April 15, 2025
SGSTV NEWS
CrimeNational

Chennai: భార్యపై అనుమానంతో బాత్‌రూమ్‌లో సీక్రెట్ కెమెరా.. టెక్‌ బిలియనీర్‌ కేసులో భయంకర నిజాలు!


చెన్నై టెక్‌ బిలియనీర్‌ ప్రసన్న, దివ్యా దంపతుల కేసులో మరిన్ని భయంకర నిజాలు బయటపడ్డాయి. తనకు వివాహేతర సంబంధం ఉందనే అనుమానంతో బాత్ రూమ్‌లో సీక్రెట్ కెమెరా పెట్టినట్లు దివ్యా తెలిపింది. ప్రసన్న వేశ్యలతో కూడా శృంగారంలో పాల్గొన్నట్లు బయటపెట్టింది.

చెన్నై టెక్‌ బిలియనీర్‌ ప్రసన్న శంకర్ కేసులో మరిన్ని భయంకర నిజాలు బయటపడ్డాయి. తన భార్య దివ్యాతో వివాదం కేసు విచారణ కొనసాగుతోంది. ఈ క్రమంలోనే దివ్యా మరో వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుందనే అనుమానంతో బాత్ రూమ్‌లో సీక్రెట్ సీసీ కెమెరా పెట్టినట్లు వెలుగులోకి వచ్చింది.

సెక్స్ టాయ్ గానే చూసేవాడు..
ఈ మేరకు ఇటీవల ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో దివ్యా మరిన్ని సంచలన విషయాలు బయటపెట్టింది. ప్రసన్న కేవలం తనను సెక్స్ టాయ్ గానే చూసేవాడని చెప్పింది. తన కోరికలు తీర్చకుంటే బెదిరించేవాడని, డెలివరీ సమయంలో నొప్పి అనుభవిస్తున్నప్పుడు కూడా బలవంతంగా శృంగారం చేయమని వేధించేవాడని వాపోయింది. అంతేకాదు వేశ్యలతో సంబంధాలు పెట్టుకున్నాడని చెప్పిన దివ్యా.. బాత్‌రూమ్ లోనూ సీక్రెట్ గా కెమెరాలు పెట్టి తనను వేధించినట్లు తెలిపింది. అతడితో నా సంబంధం లైంగికమైనది కాదు భావోద్వేగమైనది మాత్రమే అంటూ కన్నీరుపెట్టుకుంది

మా అబ్బాయి పుట్టిన వారంలోనే శృంగారంలో పాల్గొనాలంటూ వేధించినట్లు తెలిపింది. అంతేకాదు తాను ఒప్పుకోకపోతే మరో మహిళ దగ్గరకు వెళ్తానని, కావాలంటూ ఇంటికి కూడా తెచ్చుకుంటానంటూ భయాందోళనకు గురిచేసినట్లు చెప్పింది. ఈ విషయంలో గొడవపెట్టుకున్నందుకు టార్చర్ చేసిన ప్రసన్న మరింత దిగజారిపోయినట్లు వాపోయింది. తన మాట వినట్లేదని, తన ఫ్రెండ్స్‌తో పడుకోమంటూ దారుణంగా హింసించాడని చెప్పింది. ప్రస్తుతం దివ్య ఆరోపణలకు సంబంధించిన అంశం సోషల్ మీడియాలో చర్చనీయాంశమయ్యాయి.

Also Read

Related posts

Share via