SGSTV NEWS online
CrimeTelangana

డ్రైవరన్నా.. ఇదేం పని ?? వీడియో తీసి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసిన ప్రయాణికుడు

ఆర్టీసీలో అద్దె బస్సుకు డ్రైవర్‌గా పనిచేస్తున్న నిందితుడు ఈ ఘటనకు పాల్పడినట్టు ఆర్టీసీ అధికారులు తెలిపారు. వీడియో తమ దృష్టికి వచ్చిన వెంటనే డ్రైవర్‌ను విధుల నుంచి తొలగించినట్టు పేర్కొన్నారు. సాధారణంగా ఎవరైనా ప్రయాణికుడు బస్సులో తమ లగేజీ మర్చిపోతే దానిని బస్సు డిపోలో అప్పగిస్తారు. వారు ప్రయాణికుడి వివరాలు కనుక్కుని అందజేస్తారు. అయితే, ఈ బస్సు డ్రైవర్ మాత్రం ఆ పనిచేయకుండా అందులోని బంగారు నగలను కాజేశాడు. అయితే ఈ తతంగాన్ని ఓ ప్రయాణీకుడు తన సెల్‌ఫోన్‌లో రికార్డు చేయడంతో బండారం బయటపడింది. డ్రైవర్‌ను నిలదీయగా అది కిందపడిపోయిందని, అందుకే తీశానని కవర్ చేసేందుకు ప్రయత్నించాడు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారిం

Also read

Related posts