SGSTV NEWS
CrimeTelangana

Road Accident: బైక్ అదుపుతప్పి మూడేళ్ల బాలుడి దుర్మరణం… తల్లికి తీవ్రగాయాలు


బైక్‌ అదుపుతప్పి రోడ్డుపక్కనే ఉన్న స్టీల్‌ రెయిలింగ్‌ను ఢీ కొన్న ఘటనలో మూడేళ్ల బాబు మృతి చెందగా తల్లికి తీవ్రగాయలయ్యాయి. ఒక్కగానొక్క కొడుకు కళ్లముందే కనుమూయడంతో ఆ తల్లిదండ్రుల శోకం అందరినీ కలిచివేసింది. కుటుంబసభ్యుల రోదనలు మిన్నంటాయి.

Road Accident: బైక్‌ అదుపుతప్పి రోడ్డుపక్కనే ఉన్న స్టీల్‌ రెయిలింగ్‌ను ఢీ కొన్న ఘటనలో మూడేళ్ల బాబు మృతి చెందగా తల్లికి తీవ్రగాయలయ్యాయి. ఒక్కగానొక్క కొడుకు కళ్లముందే కనుమూయడంతో ఆ తల్లిదండ్రుల శోకం అందరినీ కలిచివేసింది. నర్సాపూర్‌ ఎస్సై లింగం కథనం ప్రకారం..


మెదక్‌ జిల్లా చిలప్‌చెడ్‌ మండలం చండూరుకు చెందిన సంగారెడ్డి రామిరెడ్డి కుత్బుల్లాపూర్‌ నియోజకవర్గం మల్లంపేటలో స్థిరపడ్డాడు. ఆయనకు మూడు సంవత్సరాల కుమారుడు ధ్రువాన్షురెడ్డి ఉన్నాడు. వేసవిసెలవులు కావడంతో చండూరులోని తాత ఇంటివద్ద ఉన్నాడు. అయితే అతన్ని ఇంటికి తీసుకురావడానికి రామిరెడ్డి తన భార్య మాధవితో కలిసి ద్విచక్రవాహనం పై చండూరుకు వెళ్లాడు. ధ్రువాన్షురెడ్డిని తీసుకుని రామిరెడ్డి, మాధవి ఇద్దరూ తిరిగి మల్లంపేటకు బయలుదేరారు.

మార్గ మధ్యలో నర్సాపూర్‌ శివారుకు వచ్చే సరికి ద్విచక్రవాహనం అదుపుతప్పింది. దీంతో జాతీయ రహదారి పక్కనే ఉన్న స్టీల్‌ రెయిలింగ్‌ను ఢీకొంది. ముందు కూర్చున్న ధ్రువాన్షురెడ్డి తలకు బలమైన గాయమై అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. వెనుక కూర్చున్న మాధవికి తీవ్రగాయాలయ్యాయి. మాధవికి స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రాథమిక చికిత్స చేయించి మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌కు తరలించారు. తల్లిదండ్రుల కళ్లెదుటే ఒక్కగానొక్క కుమారుడు దుర్మరణం చెందడంతో వారు గుండెలవిసేలా  విలపించారు. మూడేళ్ల చిన్నారిని రక్తపు మడుగులో చూసిన కుటుంబసభ్యుల రోదనలు మిన్నంటాయి.

Also read

Related posts

Share this