February 23, 2025
SGSTV NEWS
Andhra PradeshCrime

ఎన్టీఆర్ జిల్లాలో దారుణం.. బీటెక్ విద్యార్థినిపై అత్యాచారం


ఎన్టీఆర్‌ జిల్లాలో బీటెక్ విద్యార్థినిపై అత్యాచారం చేసిన దారుణ ఘటన జరిగింది. ఓ యువకుడు మాయ మాటలు చెప్పి బలవంతంగా ఆమెపై అత్యాచారం చేసి ఫొటోలు తీశాడు. ఆ తర్వాత స్నేహితులకు చూపించి బెదిరింపులకు పాల్పడ్డాడు. యువతి పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారు



ఎన్టీఆర్ జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. కంచికర్లలోని ఇంజినీరింగ్‌ కాలేజీలో ఓ విద్యార్థిని చదువుతోంది. ఈమెకు పరిటాలకు చెందిన గాలి సైదాతో స్నేహం ఏర్పడింది. దీన్ని ఆసరాగా తీసుకున్న ఆ యువకుడు మాయమాటలు చెప్పి బలవంతంగా ఆమెపై అత్యాచారం చేశాడు. ఆ సమయంలో బలవంతంగా నగ్న ఫొటోలు కూడా తీశాడు.

ఫొటోలతో ఆ యువతిని బెదిరించి..
ఆ ఫొటోలను యువకుడు స్నేహితులకు చూపించి బెదిరింపులకు పాల్పడ్డారు. స్నేహితులు కూడా ఆమెను బెదిరించడం మొదలు పెట్టారు. ఆ వేధింపులు భరించలేక యువతి పోలీసులను ఆశ్రయించింది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.

Also read

Related posts

Share via