గుంటూరు ఐదో అదనపు జిల్లా కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. పల్నాడు జిల్లాలో ఆశావర్కర్‌పై సామూహిక అత్యాచారానికి పాల్పడి హత్య చేసిన కేసులో ముగ్గురు నిందితులకు జీవిత ఖైదు, 20 ఏళ్ల జైలు శిక్ష, జరిమానా విధించింది. ఈ మేరకు జడ్జి కె.నీలిమ మంగళవారం తీర్పు చెప్పారు.
ఏపీలోని పల్నాడు జిల్లాలో 2022 సెప్టెంబర్ 16న ఘోరమైన ఘటన జరిగింది. వివాహిత ఆశావర్కర్‌పై ముగ్గురు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అక్కడితో ఆగకుండా పక్కనే ఉన్న రాయితో తలపై కొట్టి హతమార్చారు. అనంతరం రంగంలోకి దిగిన పోలీసులు ఆ ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు.
ఇప్పుడు అదే కేసుపై గుంటూరు ఐదో అదనపు జిల్లా కోర్టు సంచలన తీర్పును వెలువరించింది. వివాహితపై సామూహిక అత్యాచారానికి పాల్పడి.. ఆమెను హతమార్చిన కేసులో ఆ ముగ్గురు నిందితులకు కఠిన శిక్ష విధించింది. జీవిత ఖైదు, 7 ఏళ్ల జైలు శిక్షతో పాటు మరో 20 ఏళ్ల జైలు శిక్ష, జరిమానా విధిస్తూ జడ్జి కె. నీలిమ నిన్న (మంగళవారం) తీర్పునిచ్చారు
ఏం జరిగిందంటే?
పల్నాడు జిల్లా మాచర్ల మండలానికి చెందిన ఓ మహిళ (46) ఆశావర్కర్‌గా వర్క్ చేసేవారు. ఓ రోజు ఆమె సెల్‌ఫోన్ దొంగిలించబడింది. దీంతో ముత్తయ్య అనే వ్యక్తి వద్దకు వెళ్లి జరిగిన విషయం చెప్పింది. ఇక అదే సమయంలో శీలం అంజి (22), శీలం బైస్వామి (31), సావిటి చినఅంజి (22) అనే ముగ్గురు యువకులు ఆమెతో మాటలు కలిపారు
అంతటితో ఆగకుండా తమకు ఒక వ్యక్తి తెలుసునని.. అక్కడికి వెళితే ఫోన్ ఎక్కడుందో కనుక్కుంటాడని ఆమెను బాగా నమ్మించారు. దీంతో తన ఫోన్ దొరుకుతుందని ఆశపడిన ఆ మహిళ వారితో పాటు వెళ్లింది. అలా కొంతదూరం వెళ్లాక ఆ ముగ్గరూ దారుణానికి తెగబడ్డారు. ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అక్కడితో ఆగకుండా పక్కనే ఉన్న రాయితో తలపై కొట్టి కొట్టి చంపారు.
అనంతరం సమాచారం అందుకున్న నాగార్జునసాగర్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇందులో భాగంగానే నిందితులను పట్టుకుని అభియోగపత్రాలు దాఖలు చేశారు. అయితే ఈ కేసునుంచి బయటపడేందుకు నిందితులు ఎన్నో ప్రయత్నాలు చేసినట్లు సమాచారం
తాజాగా ఈ కేసును విచారించిన కోర్టు సంచలన తీర్పునిచ్చింది. అత్యాచారం కింద 20 ఏళ్ల జైలు శిక్ష, సాక్ష్యాన్ని తారుమారు చేసేందుకు ప్రయత్నించినందుకు గానూ 7ఏళ్ల జైలు శిక్ష, హత్యానేరానికి జీవితఖైదుతో పాటు ఒక్కొక్కరికీ రూ.70 వేల చొప్పున జరిమానా విధిస్తూ జడ్జి నీలిమ తీర్పు చెప్పారు. ఆ జరిమానా మొత్తాన్ని వారసులకు అందించాలని ఆమె తెలిపారు.
Also read
- అమెరికా వీసా రాక యువతి ఆత్మహత్య
- తల్లితో వివాహేతర సంబంధం.. కూతురుపై అత్యాచారం..!
- Andhra: రేయ్.. ఏంట్రా ఇది.. బయట బోర్డేమో ఒకటి.. లోపల మాత్రం కథ వేరు.. అనుమానం వచ్చి వెళ్లగా..
- AP Crime: నెల్లూరులో దారుణం.. మహిళను వేధించాడు.. నడి రోడ్డుపై నరికారు
- నేటి జాతకములు….14 ఆగస్టు, 2025