*
ఏప్రిల్, మే నెలలకు పెన్షన్ పంపిణీపై గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) సీఈఓ సర్క్యులర్ జారీ చేశారు. పెన్షన్ పంపిణీకి సంబంధించి వాలంటీర్లు ఆథరైజేషన్ పత్రాలు తీసుకోవాలని సర్క్యులర్ జారీ చేయడం గమనార్హం.
ఎన్నికల కోడ్ దృష్ట్యా పెన్షన్ నిధులను తీసుకెళ్లే గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది, వాలంటీర్ల వద్ద ఆథరైజేషన్ పత్రం తప్పని సరిగా ఉండాలని సెర్ప్ పేర్కొంది. ఎంపీడీఓలు, మున్సిపల్ కమిషనర్లు, పంచాయితీ కార్యదర్శి, సంక్షేమ కార్యదర్శులు ఆథరైజేషన్లు ఇవ్వాలని ఆదేశించింది.
బ్యాంకుల నుంచి నగదు తీసుకుని పెన్షన్ పంపిణీ చేసే వాలంటీర్లకు ఆథరైజేషన్ పేపర్లు జారీ చేయాలని సూచించింది. పెన్షన్ పంపిణీ సమయంలో వాలంటీర్లు ఎలాంటి ప్రచారం నిర్వహించకూడదని ఆదేశాలు జారీ చేసింది. పెన్షన్ పంపిణీ చేసినట్టుగా ఫోటోలు, వీడియోలు తీయవద్దని సెర్ప్ తేల్చి చెప్పింది. పెన్షన్ పంపిణీ సమయంలో ఎన్నికల కోడ్ ఉల్లంఘన జరిగినట్టుగా తేలితే చర్యలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరికలు చేసింది.
Also read
- Job Astrology: గ్రహాల అనుకూలత.. ఈ రాశులకు పదోన్నతి, అధికార యోగాలు..!
- దీపావళి రోజున ఈ రాశుల జీవితాల్లో దీపాల వెలుగులు.. త్రిగ్రహి యోగంతో అపార సంపద
- TG Crime: జనగామ జైలులో కలకలం.. బ్లీచింగ్ పౌడర్ నీళ్లు తాగి రిమాండ్ ఖైదీ సూ**సైడ్.. కారణం ఇదేనా?
- Khammam : వీడు టీచర్ కాదు టార్చర్.. అబ్బాయిపై లైంగిక వేధింపులు.. రోజు రాత్రంతా!
- Dialysis: డయాలసిస్ కేంద్రాలకు వెళ్ళే వారికి కొత్తరోగాలు.. రాష్ట్రంలో షాకింగ్ ఘటనలు!