మణికొండ మున్సిపల్ డీఈఈ దివ్యజ్యోతిని మాజీ భర్త శ్రీపాద్ ఏసీబీకి పట్టించాడు. అక్రమంగా సంపాదించిన డబ్బు రోజూ ఇంటికి తీసుకొస్తుందని, వద్దని చెప్పిన వినకపోవడంతో భర్త వీడియోలు తీసి సాక్ష్యాలతో భార్యను ఏసీబీకి పట్టించాడు.
కట్టుకున్న భర్తే.. భార్య అవినీతిని బట్టబయలు చేసిన ఘటన రంగారెడ్డిలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. రంగారెడ్డి జిల్లా మణికొండ మున్సిపల్ డీఈఈ దివ్యజ్యోతి లంచం తీసుకుంటుందని తన భర్త శ్రీపాద్ భార్యను ఏసీబీకి పట్టించాడు. భార్య వేధింపులు భరించలేక విడాకులు ఇచ్చిన భర్త.. ఆమె అవినీతిని బయటపెట్టాడు. భార్య లేని సమయంలో ఇంట్లో ఉన్న నోట్ల కట్టలను భర్త వీడియోలు తీశాడు. తన భార్య దివ్యజ్యోతి ప్రతి రోజు లక్షలలో లంచం తీసుకొచ్చి ఇంట్లో ఎక్కడ పడితే అక్కడ పెడుతుందని భర్త బయటపెట్టాడు.
ఎక్కడ చూసిన నోట్ల కట్టలే..
ఇంట్లో ఎక్కడెక్కడ ఆమె నోట్ల కట్టలు ఉంచుతుందో వాటిన్నింటిని వీడియోలు తీశాడు. అక్రమ సొమ్ము వద్దని ఎన్నిసార్లు భర్త చెప్పిన వినిపించుకోలేదని, విసుగు చెంది విడాకులు ఇచ్చేశానని శ్రీపాద్ తెలిపారు. ఇంట్లో మొత్తం రూ.70 లక్షల వరకు ఉంటుందని ఆమె భర్త ఆరోపించాడు. ఇలా లంచం సొమ్ము దాదాపుగా రూ.కోటి వరకు తన సోదరుడికి ఇచ్చిందని శ్రీపాద్ తెలిపారు. అక్రమంగా డబ్బులు తీసుకోవడం తప్పని చెబితే తనని తిట్టేదని తెలిపారు. భార్య ఎంతకి మారకపోవడంతో సాక్ష్యాలతో మీడియా ముందు ఆమె అవినీతిని బయటపెట్టారు.
Also read
- AP News: స్వామి మాలలో ఖైదీకి టిఫిన్ తీసుకొచ్చిన వ్యక్తి.. అనుమానంతో బాక్స్ తెరిచి చూడగా
- ఈ ఏడాది కాల భైరవుడి జయంతి ఎప్పుడు.. శివ పురాణం ప్రకారం ఎలా అవతరించాడో తెలుసా..
- అత్తా.. నీ కూతురింక లేదు.. చంపేసిన!
- పెళ్లికి ఓకే చెప్పలేదని టీచర్‌పై రెచ్చిపోయిన ప్రేమోన్మాది.. క్లాస్ రూంలోనే..
- Andhra Pradesh: 10 నిమిషాల్లో ఇంటికి చేరేవారే.. కానీ అంతలోనే కబలించిన మృత్యువు!