December 4, 2024
SGSTV NEWS
Crime

సవతి కుమార్తెపై అత్యాచారం.. 141 ఏళ్ల జైలు శిక్ష

• 141 ఏళ్ల జైలు శిక్ష విధించిన కేరళ కోర్టు

మలప్పురం: మైనర్ అయిన సవతి కుమార్తెపై  పలుమార్లు అత్యాచారానికి పాల్పడిన ఓ వ్యక్తికి కేరళ కోర్టు 141 ఏళ్ల జైలు శిక్ష విధించింది. పోక్సో చట్టం,  ఐపీసీ, జువెనైల్ జస్టిస్ చట్టం కింద వివిధ నేరాలకు గాను దోషి ఏక కాలంలో ఈ శిక్ష అనుభవించాలంటూ మంజేరి  ఫాస్ట్ ట్రాక్ స్పెషల్ కోర్టు జడ్జి అప్రాఫ్ ఏఎం నవంబర్ 29వ  తేదీన తీర్పు వెలువరించారు. అయితే, దోషి 40 ఏళ్ల  జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుందని ఆయన తెలిపారు. అతడికి విధించిన శిక్షల్లో ఇదే అత్యధికమని  ఆయన ఆ తీర్పులో పేర్కొన్నారు. అదేవిధంగా, బాధితురాలికి పరిహారంగా 5.7.85 లక్షలు   చెల్లించాలని కూడా దోషిని ఆదేశించారు. బాలికపై ఆమె  తల్లి ఇంట్లో లేని సమయాల్లో 2017 నుంచి సవతి తండ్రి  పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడని పోలీసు  అధికారి ఒకరు తెలిపారు

Also read

Related posts

Share via