January 7, 2025
SGSTV NEWS
Andhra Pradesh

కడపలో రిమ్స్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న ఎంపీడీవో జోహార్ బాబును పరామర్శించిన ….రాజేంద్రప్రసాద్.*

కడప జిల్లా*
కడప సిటి -.

*కడపలో రిమ్స్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న ఎంపీడీవో జోహార్ బాబును పరామర్శించిన ….రాజేంద్రప్రసాద్.*

*లాయర్ పట్టా  తో పాటు రౌడీయిజం పట్టా ఏమన్నా పొందారా?… రాజేంద్రప్రసాద్.*

*చంద్రబాబు దయా  దాక్షిణ్యాలతోనే వైయస్సార్ పార్టీ వాళ్ళ పదవులు కొనసాగుతున్నాయని గుర్తుంచుకోండి … రాజేంద్రప్రసాద్ హెచ్చరిక.*




👉  _ఈ రోజు ఆంధ్ర ప్రదేశ్ పంచాయతీరాజ్ ఛాంబర్ రాష్ట్ర అధ్యక్షులు వై.వి.బి రాజేంద్ర ప్రసాద్ సర్పంచుల సంఘం మరియు పంచాయితీ రాజ్ ఛాంబర్ రాష్ట్ర కమిటీ నాయకులతో కలసి గాలివీడు మండల పరిషత్ కార్యాలయంలో వైఎస్ఆర్ పార్టీ నాయకుల చేతిలో దాడికి గురై కడప పట్టణంలో రిమ్స్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న ఎంపీడీవో జవహర్ బాబును పరామర్శించి ధైర్యం చెప్పి భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు జరగకుండా చట్టాన్ని పటిష్టంగా అమలు చేయమని ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తామని రాజేంద్రప్రసాద్ హామీ ఇచ్చారు._

👉  అనంతరం రాజేంద్రప్రసాద్ మీడియాతో మాట్లాడుతూ ఎంపీడీవోలు అంటే పంచాయతీరాజ్ ఛాంబర్ లో ఒక భాగమని అందుకనే ఎంపీడీవో పైన జరిగినటువంటి దాడిని మొత్తం పంచాయతీరాజ్ వ్యవస్థ పైనే జరిగిన దాడిగా భావిస్తూ ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నామని రాబోయే రోజుల్లో ఏ అధికారి కూడా ఇటువంటి పరిస్థితి రాకుండా చట్టాన్ని కఠినంగా అమలు చేసే విధంగా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తామని తెలియజేశారు.

👉  దాడి చేసిన నిందితుడు సుదర్శన్ రెడ్డికి మద్దతుగా బద్వేల్ లో లాయర్లు చేసినటువంటి నిరసనకు సమాధానంగా రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ లాయర్ పట్టా తో పాటు రౌడీయిజం పట్టా ఏమైనా పొందారా మీరు లాయర్లైతే ఎవరినైనా కొడతారా …అటువంటివారిని మందలించేది పోయి మద్దతుగా నిలుస్తారా అని సూటిగా ప్రశ్నించారు.

👉  ఇటీవల మండల పరిషత్ అధ్యక్షుల, మున్సిపల్ చైర్మన్ ల, నగర మేయర్ ల, జిల్లా పరిషత్ చైర్మన్ ల ,ఉప సర్పంచ్ ల అవిశ్వాస తీర్మాన పదవీ కాలాన్ని రెండు సంవత్సరాలకి కుదించమని క్యాబినెట్లో ప్రతిపాదనలు పెట్టిన మంత్రులని నిలువరించి ఆ ప్రతిపాదనను తిరస్కరించి స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు ఒక గౌరవాన్ని విలువను ఉంచిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దయాదాక్షిన్యాలతోనే మీ పదవులు నిలబడ్డాయి అన్న సంగతి గుర్తుంచుకోండి అని వైయస్సార్సీపి ప్రజాప్రతినిధులను హెచ్చరించిన రాజేంద్రప్రసాద్.

👉   మీ జగన్ ఇవ్వలేదు.. చంద్రబాబు నాయుడు ఇచ్చారు ..

👉   గత ముఖ్యమంత్రి ఐదు సంవత్సరాలు పాలనలో ఒక్క రూపాయి నిధులు కూడా సర్పంచులకు గాని ఎంపీటీసీలకు గాని జడ్పిటిసిలకు గాని ఇవ్వక పోగా కేంద్రం ఇచ్చిన నిధులు కూడా దొంగలించి దారి మళ్లించారు….
నూతనంగా ఏర్పడిన కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మరియు పంచాయతీరాజ్ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ గారు ఆరు నెలల వ్యవధిలోనే 6500 కోట్ల రూపాయలు గ్రామాల అభివృద్ధికి నిధులు ఇచ్చారని గుర్తించుకోమని వైయస్సార్ పార్టీ ప్రజాప్రతినిధులకు గుర్తు చేశారు.

ఈ కార్యక్రమంలో పంచాయతీరాజ్ ఛాంబర్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బిర్రు ప్రతాప్ రెడ్డి, ఉపాధ్యక్షులు కొత్తపు ముని రెడ్డి , జల్లు కొండయ్య, సింగంశెట్టి సుబ్బరామయ్య,   చిత్తూరు జిల్లా పంచాయతీ రాజ్ ఛాంబర్ అధ్యక్షుడు చుక్కా ధనుంజయ యాదవ్ సర్పంచ్ల సంఘం రాష్ట్ర కార్యదర్శులు  భూమా గోపాల్ రెడ్డి ,పార్థసారధి రెడ్డి, యనమల సుధాకర్, సర్పంచుల సంఘం జిల్లా అధ్యక్షులు లక్ష్మీనారాయణ పంచాయతీ రాజ్ ఛాంబర్ మరియు సర్పంచుల సంఘం నాయకులు  చింత కిరణ్ యాదవ్, కుప్పాల సుబ్బయ్య, సంగటి గంగిరెడ్డి, లక్ష్మీనారాయణ, ప్రభాకర్ రెడ్డి, నాగార్జున ఆచారి, రామాంజనేయ రెడ్డి, మహేష్ ,తదితరులు పాల్గొన్నారు.

Also read

Related posts

Share via