SGSTV NEWS
Telangana

ఇసుక, బెల్లం, గుట్కా, రేషన్ బియ్యం మాఫియాతో కుమ్మక్కయి ప్రశ్నించే వారిపై దౌర్జన్యం చేస్తున్న ఎస్, ఐ.*

మహబూబాబాద్ జిల్లా : నర్సింహులపేట పోలీస్ స్టేషన్ లో పోలీస్ వారి జులుం రోజు, రోజుకి పెరుగుతూ ప్రశ్నించే వారిపై దాడులు, దౌర్జన్యం చేస్తున్నారని తెలంగాణ ప్రదేశ్ జర్నలిస్ట్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు డి.వై.గిరి ఆరోపించారు.

నర్సింహులపేట మండలంలో కొందరితో కుమ్మక్కయి ఇసుక, నల్ల బెల్లం, గుట్కా, రేషన్ బియ్యం దందాలు చేస్తుంటే గుట్టుగా వారితో కుమ్మక్కయి లక్షలాది రూపాయలు దండుకుంటున్న ఎస్. ఐ గండ్రాతి సతీష్ ను ప్రశ్నించిన పత్రిక విలేఖరి మేకరబోయిన నగేశ్వర్ ను తీవ్రంగా కొట్టడం పట్ల తీవ్రంగా ఖండిస్తున్నాను. ఇసుక మాఫియా కోసం కొన్ని ట్రాక్టర్ లు నడిపిస్తు, కొన్ని  ట్రాక్టర్ లు ఆపి కేసులు పెడుతున్న విషయం స్థానికుల నుండి తెలుసుకున్న విలేఖరి నాగేశ్వర్ 15 తేదిన రాత్రి 10 గంటల సమయంలో నర్సింహలపేట-పడమటి గూడెం నర్సరీ వద్దకు వెళ్లగా అక్కడ ఉండి పోలీస్ మాముళ్లు ఇచ్చిన ట్రాక్టర్ లను వదులుతు… పోలీస్ వారికి డబ్బులు ఇవ్వని ట్రాక్టర్స్ ఆపుతున్న పోలీస్ వారిని ప్రశ్నించే క్రమంలో పోలీస్ వారి నుండి విషయం తెలుసుకున్న నర్సింహులపేట సబ్ – ఇన్స్పెక్టర్ గండ్రతీ సతీష్ సంఘటన జరిగిన చోటుకు వచ్చి రిపోర్టర్ నాగేశ్వర్ ను లాఠీలతో అక్కడ విఫరితంగా కొట్టి అక్కడ నుండి ఖాళీగా వెళ్ళ్తున్న అతని తమ్ముడు ట్రాక్టర్ ను ఆపి ఇదేమి అని ప్రశ్నించడంతో అతన్ని కొట్టి పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లి రాత్రి మరుసటి రోజు మధ్యాహ్నం 2 గంటల వరకు ఇద్దరు సోదరులపై థర్డ్ డిగ్రీ ప్రయోగించి, ఆక్రమంగా వీరిపైన పోలీస్ కేసు పెట్టడం పట్ల యావత్ జర్నలిస్ట్ సమాజం నిరసన తెలుపలని డి. వై. గిరి కోరారు.

మహబూబాబాద్ జిల్లాలో పెట్రేగుతున్న ఈ మాఫియాపై స్పందించాల్సిన జర్నలిస్ట్ సంఘాలు, పార్టీలు, ప్రజా సంఘాలు కిమ్మనకుండా పోతున్న విషయం పౌర సమాజానికి తప్పుడు సాంకేతలు ఇస్తుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. నియోజకవర్గలో జరిగిన ఘటనకు బాద్యులుగా డోర్నకల్ నియోజకవర్గ ఎమ్మెల్యే డా. రామ చంద్రు నాయక్, అధికార పార్టీ నాయకులు స్పందించాలని ఆయన డిమాండ్ చేశారు. సంఘటన జరిగిన తరువాత సైతం ఆసుపత్రిలోనే ఉంచి, మెడికో లీగల్ కేసు క్రింద చికిత్స చేయొద్దు అని ఆసుపత్రి వైద్యులను ప్రలోభపెట్టిన ఎస్. ఐపై తక్షణమే చర్యలు తీసుకోవాలని, జిల్లా ఎస్పీ విచారణ జరిపి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎస్. ఐ పై పోలీస్ కేసు నమోదు చేసి, బాధితునికి 5 లక్షల నష్ట పరిహారం చెల్లించాలని తెలంగాణ ప్రదేశ్ జర్నలిస్ట్ యూనియన్ డిమాండ్ చేస్తుందని డి. వై. గిరి అన్నారు.

నర్సింహులపేట ప్రాంతంలో ఇసుక, బెల్లం, గుట్కా, రేషన్ బియ్యం మాఫియాలకు సంభందం ఉన్న నర్సింహులపేట ఎస్. ఐ చర్యలు జర్నలిస్ట్ లుగా నిరూపించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని, ఎస్, ఐ అతని అనుచరుల కాల్ డేటా, చుట్టూ గ్రామ కూడళ్ళ వీడియో పు్టేజ్, పోలీస్ స్టేషన్ వీడియో పు్టేజ్ జిల్లా పోలీస్ అధికారుల సంఘం తమ ముందుకు వస్తే నిరుపిస్తామని డి. వై. గిరి సవాల్ విసిరారు. చేతిలో పోలీస్ పవర్ ఉంది నన్ను ఏమీ చేయలేరు అంటూ, లాకప్ డెత్ అంటే నాకు కొత్త కాదు… ఎవడైన నన్ను ఏమీ చేయలేరు అని విర్ర వీగుతున్న ఎస్. ఐ పై జిల్లా ఎస్పీ చర్యలు తీసుకోవాలని కోరారు. విలేకరి ఉన్న పాత కేసులు, అతని తమ్ముడికి ఉన్న ట్రాక్టర్ పై కేసులు ఉన్నట్లు పోలీస్ ఉన్నత అధికారులకు తప్పుడు సమాచారం ఇవ్వడం మానుకోవాలని, ఏది ఏమైనా తర్డ్ డిగ్రీ ప్రయోగం చేయడం ఏమిటని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ మేరకు ముఖ్యమంత్రి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, హోం, ఎక్స్ సైజ్, రెవిన్యూ, పంచాయతీ రాజ్, మైనింగ్, జిల్లా ఇంచార్జి మంత్రులకు మెయిల్ ద్వారా, మానవ హక్కుల కమిషన్, ఉప లోకాయుక్తకు, బీసీ కమిషన్, స్వయంగా పిర్యాదు చేయడం జరిగింది. రేపు తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయ మూర్తికి పిర్యాదు చేయనున్నామని ఆయన తెలిపారు.

జిల్లాలో పోలీస్ అధికారులు ప్రజలతో, జర్నలిస్ట్ లతో, ప్రజా ప్రతినిధులతో స్నేహ పూర్వక సంభందాలు కొనసాగించి ఉన్నతమైన జిల్లాగా పేరు తెచ్చుకోవాలని లేని యెడల జిల్లా అభివృద్ధి అనిచ్చితికి కారణం అవుతారని తెలంగాణ ప్రదేశ్ జర్నలిస్ట్ సంఘం తరపున విజ్ఞప్తి చేస్తున్నాం.

Also read

Related posts

Share this