July 1, 2024
SGSTV NEWS
Andhra PradeshAssembly-Elections 2024Political

కోడికత్తి కమల్ హాసన్‌ని తరిమికొడదాం… చంద్రబాబు నాయుడు

*PRESS RELEASE*

*జగన్ నన్ను పశుపతి అన్నాడు*

*పశుపతి అంటే పరమశివుడు*

*మానవాళి కోసం గరళాన్ని మింగిన శివుడిలా.. ప్రజల కోసం నేను శివుడి అవతారమెత్తుతా*

*ప్రజల కోసం ఎన్ని అవమానాలైనా భరిస్తా.. ప్రజల్ని ఈ రాక్షసుడి నుండి కాపాడుకుంటా*

*ప్రశాంతమైన కోనసీమలో కులం పేరుతో రాద్దాంతం సృష్టించారు*

*కోడికత్తి కమల్ హాసన్‌ని తరిమికొడదాం*

*మద్యం, గంజాయి, డ్రగ్స్ తో జాతిని నాశనం చేస్తున్నాడు*

*గత ఎన్నికల్లో బాబాయి హత్య, కోడికత్తి డ్రామాలు.. ఇప్పుడు పింఛన్ల పేరుతో వృద్ధుల జీవితాలతో ఆటలు*

*టీడీపీ 11 సార్లు డీఎస్సీ నిర్వహించింది… నువ్వేం చేశావ్ జగన్ రెడ్డీ?*

*పచ్చగా ఉండే కొత్తపేటను జగ్గిరెడ్డి మాఫియా ముఠాలకు అడ్డాగా మార్చాడు*

*కొత్తపేట ప్రజాగళం సభలో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు*

*రావులపాలెం :* రాయలసీమ కావచ్చు, కోనసీమ కావచ్చు. ఎక్కడ చూసినా అదే స్పందన. గెలుపు మనదేనన్న ధీమా కళ్ల ముందు కనిపిస్తోంది. నూటికి నూరు శాతం అధికారంలోకి వస్తున్నాం. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నాం. రావులపాలెం అంటే గేట్ వే ఆఫ్ కోనసీమ. ఆకలితో ఉన్న సింహం వేట కోసం ఎదురు చూసినట్లు.. రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలు ఎన్నికల కోసం ఎదురు చూస్తున్నారు. రెండు బటన్లు నొక్కి వైసీపీని చిత్తుచిత్తుగా ఓడించి బంగాళాఖాతంలో కలిపేందుకు సిద్ధంగా ఉన్నారు. ప్రశాంతతకు మారుపేరుగా నిలిచే కోనసీమలో ఎప్పుడూ లేని విధంగా దాడులు, దౌర్జన్యాలు, హత్యలు, కబ్జాలు, అక్రమ కేసులు, వసూళ్లు, కుల రాజకీయాలు, మాఫియా రాజ్యాలు, గంజాయి, డ్రగ్స్ తీసుకొచ్చారు. ఇక్కడ జగ్గి రెడ్డి అవినీతికి.. అక్కడ జగన్ రెడ్డి అవినీతికి అంతు లేకుండా పోయింది. జగన్ గ్యాంగ్ మహా దోపిడీకి రాష్ట్రం బలైపోయింది. తెలుగుదేశం జనసేన బీజేపీ కలిసింది ప్రజల కోసమే. జనసేన అధినేత పవన్ కల్యాణ్ వైసీపీ వ్యతిరేక ఓటు చీలకూడదు, రాష్ట్రానికి పట్టిన శని పోవాలని మొదటి నుండి ఒకే మాటపై నిలబడ్డారు. రాష్ట్రాన్ని కాపాడుకోవాలి, దగా పడ్డ రాష్ట్ర అభివృద్ధిని గాడిలో పెట్టడం కోసమే బీజేపీతో కలిసి ముందుకు వెళ్తున్నాం. ప్రజలు గెలవాలి. రాష్ట్రం నిలబడాలి. పూర్వ వైభవం కల్పించాలన్నదే తెలుగుదేశం ఏకైక లక్ష్యం.

