SGSTV NEWS online
Andhra Pradesh

రెంటచింతలలో డయేరియా .. ఒకరు మృతి




రెంటచింతల (పల్నాడు జిల్లా)  : పల్నాడు జిల్లా డయేరియా ప్రభలింది. రెంటచింతల మండలంలో ఆదివారం డయేరియాతో ఒకరు మృతి చెందగా, ముగ్గురు ఆస్పత్రిపాలయ్యారు. కుటుంబ సభ్యులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం… మండల పరిధిలోని వడ్డెర బావికి చెందిన పేరూరి చిన్నచంద్రయ్య (72) శనివారం మధ్యాహ్నం నుంచి వాంతులు, విరోచనాలతో బాధపడుతుండగా కుటుంబీకులు స్థానిక మెడికల్‌ షాప్‌లో మందుల తెచ్చి ఇచ్చారు. పరిస్థితి విషమించి ఆదివారం తెల్లవారుజామున మృతి చెందారు. చంద్రయ్య ఇంటికి ఎదురుగా ఉండే యామర్తి తిరుపతమ్మ, ఆమె కుమార్తె హవేలీ, సమీపంలో నివాసముండే ఆత్మకూరి లక్ష్మయ్య డయేరియా బారిన పడటంతో వారిని హుటాహుటిన ఆస్పత్రుల్లో చేర్పించారు. మాచర్లలోని ప్రయివేటు ఆస్పత్రిలో ఇద్దరు, పిడుగురాళ్లలో ఒకరు చికిత్స పొందుతున్నారు. వర్షాల నేపథ్యంలో బోర్లలో నీరు కలుషితమైందని, ఆ నీటిని తాగడంవల్లే డయేరియా బారిన పడ్డారని స్థానికులు చెబుతున్నారు. గ్రామంలోని ఓవర్‌ హెడ్‌ ట్యాంకులను ఏళ్ల తరబడి శుభ్రం చేయకపోవడమూ మరోకారణమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇదే గ్రామంలోని రైలుపేట ప్రాంతంలో కొద్ది వారాల కిందట కొంతమంది డయేరియా బారిన పడగా వైద్యశిబిరం ఏర్పాటు చేశారు.

Also read

Related posts