శ్రీకాళహస్తి :కొలకత్తా మెడికో విద్యార్థి ఘటనపై దేశమంతా అట్టుడుకుతున్న వేళ శ్రీకాళహస్తిలో మరో ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. మైనర్ బాలికపై నలుగురు కామాంధులు అత్యాచారానికి పాల్పడ్డారు. ఆమెను గర్భవతి చేసి నిందితులు పరారయ్యారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసుల కథనం మేరకు… శ్రీకాళహస్తి బహదూర్ పేటకు చెందిన మైనర్ బాలిక చిన్నతనంలోనే తన తల్లిదండ్రులను కోల్పోవడంతో అమ్మమ్మ ఇంట్లో ఉంటూ చదువుకుంటోంది. నలుగురు యువకులు బాలికకు మాయమాటలు చొప్పి లోబరుచుకున్నారు. అత్యాచార విషయం ఇటీవల వెలుగులోకి రావడంతో యువకులను మందలించి గ్రామ పెద్దలు రాజీ చేశారు. అయితే, బాలిక గర్భవతి అయిందన్న సంగతి తెలుసుకున్న అమ్మమ్మ గురువారం రాత్రి శ్రీకాళహస్తి టూటౌన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. నిందితులు మధు, సునీల్, చంద్రతో పాటు తిరుపతికి చెందిన మరో యువకుడిపై పోక్సో చట్టం కింద పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వైద్య పరీక్షల నిమిత్తం శుక్రవారం శ్రీకాళహస్తి ఏరియా ఆస్పత్రికి బాలికను తీసుకెళ్లారు. అక్కడి నుంచి తిరుపతి రుయాకు తరలించారు.
Also read
- ప్రతిరోజూ పెళ్లి చేసుకొనే స్వామిని సందర్శిస్తే మీకు కూడా వివాహం
- Telangana: ఇదెక్కడి యవ్వారం.. గాజుల పండక్కి పిలవలేదని.. ఏకంగా కోర్టుకెళ్లిన మహిళ.. ఎక్కడంటే?
- Andhra: పెట్రోల్ కొట్టించేందుకు బంక్కొచ్చిన కానిస్టేబుల్.. ఆపై కాసేపటికే తోపునంటూ..
- Fake DSP: ఉద్యోగాల పేరుతో యువకులకు ఎరా.. తీగలాగితే కదులుతున్న నకిలీ డీఎస్పీ దందా!
- Tuni: తండ్రి మరణంపై నారాయణరావు కుమారుడు రియాక్షన్ వైరల్.. అనూహ్య రీతిలో