April 15, 2025
SGSTV NEWS
CrimeInternational

అమెరికాలో యూపీకి చెందిన సచిన్‌ సాహూ కాల్చివేత

మహిళను కారుతో ఢీకొట్టిన కేసులో అమెరికాలో భారత సంతతికి చెందిన అనుమానిత వ్యక్తిని పోలీసులు కాల్చి చంపిన ఘటన కలకలం రేపింది. నిందితుడు ఉత్తరప్రశ్‌కు చెందిన సచిన్ సాహు (42) గా గుర్తించారు. అతనికి అమెరికా పౌరసత్వం పొంది ఉండొచ్చని అధికార వర్గాలు తెలిపాయి. అమెరికాలోని శాన్ అంటోనియోలో ఈ ఘటన చోటు చేసుకుంది. మహిళను కారుతో ఢీకొట్టిన కేసులో అరెస్టు చేసేందుకు వచ్చిన ఇద్దరు అధికారులను సైతం కారుతో ఢీకొట్టడంతో పోలీసులు జరిపిన కాల్పుల్లో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. 

పోలీసుల ప్రాథమిక దర్యాప్తు ప్రకారం చెవియట్ హైట్స్‌ వద్ద వ్యక్తి మారణాయుధంతో సంచరిస్తు న్నట్టుగా  ఈ నెల 21న సాయంత్రం శాన్ అంటోనియో పోలీసులకు సమాచారం అందింది. దీంతో అక్కడికి చేరుకున్న అధికారులు 51 ఏళ్ల మహిళను  సాహు ఉద్దేశపూర్వకంగా వాహనంతో ఢీకొట్టినట్లు గుర్తించారు. ఆ తరువాత  అక్కడినుంచి పరారయ్యాడు.  బాధితురాల్ని ఆసుపత్రికి తరలించారు. సాహు ఢీకొట్టిన మహిళ అతని రూమ్ మేట్ అని , బాధితురాలికి సర్జరీలు జరుగుతున్నాయని, పరిస్థితి విషమంగా ఉందని పోలీసు చీఫ్ బిల్ మెక్‌మనుస్ తెలిపారు.

మరోవైపు ఈ కేసులో అనుమానితుడు, పరారీలో ఉన్న నిందితుడి సాహుపై అరెస్టు వారెంట్ జారీ చేశారు. ఈ క్రమంలో సాహూ తిరిగి సంఘటనా  స్థలంలో సంచరిస్తున్న సాహుని గమనించిన  పోలీసులు అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నిస్తారు. కానీ సాహు ఇద్దరు పోలీసు అధికారులను వాహనంతో ఢీకొట్టడంతో ఒక అధికారి  గాయపడ్డాడు.  దీంతో  మరో పోలీసు అధికారి  తుపాకీతో కాల్పులు జరపగా, సాహు అక్కడికక్కడే మరణించాడు.  

గాయపడిన  ఒక అధికారిని స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందించగా, మరో అధికారికి ఘటనా స్థలంలోనే చికిత్స అందించారు. ఈ ఘటనలో మరెవరికీ గాయాలు కాలేదనీ విచారణ కొనసాగుతోందని పోలీసులు తెలిపారు. అటు  ఈ ఘనటపై  బాడీ కెమెరాల ఫుటేజీని పరిశీలించాల్సి ఉందని పోలీసు ఉన్నతాధికారి ఒకరు ప్రకటించారు.

కాగా సాహు బైపోలార్ డిజార్డర్ తో గత పదేళ్లుగా బాధపడుతున్నాడని అతని మాజీ భార్య లీ గోల్డ్ స్టీన్ వెల్లడించింది. అలాగే స్క్రిజోఫ్రీనియా సమస్యతో చికిత్స తీసుకుంటున్నాడని,  బహుశా మందులు వాడటం మానేసి ఉంటాడని తెలిపింది.  వీరికి పదేళ్ల కుమారుడు కూడా ఉన్నాడట

Also read

Related posts

Share via