SGSTV NEWS
CrimeTelangana

రూ. వెయ్యి కోసం చంపేశారు



రంగారెడ్డి జిల్లా: డబ్బు కోసం స్నేహితుల మధ్య జరిగిన ఘర్షణ హత్యకు దారి తీసింది. ముగ్గురు స్నేహితులు కలిసి మరో స్నేహితుడిని హత్య చేసిన ఘటన మైలార్దేవ్పల్లి పోలీస్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఇన్స్పెక్టర్ నరేందర్ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి… మైలార్దేవ్పల్లి వట్టపల్లి ప్రాంతానికి చెందిన అఫ్రోజ్ (25) ఆటో డ్రైవర్గా పని చేస్తున్నాడు. శుక్రవారం రాత్రి అతను తన స్నేహితులు సోహెల్, అబ్బు, రిజ్వాన్ లతో కలిసి అర్ధరాత్రి వరకు గడిపాడు.

ఈ సమయంలో స్నేహితుల మధ్య డబ్బు విషయమై చోటు చేసుకున్న వివాదం ఘర్షణకు దారి తీసింది. రూ.వెయ్యి కోసం చెలరేగిన గొడవ దాడి వరకు వెళ్లింది. దీంతో ముగ్గురు స్నేహితులు కలిసి అఫ్రోజ్పై కత్తితో దాడి చేయడంతో తీవ్రంగా గాయపడి కుప్పకూలాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించగా అతను అప్పటికే మృతి చెందినట్లు గుర్తించారు. పంచనామా నిర్వహించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు దర్యాప్తు చేస్తున్నారు.

Also read

Related posts