*గరళం మింగి మానవాళిని కాపాడినట్లు జనాల్ని కాపాడుకుంటా*

పశుపతి అంటూ నన్ను ఉద్దేశించి మాట్లాడడం చూసి నవ్వుకున్నా. ఎందుకంటే.. పశుపతి అంటే ప్రపంచాన్ని కాపాడేందుకు వచ్చిన పరమశివుడు. గరళాన్ని గొంతులో పెట్టుకుని మానవాళిని కాపాడాడు. అదే విధంగా నాపై ఎన్నో రకాల దాడులు చేశారు. అవహేళనలు చేశారు. అటు పవన్ కల్యాణ్ పై కూడా నిందలేశారు. మేము అన్ని రకాల అవమానాలను భరించాం. ఒకే నిబద్దత, ఒకే ఆలోచనతో నిలబడ్డాం. తెలుగుజాతిని కాపాడుకోవాలనే లక్ష్యంతో అన్ని రకాల దాడుల్ని ఎదుర్కొన్నాం. దాడులు ఎదుర్కోవడమే కాదు.. బుల్లెట్ మాదిరిగా దూసుకెళ్తాం.

*మద్య నిషేధం హామీతో వచ్చి కల్తీ మద్యం వ్యాపారం*

మద్య నిషేధం చేశాకే మళ్లీ ఓట్లు అడుగుతా అన్నాడు. అమలు చేశాడా? ఎన్నికలకు ముందు మాయ మాటలు చెప్పి ఓట్లు దండుకుని, అధికారంలోకి వచ్చాక కల్తీ మద్యంతో ప్రజల ప్రాణాలతో ఆడుకుంటున్నాడు. నిషేధం గాలికొదిలేసి.. రూ.60 ఉండే క్వార్టర్ రూ.200 చేశాడు. రూ.140 ఎవరి జేబుల్లోకి పోతోంది? తన ఆదాయం కోసం, తన ఖజానా నింపుకోవడం కోసం ప్రజల ప్రాణాలు తీసిన దుర్మార్గుడు ఈ జగన్ రెడ్డి. మద్యం తయారు చేసేది వీళ్లే, సరఫరా చేసేది వీళ్లే, అమ్మేది వీళ్లే. నిషేధం పేరుతో మళ్లీ ఓట్లు అడుగుతున్నారు. ఐదేళ్లుగా పరదాలు కప్పుకుని తిరిగాడు. ఆకాశంలో వెళ్తే కూడా చెట్లు నరికేస్తున్నాడు. ఇప్పుడు మరోసారి మోసపూరిత హామీలతో వస్తున్నాడు. అలా వచ్చిన వ్యక్తిని ప్రజలంతా ఏకమై నిలదీయాలి. మద్య నిషేధం చేయకుంటే ఓటు అడిగే హక్కు లేదని నిలదీయాలి. నాశిరకమైన బ్రాండ్లతో అనారోగ్యం బారిన పడ్డారు. వేలాది మంది ప్రాణాలు తీశాడు. గంజాయి తీసుకొచ్చి ప్రజల ప్రాణాలు తీస్తున్నాడు. విశాఖకు ఏకంగా 25 వేల కిలోల డ్రగ్స్ తీసుకొచ్చాడు. యువత జీవితాలను చిదిమేసి వారి ఖజానా నింపుకుంటున్నాడు. కిరాయి కొట్లలో కూడా గంజాయి అమ్మే పరిస్థితి తీసుకొచ్చాడు. ఐదేళ్లు వైసీపీ నేతలు నియోజకవర్గానికి ఏం చేశారు? గంజాయి, డ్రగ్స్ కి అలవాటు పడితే ఎవరూ మన చేతుల్లో ఉండరు. జాతి నిర్వీర్యమైపోతుంది. ప్రజలంతా ఆలోచించాలి. డ్రగ్స్, గంజాయి, కల్తీ మద్యం జోలికి వెళ్లొద్దు. మీ కుటుంబాలకు శోకం మిగల్చొద్దు.

