June 29, 2024
SGSTV NEWS
CrimeNational

ఆ సంబంధం మోజులో ప్రియుడితో కలిసి తప్పుచేసింది.. ఇప్పుడు ఒంటరిగా ఉంటూ కుమిలి కుమిలి ఏడుస్తున్న నటి..

బెంగళూరు రేణుకాస్వామి హత్య కేసులో అరెస్టయిన నటుడు దర్శన్‌కు పరప్పన అగ్రహార జైలులో ప్రత్యేక బ్యారక్‌ను కేటాయించారు. దర్శన్‌తో పాటు మరో నటుడు ప్రదోశ్‌కు అటాచ్డ్ బాత్‌ రూమ్‌తో కూడిన ప్రత్యేక బ్యారక్‌ ఇచ్చారు. రిమాండ్ ఖైదీగా ఉన్న దర్శన్‌కు 6106 నంబరును కేటాయించారు జైలు అధికారులు. జైలులో దర్శన్‌తో పాటు.. పవిత్రా గౌడ ఇబ్బందులు పడుతున్నట్లు తెలుస్తోంది.

Renukaswamy murder case: బెంగళూరు రేణుకాస్వామి హత్య కేసులో అరెస్టయిన నటుడు దర్శన్‌కు పరప్పన అగ్రహార జైలులో ప్రత్యేక బ్యారక్‌ను కేటాయించారు. దర్శన్‌తో పాటు మరో నటుడు ప్రదోశ్‌కు అటాచ్డ్ బాత్‌ రూమ్‌తో కూడిన ప్రత్యేక బ్యారక్‌ ఇచ్చారు. రిమాండ్ ఖైదీగా ఉన్న దర్శన్‌కు 6106 నంబరును కేటాయించారు జైలు అధికారులు. జైలులో దర్శన్‌తో పాటు.. పవిత్రా గౌడ ఇబ్బందులు పడుతున్నట్లు తెలుస్తోంది. దర్శన్ అరకొరగా భోజనం చేస్తున్నట్లు.. రాత్రి ఆలస్యంగా నిద్రపోయినట్లు జైలు సిబ్బంది గుర్తించారు. హత్య కేసులో దర్శన్‌ అరెస్టయి ఇప్పటికే రెండు వారాలు పూర్తయింది. ఆయన బరువు కొంత తగ్గగా, బీపీ కూడా నియంత్రణలో లేదని జైలు అధికారులు చెబుతున్నారు. ఇక మహిళా బ్యారక్‌లో ఉన్న పవిత్రా గౌడ ఇతర ఖైదీలతో కలవకుండా, ఒంటరిగా ఉంటూ ఏడుస్తున్నట్లు జైలు సిబ్బంది గుర్తించారు. హత్య కేసులో నిందితులు మొత్తం 17మందిని పరప్పన అగ్రహార జైలులోనే ఉంచారు. వీరందరికీ 13 రోజుల రిమాండ్ విధించింది కోర్ట్. నిందితులను బెంగళూరుకు బదులుగా తుమకూరు జైలుకు తరలించాలని ప్రత్యేక పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ చేసిన వాదనలకు దర్శన్‌ తరపు న్యాయవాది అభ్యంతరం వ్యక్తం చేశారు. దీనిపై ఇవాళ మరోసారి విచారణ జరగనుంది.

ఎన్నో ట్విస్టులు..
కన్నడనాట కలకలం రేపిన రేణుకాస్వామి మర్డర్ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి.. భార్యను విస్మరించి.. ప్రేయసితో వివాహేతర సంబంధం పెట్టుకుని.. ఇదేమని ప్రశ్నించిన అభిమానిని టార్గెట్ చేసి హతమార్చారు.. నటుడు దర్శన్.. అతని ప్రియురాలు పవిత్ర గౌడ.. రేణుకాస్వామి మర్డర్‌కు ముందు దర్శన్ పవిత్ర కలిసి షెడ్డుకు వెళ్లారు.. రేణుకాస్వామిని పిలిపించి..అతిదారుణంగా కొట్టి చంపేశారు. రేణుకాస్వామి చనిపోయాడని నిర్ధారించుకున్న తర్వాత డెడ్ బాడీని మురికి కాల్వలో పడేశారు. ఏం తెలియనట్టు పవిత్ర, దర్శన్ షూటింగ్‌కి వెళ్లారు. కార్తీక్, కేశవ్, నిఖిల్‌, రాఘవేంద్రలకు డబ్బులిచ్చి లొంగిపోవాలని చెప్పడంతో వాళ్లు సరెండర్ అయ్యారు. కానీ..వీళ్లల్లో ఎవరికి క్రైమ్ బ్యాక్‌ గ్రౌండ్ లేకపోవడంతో పోలీసులకు ఎక్కడో తేడా కొట్టింది. తమ స్టైళ్లో ఇన్వెస్టిగేషన్ చేయడంతో నిజాలు వెలుగులోకి వచ్చాయి

Also read :ప్రియుడి కోసం భర్తను అతి దారుణంగా..

గురి తప్పింది..! బైక్ టైర్ ని కాల్చబోతే స్నాచర్ కాలిలోకి తూటా

Related posts

Share via