SGSTV NEWS online
Andhra PradeshCrime

విజయవాడ శివారులో రోహింగ్యాలు



విజయవాడ శివారు తాడిగడపలో అక్రమంగా ఉంటున్న రోహింగ్యాలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కౌంటర్ ఇంటెలిజెన్స్ నుంచి వచ్చిన సమాచారంతో విజయవాడ టాస్క్ఫోర్స్ పోలీసులు నగర శివారులోని మూడు వేర్వేరు ప్రాంతాల నుంచి మొత్తం 15 మంది అక్రమ వలసదారులను అదుపులోకి తీసుకుని విజయవాడ తరలించారు.

హైదరాబాద్ నుంచి వచ్చి తాడిగడపలో నివాసం వివిధ ప్రాంతాల్లో భవన నిర్మాణ కార్మికులుగా పని 15 మందిని అదుపులోకి తీసుకున్న టాస్క్ ఫోర్స్

అమరావతి, న్యూస్టుడే – పెనమలూరు:

విజయవాడ శివారు తాడిగడపలో అక్రమంగా ఉంటున్న రోహింగ్యాలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కౌంటర్ ఇంటెలిజెన్స్ నుంచి వచ్చిన సమాచారంతో విజయవాడ టాస్క్ ఫోర్స్ పోలీసులు నగర శివారులోని మూడు వేర్వేరు ప్రాంతాల నుంచి మొత్తం 15 మంది అక్రమ వలసదారులను అదుపులోకి తీసుకుని విజయవాడ తరలించారు. తాడిగడపలోని ఓ ఇంటిని శుక్రవారం ఉదయాన్నే పోలీసులు చుట్టుముట్టారు. ఆ ఇంట్లో ఉన్న ఎనిమిది మందిని అదుపులోకి తీసుకున్నారు. వారు ఎప్పటి నుంచి ఇక్కడ ఉంటున్నారు? వారి కోసం ఎవరెవరు వస్తున్నారు? అని ఇంటి యజమానిని అడిగి తెలుసుకున్నారు.

తనకు పరిచయస్థుడైన ఓ వ్యక్తి ఆటోనగర్ లో భవనం నిర్మిస్తున్నానని, అక్కడ పని చేస్తున్న ఓ మహిళకు, పురుషుడికి పోర్షన్ అద్దెకు కావాలని కోరడంతో ఈనెల 9న అద్దెకు ఇచ్చానని యజమాని చెప్పారు. అయితే ఆమె గత ఆదివారమే వెళ్లిపోగా, పురుషుడు ఒక్కడే ఉంటున్నాడని, గురువారం అర్ధరాత్రి దాటాక మరో ఏడుగురు యువకులు వచ్చి ఆ ఇంట్లో ఆశ్రయం పొందారని తేలింది. మొత్తం 8 మందినీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అదేక్రమంలో తాడిగడప వంద అడుగుల రోడ్డులోని ఓ గేటెడ్ కమ్యూనిటీలో పనిచేస్తున్న ఇద్దరిని, గోశాల వద్ద ఓ అపార్ట్మెంట్ పనుల కోసం వచ్చిన ఐదుగురిని టాస్క్ ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరు గత ఆరు నెలలుగా ఇక్కడే పనిచేస్తున్నట్లు గుర్తించారు.

పూర్వాపరాలపై విచారణ..

మయన్మార్ నుంచి అక్రమంగా దేశంలోకి వలస వచ్చిన వీరు కొంతకాలంగా హైదరాబాద్లో ఉంటున్నారు. అక్కడి నుంచి విజయవాడ చేరుకుని భవన నిర్మాణ కార్మికులుగా పనిచేస్తున్నారు. వీరందరినీ అదుపులోకి తీసుకుని పోలీసులు, కౌంటర్ ఇంటెలిజెన్స్ సిబ్బంది ప్రశ్నిస్తున్నారు. వారికి ఎలాంటి తీవ్రవాద మూలాలు లేవని ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. వీరి విషయంలో ఎలాంటి చర్యలు తీసుకోవాలనే అంశంపై ఉన్నతాధికారులు చర్చలు జరుపుతున్నారు.

Also read

Related posts