తెనాలి: స్థానిక అయితానగర్ కు చెందిన రౌడీ షీటర్ లడ్డూ, గతంలో తనకు సన్నిహితంగా ఉన్న మహిళపై తీవ్రంగా దాడిచేశాడు. ఆమె ఫిర్యాదుపై పోలీసులు హత్యాయత్నం కేసు నమోదుచేసి అరెస్ట్ చేశారు. ఆదివారం రాత్రి మేజిస్ట్రేట్ ముందు హాజరుపెట్టగా రిమాండ్ కు ఆదేశించారు. సముద్రాల పవన్ కుమార్ అలియాస్ లడ్డూ.. పట్టణంలో గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఓ ఎన్ ఆర్ ఐ పై దాడి చేశాడు. దీంతో పోలీసులు అతడిని పట్టణ బహిష్కరణ చేశారు. తెనాలి రావొద్దని ఆదేశించారు.
అయినా రహస్యంగా పట్టణానికి రాకపోకలు సాగిస్తున్నాడు. గత అక్టోబరులో బహిరంగంగానే పుట్టినరోజు వేడుకలు జరుపుకున్నాడు. ఆ సంబరానికి కూటమి నేతలు హాజరయ్యారు. ఆ తర్వాత మూడురోజులకే అంటే అదే నెల 28వ తేదీ రాత్రి డెకరేషన్ పనులు చేస్తుండే నాజరుపేటకు చెందిన కాకుమాను ఇంద్రజిత్ అనే వ్యక్తిపై అయితానగర్ సెంటర్ లోనే లడ్డూ దాడిచేశాడు. వర్కర్ను స్కూటర్పై ఇంటిదగ్గర దించి తిరిగి వెళుతున్న ఇంద్రజిత్ పై అకారణంగా లడ్డూ దాడిచేశాడు. అతడి స్కూటర్ తీసుకెళ్లి తగులబెట్టాడు. కూటమి నేతలతో ఉన్న బంధం కారణంగానే లడ్డూ ఇంతకు తెగించాడని అప్పట్లో విమర్శలు వచ్చాయి. మళ్లీ ఇప్పుడు వార్తల్లొకొచ్చాడు
దూరంగా ఉంచిందని..
తెనాలి సమీపంలో ఓ గ్రామానికి చెందిన ఓ మహిళతో లడ్డూకు పాత పరిచయం ఉంది. ఆమె విజయవాడలో ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తుంది. కొంతకాలంగా ఆమె లడ్డూను దూరంగా ఉంచింది. ఆగ్రహం చెందిన లడ్డూ శనివారం తనకోసం విజయవాడ వెళ్లి, తనతో గొడవ పెట్టుకున్నాడు. ఆమెను అనుసరించి తెనాలి వచ్చి, తర్వాత ఆమె నివసించే గ్రామానికి వెళ్లాడు. ఆమెను ఊరి వెలుపలికి రమ్మని బెదిరించాడు. తన దగ్గరకు వచ్చిన మహిళపై తీవ్రంగా దాడిచేశాడు. తీవ్రంగా గాయపడిన ఆమె ఫిర్యాదుతో రూరల్ పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేశారు. తర్వాత అరెస్టుచేసి, స్థానిక ప్రైవేటు వైద్యశాలలో పరీక్షలు చేయించారు. ఆదివారం రాత్రి మేజస్టేటు ముందు హాజరుపరచగా రిమాండ్కు ఆదేశించారు. రూరల్ ఎస్ఐఐ ప్రతాప్ కుమార్ కేసు దర్యాప్తుచేస్తున్నారు.
Also read
- నేటి జాతకములు..19 జూలై, 2025
- Visakhapatnam Kidney Racket: అందమైన సాగరతీరంలో కిడ్నీ రాకెట్ కలకలం..! విచారణలో విస్తుబోయే వాస్తవాలు..
- Andhra News: ఉద్యోగం వదిలి వచ్చి పెళ్లైన వ్యక్తితో కూతురు ప్రేమాయణం.. తల్లిదండ్రులు ఏం చేశారంటే!
- Andhra: వానకాలంలో వడదెబ్బ.. 8 మంది విద్యార్థినులకు అస్వస్థత
- Crime: సీసీటీవీ ఫుటేజీలో అడ్డంగా బుక్కయ్యాడు… మల్లన్నకే మస్కా కొట్టాలని చూసిన ఆలయ ఉద్యోగి