25 మందిని మోసం చేసి నగదు, బంగారు ఆభరణాలతో పరారైన ఓ నిత్య పెళ్లికూతురిని రాజస్థాన్ పోలీసులు అరెస్టు చేశారు. ఈమె బారినపడిన ఓ బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.
పెళ్లి పేరుతో 25 మందిని మోసం చేసిన ఓ మహిళ ఎట్టకేలకు పోలీసులకు చిక్కింది. రాజస్థాన్‌కు చెందిన అనురాధ పాసవాన్ అనే ఓ మహిళ పెళ్లి పేరిట అమాయకులను మోసం చేసేందుకు ఏకంగా ఓ గ్యాంగ్‌నే నడుపుతోంది. పెళ్లి చేసుకున్నాక ముందుగా అత్తారింట్లో అమాయకురాలిగా నటిస్తూ వారి ఆస్తులు, డబ్బుకు సంబంధించిన రహస్యాలను తెలుసుకొనేది. అలా ఇంట్లో అందరి మెప్పు పొందాక తన గ్యాంగ్ సాయంతో నగలు, డబ్బుతో పరారయ్యేది. ఇలా ఒక్కరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 25 మందిని మోసం చేసిన ఈ లేడీ కిలాడీని రాజస్థాన్‌లోని మాధోపుర్ పోలీసులు అరెస్ట్ చేశారు.
అనురాధ పాసవాన్ తాను ఒంటరి యువతినని చెప్పుకుంటూ నాటకాలు మొదలుపెట్టేది. తనకు ఒక సోదరుడు ఉన్నాడని నమ్మబలికేది. తన గ్యాంగ్‌లోని ఒక వ్యక్తిని పెళ్లికి మధ్యవర్తిగా పంపిస్తూ సంబంధాలు కుదుర్చుకునేది. కొత్త పేరు, కొత్త ఊరు, కొత్త గుర్తింపు కార్డులతో పెళ్లిళ్లు చేసుకునేది. పెళ్లి అయ్యాక అత్తారింట్లో అమాయకంగా నటిస్తూ వారి మెప్పు పొందేది. వారికి తనపై నమ్మకం కుదిరాక వారి ఆస్తులు, నగలు, డబ్బుల గురించి తెలుసుకునేది.
భోజనంలో మత్తుమందు కలిపి
టైమ్ చూసి ఇంట్లో వాళ్లందరికి భోజనంలో మత్తుమందు కలిపి తన గ్యాంగ్ ను పిలిచి విలువైన వస్తువులు, నగదుతో పరారయ్యేది. ఇలా ఇప్పటివరకు 25 మందని మోసగించింది. తాజాగా ఈమె బారిన పడిన ఓ బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు కథంతా బయటపడింది. ఆమెపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు అమెను అదుపులోకి తీసుకున్నారు. ఈమె మైండ్ గేమ్‌ను బాగా తెలుసుకున్న మాధోపుర్ పోలీసులు అదేతరహాలో పాసవాన్‌ను బురిడీ కొట్టించి అరెస్టు చేశారు. పోలీసులు కాబోయే వరుడి కుటుంబ సభ్యులుగా నటిస్తూ ఈ కిలేడీని పట్టుకున్నారు. కాగా కేవలం ఏడు నెలల్లోనే వివిధ రాష్ట్రాల్లో 25 మంది పురుషులను ఈమె వివాహం చేసుకోగా ప్రస్తుతం ఆమె వయసు 23 సంవత్సరాలు మాత్రమే.
గతంలో ఉత్తరప్రదేశ్‌లోని మహారాజ్‌గంజ్‌లోని ఒక ఆసుపత్రిలో ఉద్యోగం చేస్తున్న ఆమె ఒక ఇంటి వివాదం తర్వాత తన భర్త నుండి విడిపోయి భోపాల్‌కు వెళ్లింది. అక్కడ, స్థానిక ఏజెంట్ల నెట్‌వర్క్ ద్వారా వివాహ మోసగాళ్ల ముఠాతో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయంతో ఇలా మోసం చేస్తూ అందినకాడ రూ. 5 లక్షల వరకు ఎత్తుకెళ్లేది.
Also read
- Medak: ప్రేమ పెళ్లి.. పేరెంట్స్‌ను కౌన్సిలింగ్‌కు పిలిచిన పోలీసులు.. ఆపై ఊహించని సీన్..
- Hyderabad: కుటుంబ సమేతంగా ఆత్మహత్యాయత్నం.. ఒక్క ఫోన్ కాల్ జీవితాలనే మార్చేసింది..!
- Ratha Saptami 2026: దరిద్రం వదిలి ఐశ్వర్యం వస్తుంది!.. రథ సప్తమి నాడు ఏ రాశి వారు ఏం దానం చేయాలి?
- Moon Transit: చంద్ర సంచారం.. ఈ మూడు రాశులకు జాక్‌పాట్.. ఊహించని లాభాలు!
- భార్యను చంపేశానంటూ పోలీస్ స్టేషన్లో లొంగిపోయిన భర్త.. విచారణలో సంచలనాలు..!