*శవ రాజకీయాలకు పేటెంట్ జగన్ రెడ్డి*

గత ఎన్నికల సమయంలో బాబాయిన గొడ్డలితో నరికి చంపి ఆ సానుభూతితో గెలిచాడు. ఆ విషయాన్ని జగన్ రెడ్డి చెల్లెలే బయటపెట్టింది. షర్మిలను ఎంపీగా నిలబెట్టమన్నందుకే హత్య చేశాడని చెప్పింది. సొంత బాబాయిని చంపే వారు మనకు అవసరమా? కోడికత్తి డ్రామాలాడే వ్యక్తులు మనకు అవసరమా? కొత్తగా పింఛన్ వ్యవస్థపై రాజకీయం మొదలు పెట్టాడు. ఎన్టీఆర్ రూ.30తో పెన్షన్ మొదలు పెడితే.. 2014లో ముఖ్యమంత్రి అయ్యాక రూ.2000కు పెంచాను. జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక ముక్కుతూ మూలుగుతూ రూ.3000 అయ్యే సరికి జగన్ రెడ్డి పోతున్నాడు. అదే నేను అధికారంలోక వచ్చి ఉంటే.. తొలి రోజున రూ.3000 అందించేవాడిని. ఇప్పుడు మాటిస్తున్నా.. రేపు అధికారంలోకి రాగానే రూ.4000 ఇస్తా. వైసీపీ ఎంతగా దిగజారిందో తాజా పరిణామాలు నిదర్శనం. వాలంటీర్లు రాజకీయం చేయడానికి నేను వ్యతిరేకం తప్ప వాలంటీర్లకు కాదు. తటస్థంగా ఉండండి. అధికారంలోకి వచ్చాక న్యాయం చేస్తానని చెప్పాను. బాగా చదువుకున్న వారు కూడా రూ.5 వేల వాలంటీర్లుగా ఉండిపోయారు. అలాంటి వారికి ఉన్నత జీవితం కల్పిస్తానన్నాను. దీంతో వాలంటీర్లను వైసీపీ కార్యకర్తలుగా వాడుకోవడానికి ప్రయత్నించారు. వాలంటీర్లు పెన్షన్లు పంపిణీ చేయడానికి వీల్లేదని, ప్రభుత్వ ఉద్యోగులే చెల్లించాలని ఎన్నికల కమిషన్ చెప్పింది. గ్రామ సచివాలయాల్లో 1.30 లక్షల ఉద్యోగులున్నారు. ఒక్కొక్కరు సగటున 40 మందికి ఇస్తే ఒకట్రెండు రోజుల్లో పూర్తైపోతుంది. కానీ, కోడి కత్తి డ్రామా కమల్ హాసన్ ఏం చేశాడో చూశాం. బాబాయిని చంపి సానుభూతితో ఓట్లు అడిగాడు. కోడికత్తితో మరికొంత సానుభూతి సంపాదించాడు. ఇప్పుడు వృద్ధుల్ని చంపేసి.. మనవల్ల చనిపోయారని డ్రామాలాడేందుకు కోడికత్తి కమల్ హాసన్ ప్రయత్నిస్తున్నాడు.

*టీడీపీ వృద్ధుల కడుపు నింపితే.. జగన్ కడుపు కొడుతున్నాడు*

అధికారులు, చీఫ్ సెక్రటరీ ఈ డ్రామాలకు సహకరించడం సిగ్గుచేటు. ఒక్క నెల ఇళ్ల వద్దకే పెన్షన్లు ఇవ్వలేరా? ప్రతిపక్సాలపై బురద జల్లడం కోసం పెన్షన్లు ఇవ్వకుండా ఆపేశారు. వృద్ధులు, దివ్యాంగులు, ఇతర బాధితులందరికీ రూ.200 పెన్షన్ రూ.2000 చేశాను. ఆ రోజు అన్న క్యాంటీన్లతో పేదలందరికీ రూ.5కే కడుపునిండా అన్నం పెట్టాం. మూడు పూటలా భోజనం చేస్తే అయ్యే ఖర్చు నెలకు రూ.450 అంటే ఇంకా రూ.1550 మిగిలేది. కానీ నేడు అన్న క్యాంటీన్లు ఎత్తేశాడు. పైగా వృద్ధులతో శవ రాజకీయాలు చేస్తున్నాడు. శవ రాజకీయాలు, తప్పుడు రాజకీయాలను ఎండగట్టాలి. ఫేక్ ప్రచారాలు, తప్పుడు హామీలతో రాజకీయ లబ్దిపొంది రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నాడు. నేను హామీ ఇస్తున్నా.. అధికారంలోకి రాగానే ఇంటి దగ్గరకు తెచ్చి రూ.4000 పెన్షన్ ఇస్తా. ప్రభుత్వ ఖజానా మొత్తాన్ని ఖాళీ చేశాడు. ఈ రోజు 3వ తేదీ. ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలిచ్చావా? పెన్షన్లు ఇచ్చావా? ఇవ్వడానికి ప్రభుత్వం దగ్గర డబ్బులున్నాయా? నాటకాలాడి ప్రజల్ని రెచ్చగొట్టాలనుకుంటే చూస్తూ ఊరుకోను. వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులకు ప్రజలంతా అండగా నిలవండి. పెన్షన్లు అందుకునే వరకు తోడుగా ఉండాలని కోరుకుంటున్నా.

