మచిలీపట్నంలో వైద్యం వికటించి ఏడు నెలల నిండు గర్భిణి మృతి చెందింది. ఈ ఘటన మంగళవారం రాత్రి నోబుల్ కాలేజీ రోడ్డులోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చోటుచేసుకుంది. మృతురాలు పెడన మండలం జింజేరు గ్రామానికి చెందిన గర్భిణి కట్టా దుర్గా మల్లేశ్వరి((27)గా గుర్తింపు.
AP Crime: కృష్ణా జిల్లా మచిలీపట్నంలో విషాదం చోటుచేసుకుంది. వైద్యం వికటించి ఏడు నెలల నిండు గర్భిణి మృతి చెందింది. ఘటన మంగళవారం రాత్రి చోటు చేసుకుంది. నగరంలోని నోబుల్ కాలేజీ రోడ్డులోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో ఈ ఘటన చోటు చేసుకుంది. పోలీసులు తెలిసిన వివరాలు ఇలా ఉన్నాయి. పెడన మండలం జింజేరు గ్రామానికి చెందిన గర్భిణి కట్టా దుర్గా మల్లేశ్వరి((27) ఆస్పత్రిలో వైద్యం తీసుకుంటోంది. ఎప్పటి మాదిరి మంగళవారం ఉదయం వైద్యం కోసం ఆస్పత్రికి వెళ్లింది. ఆమెకు పలు పరీక్షలు చేయాలని డాక్టర్లు తెలిపారు.
ఇంజక్షన్ వికటించి..
దీని కోసం రూ.700 కట్టించుకుని మధ్యాహ్నం సమయంలో మల్లేశ్వరి ఇంజక్షన్ చేశారు. అయితే.. కొంతసేపటికి ఆమె ఆస్వస్థతకు గురయింది. వెంటనే స్పందించిన ఆస్పత్రి సిబ్బంది ఐసీయూలో చికిత్స అందించారు. సాయంత్రం ఐదు గంటల సమయంలో మల్లేశ్వరి మృతి చెందినట్లు డాక్టర్లు తెలిపారు. దీంతో బంధువులు ఆస్పత్రి సిబ్బందిపై తీవ్ర ఆందోళన చెందారు. డాక్టర్ల నిర్లక్ష్యంతో మల్లేశ్వరి చనిపోయిందని బంధువులు కన్నీరు మున్నీరయ్యారు. మల్లేశ్వరి మృతితో ఆందోళన వ్యక్తం చేసిన బంధువులు వైద్యురాలి ఐసీయూ గదిలోని ఫర్నీచర్‌ను ధ్వంసం చేశారు. డాక్టర్ చేసిన ఇంజక్షన్ వికటించి ఆమె చనిపోయిందని బాధితులు ఆరోపిస్తున్నారు
నిండుగర్భిణి చనిపోయిందని బాధతో ఉన్న బంధువులను సెటిల్‌మెంట్ చేసుకుందామని రావాలంటూ మల్లెశ్వరి భర్త, డాక్టర్లతోతోపాటు మరికొందరు చెప్పారు. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన కుటుంబ సభ్యులు, బంధువులు ఫర్నిచర్‌ను ధ్వంసం చేశారు. గర్భిణి మృతికి కారణమైన ఆస్పత్రిని సీజ్ చేయాలని, ప్రజాప్రతినిధులు న్యాయం చేయాలని మృతిరాలి బంధువులు డిమాండ్ చేస్తున్నారు. ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు ఆస్పత్రి వద్దకు చేరుకున్నారు. అనంతరం మృతిచేందిన గర్బిణి మృతదేహాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు
Also Read
- కాకినాడలో విషాదం.. పసిపిల్లల పాలిట మృత్యువుగా మారిన తండ్రి
- Hyderabad: అనుమానాస్పదంగా ఫుడ్ డెలివరీ బాయ్.. డౌట్ వచ్చి.. సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేయగా
- HYD: హైదరాబాద్ లో దారుణం..హోలీ పేరుతో యాసిడ్ దాడి
- Hyd Drugs: గంజాయి ఐస్‌క్రీమ్‌తో ఎంజాయ్.. హోళీ వేడుకల్లో పోలీసులకు చిక్కకుండా ప్లాన్.. షాకింగ్ వీడియో!
- AP News: రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తుండగా కనిపించిన నల్లటి బ్యాగ్.. తెరిచి చూడగా