రిప్టో కరెన్సీ ద్వారా చెల్లింపులు చేస్తూ..
కేవలం వీడియోలతో పాటు లైవ్ షోస్‌ను కూడా వెబ్‌సైట్లకు ఇస్తున్నట్లు గుర్తించారు. క్రిప్టో కరెన్సీ ద్వారా చెల్లింపులు చేస్తున్నారు. సైప్రస్ దేశానికి చెందిన వారితో ఆన్‌లైన్ చెల్లింపులు చేస్తున్నారు. ఈ వీడియోలను నిషేధిత అశ్లీల వెబ్‌సైట్స్‌కు విక్రయించినట్లు గుర్తించారు. దీంతో గుంతకల్‌కు చెందిన లూయిస్, శ్రీకాకుళంకు చెందిన గణేష్, జ్యోత్స్నలను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఇంకా ఉంది
Also read
- అమెరికా వీసా రాక యువతి ఆత్మహత్య
- తల్లితో వివాహేతర సంబంధం.. కూతురుపై అత్యాచారం..!
- Andhra: రేయ్.. ఏంట్రా ఇది.. బయట బోర్డేమో ఒకటి.. లోపల మాత్రం కథ వేరు.. అనుమానం వచ్చి వెళ్లగా..
- AP Crime: నెల్లూరులో దారుణం.. మహిళను వేధించాడు.. నడి రోడ్డుపై నరికారు
- నేటి జాతకములు….14 ఆగస్టు, 2025