*ప్రశాంతమైన కోనసీమలో కులం పేరుతో రాద్దాంతం సిగ్గుచేటు*

జగన్ రెడ్డి సైకో మనస్తత్వంతో ఏ ఒక్కరూ కంటి నిండా నిద్రపోయింది లేదు. పోలీసుల్ని గోడలు దూకించి.. ఏమీ లేని చోట కూడా కేసులు పెట్టి అవస్థలపాలు చేశారు. నాకు నచ్చిన ప్రాంతం ఈ కోనసీమ. ప్రశాంతకు మారు పేరుగా ఉండే ప్రాంతమిది. అలాంటి కోనసీమలో చిచ్చు పెట్టారు. కులం పేరుతో రాద్దాంతం సృష్టించారు. వ్యవసాయం సంక్షోభంలోకి నెట్టారు. రైతు, రైతు కూలీ జగన్ రెడ్డికి ఓటేస్తారా? సబ్సిడీలు అందుతున్నాయా? నీళ్లు రావు, గిట్టుబాటు ధరలు అందవు. రూ.12500 ఇస్తానని చెప్పిన ఈ దొంగ కేంద్రం ఇచ్చే రూ.6000ను తన ఖాతాలో వేసుకున్నాడు. మనం కట్టిన ఇళ్లకు రంగులేసుకుని రిబ్బన్లు కట్ చేసుకున్నాడు. రైతులు సంక్షోభంలో కూరుకుపోయారు. దేశంలోనే అత్యధిక అప్పులు గల రాష్ట్రాల్లో ఏపీ అగ్రస్థానంలో ఉంది. ప్రతి రోజూ సగటున మూడు రైతు ఆత్మహత్యలు జరుగుతున్నాయి. ఎక్కడి నుండో వచ్చిన కాటన్ దర దవళేశ్వరం బ్యారేజీ కట్టినందుకు దేవుడిలా కొలుస్తున్నారు. అలాంటి ప్రాంతంలో క్రాప్ హాలిడే ప్రకటించిన దుర్మార్గుడు జగన్ రెడ్డి. రాష్ట్ర విభజన తర్వాత పోలవరం కట్టే బాధ్యత మనకి వచ్చింది ఐదేళ్లలో 72 శాతం పనులు పూర్తి చేశాం. 2020 టార్గెట్ పెట్టుకుని పనులు చేశాం. అదే జరిగితే గోదావరి జిల్లాల్లో మూడు పంటలు పండేవి. కానీ, జగన్ రెడ్డి పోలవరం ప్రాజెక్టుని నిర్వీర్యం చేశాడు. ధాన్యం సేకరణకు సంచులు కూడా ఇవ్వలేని దిక్కుమాలిన స్థితిలో జగన్ రెడ్డి ఉన్నాడు. ధాన్యం అమ్ముకోవాలంటే కూడా ఎదురు లంచాలివ్వాల్సిన దుస్థితి కల్పించాడు. క్వార్టర్ బాటిల్ ఇచ్చి, కులం, మతం ప్రాంతం పేరుతో చిచ్చు పెట్టి చలికాచుకోవాలని జగన్ రెడ్డి ప్రయత్నిస్తున్నాడు. రావులపాలెంలో రెడ్లు ఎక్కువ. జగ్గి రెడ్డికి తప్ప ఏ  రెడ్డికైనా న్యాయం జరిగిందా? కాంట్రాక్టర్లు, ఫైనాన్షియర్లు, వ్యాపారస్తులు అంతా నాశనమైపోయారు. తాను బాగుంటే చాలు అనేలా జగన్ వ్యవహరిస్తున్నాడు.

