కర్ణాటక బీదర్‌లో పట్టపగలే దొంగలు రెచ్చిపోయారు. ATMలో డబ్బులు వేసే వాహనంపై కాల్పులు జరిపారు. సెక్యూరిటీ గార్డ్ అక్కడికక్కడే చనిపోగా మరో ఇద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి. రూ.93 లక్షల నగదు బాక్సులతో పారిపోయిన దుండగుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.
Robbery: దారి దోపిడి దొంగలు దారుణానికి పాల్పడ్డారు. ఏకంగా ATMలో డబ్బులు వేసే వాహనాన్ని టార్గెట్ చేసి భారీ నగదు దోచేశారు. డబ్బే లక్ష్యంగా వెహికిల్‌పై విచక్షణ రహితంగా దుండగులు కాల్పులు జరపడంతో సెక్యూరిటీ గార్డ్ అక్కడికక్కడే చనిపోయాడు. మరో ఇద్దరికీ తీవ్ర గాయాలవగా ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి
పట్టపగలే దారి దోపిడీ..
కర్నాటకలోని బీదర్ నగరంలో పట్టపగలు దొంగల ముఠా ఈ దారుణానికి పాల్పడింది. బీదర్ నగరంలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) మెయిన్ బ్రాంచ్ ఎదుట వెహికిల్ పై కాల్పులు జరిపారు. కొద్ది రోజులుగా ఆ వాహనం తిరిగే ప్రాంతాలను పరిశీలిస్తున్న దొంగలు.. బీదర్‌లో మకాం వేశారు. వెహికల్ రావడంతో అటాక్ చేశారు. దీంతో అప్రమత్తమైన సిబ్బంది వాళ్లను నిలువరించేందుకు ప్రయత్నించారు. కానీ దుండగులు ముందుగా కారంపొడి చల్లి తుపాకులతో కాల్పులు జరిపారు.
గార్డు వెంకటేష్ అక్కడికక్కడే మృతి చెందగా మరో గార్డు శివకుమార్‌కు తీవ్ర గాయాలయ్యాయి. శివకుమార్ పరిస్థితి అత్యంత విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. దొంగలు నగదు పెట్టెతో పారిపోగా అందులో రూ.93 లక్షల నగదు ఉన్నట్లు అధికారులు తెలిపారు. నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.
Also read
- Tirumala News: తిరుమల మహాద్వారం.. ఒకరిపై ఒకరు పిడిగుద్దులు, ఏం జరిగింది?
- Sindh River: సింధు నది ఎక్కడ పుట్టింది? ఎన్ని దేశాల గుండా ఈ నది ప్రవహిస్తుంది? పూర్తి చరిత్ర
- ఈ రాశికి చెందిన వ్యక్తులకు నమ్మకం ఎక్కువ.. వీరు ప్రేమించిన వారి చేతిలోనే మోసపోతారు..
- నేటి జాతకములు..5 మే, 2025
- మోహినీ ఏకాదశి పూజ నియమాలు? ఏమి చేయాలి? ఏమి చేయకూడదంటే..