తూర్పు గోదావరి :- గోపాలపురం నియోజకవర్గం నల్లజర్ల మండలం దూబచర్ల గ్రామంలో నిన్న రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి చెప్పులు దండ వేసి దండుగులు అవమానపరిచారు. ఈ కార్యక్రమంలో గోపాలపురం జనసేన పార్టీ నియోజకవర్గం నాయకులు దొడ్డిగర్ల సువర్ణ రాజు మాట్లాడుతూ..నేను ఖండిస్తూ తప్పు చేసిన వ్యక్తులను పట్టుకుని శిక్ష పడేలా చేయాలని ఇలాంటి పరిస్థితులు జిల్లాలోని ఎక్కడా కూడా మరల జరగకుండా ఉండేలాగా చేయాలని, నిన్న అంబేద్కర్ విగ్రహం దగ్గరికి వెళ్లి నిరసన తెలిపి వెంటనే దోషులను పట్టుకుని శిక్ష పడాలని కోరుతూ.. ఈ విషయాన్ని మేము ఖండిస్తున్నాం. ఈ రోజు జనసేన పార్టీ తరఫున అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేసి నిరసన తెలియజేసి అవమానపరిచిన వ్యక్తులను పట్టుకుని దోషులను శిక్షించాలన్న ఉద్దేశంతో పిలుపునిచ్చినటువంటి కార్యక్రమంను కొన్ని అనువార్య కారణాలవల్ల మూడు రోజులు పోస్ట్ ఫోన్ చేయడం జరిగింది. ఈ లోపు అధికారులను విన్నవించుకునేది ఏమనగా దోషులను పట్టుకుని అతని కఠినంగా శిక్షించి మన జిల్లాలోని ఇలాంటి పరిస్థితులు మరలా ఎప్పుడు జరగకుండా చూడాలని గోపాలపురం నియోజకవర్గం లో ఇలాంటి పరిస్థితులు ఎప్పుడు రాలేదని, కూటమి ప్రభుత్వం ఏర్పడి ఎన్నో మంచి పనులు చేసుకుంటూ సాగే ఈ ప్రయాణంలో ఇలాంటి దౌర్భాగ్య పరిస్థితులను ఎదుర్కోవడం చాలా బాధాకరం. తక్షణం మూడు రోజుల్లో దోషులను పట్టుకొక పోతే దళితులు, ప్రజా సంఘాలు భారీగా ఉద్భవించే విధంగా ఉందన్నారు. మా యందు దయ ఉంచి మహనీయుడికి జరిగిన ఈ అవమానాన్ని ఖండించి దోషులను పట్టుకోవాలని జనసేన పార్టీ తరఫున కోరుచున్నాము. అదేవిధంగా నల్లజర్ల మండలం,ముసళ్ళ గుంట గ్రామంలోని ఎన్టీఆర్ గారి విగ్రహానికి కూడా చెప్పులు తండా వేసిన దుర్మార్గులకు శిక్ష పడాలని కోరుతూ… మహనీయుడు రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ , మరియు తెలుగుదేశం పార్టీ మహా నాయకుడు ఎన్టీ రామారావు విగ్రహానికి ఈ గోపాలపురం నియోజకవర్గంలో ఇలా జరగడం చాలా బాధాకరమైన సంఘటన అన్నారు…
Also read
- అమెరికా వీసా రాక యువతి ఆత్మహత్య
- తల్లితో వివాహేతర సంబంధం.. కూతురుపై అత్యాచారం..!
- Andhra: రేయ్.. ఏంట్రా ఇది.. బయట బోర్డేమో ఒకటి.. లోపల మాత్రం కథ వేరు.. అనుమానం వచ్చి వెళ్లగా..
- AP Crime: నెల్లూరులో దారుణం.. మహిళను వేధించాడు.. నడి రోడ్డుపై నరికారు
- నేటి జాతకములు….14 ఆగస్టు, 2025