*ఆక్వాను ఆదుకునే బాధ్యత నాది*

కోనసీమలో 2 లక్షల ఎకరాల్లో ఆక్వా సాగు అవుతోంది. దేశంలోనే ఆక్వా ఎగుమతుల్లో ఏపీ అగ్రస్థానంలో ఉంది. జగన్ రెడ్డి వచ్చాక ఖర్చు మూడు రెట్లు పెరిగింది. మద్దతు ధర రావడం లేదు. సీడ్, సీడ్, మందులు, సెస్ అన్నీ పెంచేశాడు. రూ.300 వచ్చే కరెంటు బిల్లు రూ.1500 అయింది. ఆక్వా రంగం కూలిపోయింది. రూ.1.50కి యూనిట్ ఇస్తానని జోన్, నాన్ జోన్ అంటూ నిబంధనలు పెట్టాడు. నేను హామీ ఇస్తున్నా.. ఆక్వ రంగాన్ని కాపాడుతా. రూ.1.50కే యూనిట్ ఇచ్చే బాధ్యత తీసుకుంటా. ఆర్టీసీ, పెట్రోల్ డీజిల్, లిక్కర్ సహా అన్ని ధరలూ పెరిగాయి. కానీ ప్రజల ఆదాయ పెరగలేదు. ఇలాంటి దుర్మార్గుడు ఉంటే.. మన బతుకులు చితికిపోతాయి.

నమ్మిన వారి గొంతు కోసి, నట్టేట ముంచే వ్యక్తి జగన్ రెడ్డి. నా బీసీలు అంటూనే బీసీలకు చెందిన 30 సంక్షేమ పథకాలు రద్దు చేశాడు. నా ఎస్సీ అంటూ.. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఇదే నియోజకవర్గంలో అంబేద్కర్ ని అవమానించాడు. అడ్డుకున్న యువకులపై కేసులు పెట్టి జైల్లో పెట్టాడు. ఒక ఎమ్మెల్సీ దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని చంపేసి డోర్ డెలివరీ ఇచ్చాడు. దళితులకు ఎవరికైనా పైసా ప్రయోజనం కలిగిందా? అంబేద్కర్ రాసిన రాజ్యాంగం రాష్ట్రంలో అమలవుతోందా? సబ్ ప్లాన్ నిధులు దారి మళ్లించారు. కేంద్ర పథకాలు దూరం చేశారు. దళితులకు సబ్ ప్లాన్ పక్కాగా అమలు చేసే బాధ్యత నేను తీసుకుంటా. గోదావరి జిల్లాలో భవిష్యత్తులో ఎమ్మెల్సీ ఇచ్చి తీరుతా. శెట్టి బలిజలకు ఎమ్మెల్యే, పొలిట్ బ్యూరో అవకాశం కల్పించాం. బడుగు బలహీన వర్గాలకు అండగా నిలిచే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుంది. పేదరికం లేని సమాజమే నా లక్ష్యం.

మైనార్టీలకు ఇచ్చే రంజాన్ తోఫా, దుల్హన్ లాంటి పథకాలు ఎత్తేసి నా మైనార్టీ అంటాడు. కాపులకు జగన్ రెడ్డి ఏం న్యాయం చేశాడో చెప్పగలరా? రూ.10 వేల కోట్లు ఖర్చు చేస్తాని చెప్పిన జగన్ రెడ్డి కాపులకు పైసా ఖర్చు చేయలేదు. ఇలాంటి రాజకయీయాలు చేసే వారి మాటలు ఇంకా వింటామా? కాపులకు ఎవరేం చేశారో.. ప్రజలకు చెప్పే ధైర్యం ఈ వైసీపీ నేతలకు ఉందా? తెలుగుదేశం పార్టీకి బీసీలు కంచుకోట. కాపుల్లో కూడా పేదలు ఉన్నారనే లక్ష్యంతో కాపులకు న్యాయం చేశాం. అప్పులు చేసి పంచడం కాదు.. సంపద సృష్టించి, ఆదాయం పెంచి పేదలందరికీ పంచుతాను. ఇచ్చిన ప్రతి రూపాయిని రెట్టింపు చేసుకునేలా మార్గాలు చూపిస్తాను.

