శివమొగ్గ: అవినీతిని నిరసిస్తూ ఆత్మహత్య చేసుకున్న వాల్మీకి అభివృద్ధి పాలక మండలి అధికారి చంద్రశేఖర్ భార్య కవిత శనివారం అస్వస్థతకు గురయ్యారు. ఆమెను స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. వాంతులు అవుతూ నీరసంగా ఉండడంతో కవితాను ఆటోలో ఆమె కుమారుడు ఆస్పత్రికి తరలించాడు. చంద్రశేఖర్ ఆకస్మిక మరణంతో ఆమె తీవ్ర ఆవేదనలో ఉండిపోయింది. పదే పదే భర్తను తలుచుకుంటూ విలపిస్తోంది. సరిగ్గా భోజనం చేయలేదని, దీంతో అనారోగ్యం బారిన పడ్డారని కుటుంబ సభ్యులు తెలిపారు.
పరామర్శల వెల్లువ
మరోవైపు అధికారి ఆత్మహత్య నేపథ్యంలో పలువురు ముఖ్య నేతలు, నాయకులు చంద్రశేఖర్ ఇంటికి వచ్చి తమ సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల కోడ్ నేపథ్యంలో ఇప్పటివరకు మృతుని కుటుంబానికి ఎలాంటి పరిహారం అందించలేదు. ఎంతో మంది నేతలు ఇంటికి వచ్చి తమ సంతాపాన్ని తెలిపి రిక్త హస్తాలతో తిరిగి వెళుతున్నారు. మాజీ మంత్రి కేఎస్ ఈశ్వరప్ప మూడు లక్షల రూపాయలను ఆర్థిక సాయంగా మృతుని కుటుంబానికి అందించారు. ↑
Also read
- Mahabubnagar: ఛీ ఛీ.. మధ్యాహ్న భోజనం పప్పులో కప్ప.. పరుగులు తీసిన స్టూడెంట్స్
- Telangana: భార్య కామం.. మంత్రగాడి మోహం.. కట్ చేస్తే, భర్తను ఎలా లేపేశారో తెలుసా..?
- Vijayawada: ఉదయాన్నే జిమ్‌లో చాటుమాటు యవ్వారం.. పోలీసుల ఎంట్రీతో సీన్ సితారయ్యింది..
- Hyderabad: ఫామ్‌హౌస్‌లో 8 మంది మహిళలు, 23 మంది పురుషులు.. అర్థరాత్రి వేరే లెవల్ సీన్.. చివరకు
- Lawyer Kissing video: లైవ్‌లో మహిళకు లాయర్ ముద్దులు – కోర్టు మొత్తం షాక్