*11 సార్లు డీఎస్సీ టీడీపీ జరిపింది.. నువ్వేం చేశావ్ జగన్ రెడ్డీ*

డ్వాక్రా సంఘాలు తెచ్చి ప్రతి మహిళకు ఆర్దిక స్వాతంత్ర్యం కల్పించింది తెలుగుదేశం. ఆస్తి హక్కు కల్పించింది ఎన్టీఆర్. స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ తెచ్చింది ఎన్టీఆర్. విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు పెట్టి చదువుకునేలా ప్రోత్సహించింది తెలుగుదేశం. వంట గ్యాస్ ఇచ్చింది టీడీపీ. మరుగుదొడ్లు కట్టించి తోడుగా నిలిచింది తెలుగుదేశం. కొత్త బిచ్చగాళ్లు వచ్చి అంతా నేనే చేశానంటున్నాడు. నేనేం చేశానని ఈ సైకో అడుగుతున్నాడు. 8 సార్లు డీఎస్సీ ఇచ్చాను. ఎన్టీఆర్ 3 డీఎస్సీలు పెట్టారు. ఇప్పుడున్న టీచర్లలో 75% నేను నియమించిన వాళ్లే. ఐదేళ్లు అధికారంలో ఉన్న జగన్ రెడ్డి ఒక్కటంటే ఒక్క డీఎస్సీ కూడా ఇవ్వలేదు. ఒక్క డీఎస్సీ పెట్టలేని, ఒక్కరికి ఉద్యోగం ఇవ్వలేని దద్దమ్మ నా గురించి మాట్లాడుతున్నాడు. తెలుగు జాతిని కాపాడే మహాశివుడ్ని నేను.

*ప్రజల జీవితాలు మార్చేలా సూపర్ సిక్స్ అమలు*

ఆడబిడ్డ నిధితో ప్రతి ఆడ బిడ్డకూ నెలకు రూ.1500 చొప్పున ఇంట్లో ఎంత మంది ఉంటే అందరికీ ఇస్తాను. ఆదాయం పెంచడానికి మార్గాలు చూపిస్తాను. గతంలో రూపాయి రూపాయి పొదుపు చేయమన్నాను. రివాల్వింగ్ ఫండ్ ఇచ్చా. ఇప్పుడు ఆ సొమ్ము వేల కోట్లుగా చేరింది. తల్లికి వందనంతో బడికి వెళ్లే ప్రతి బిడ్డకూ ఏటా రూ.15 వేలు ఇస్తాను.  ధరల నియంత్రణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటా. ఏటా మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా అందించే బాధ్యత తీసుకుంటాను. ప్రతి మహిళకూ ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం కల్పిస్తాను. మా చంద్రన్న ఇచ్చిన రైట్ ప్రకారం బస్సు ఎక్కుతున్నట్లు చెప్పి ధైర్యంగా బస్సు ఎక్కండి.

యువగళం పేరుతో ప్రతి నిరుద్యోగికీ రూ.3000 నిరుద్యోగ భృతి ఇస్తా. ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలిచ్చే బాధ్యత నాది. తొలి సంతకం మెగా డీఎస్సీపై పెడతానని కాలర్ ఎగరేసి చెబుతున్నా. జాబు రావాలంటే బాబు రావాలనేది మా నినాదం. 40 రోజులు ప్రతి యువకుడూ పార్టీ కోసం పని చేయాలి. సైకిల్ ఎక్కి కదలండి. 175 అసెంబ్లీ అభ్యర్ధులూ రాష్ట్రాన్ని రక్షించుకునే సైనికులు. 175 అసెంబ్లీ సీట్లు గెలవాలి.

అన్నదాతకు ఏటా రూ.20 వేలు అందించి రైతే రాజు అనేలా తీర్చిదిద్దుతా. ఇంటింటికీ మంచినీరు అందిస్తా. పేదరికం లేని సమాజ నిర్మాణానికి పని చేస్తా. పేదరికం లేకుండా చేస్తా. పన్నుల బాదుడు ఉండదు. కరెంటు ఛార్జీలు పెంచం. నాణ్యమైన కరెంటు ఇస్తా.

పచ్చగా ఉండే కొత్తపేటను జగ్గిరెడ్డి మాఫియా ముఠాలకు అడ్డాగా మార్చాడు. మేనమామను షాడో ఎమ్మెల్యేగా పెట్టుకుని బదిలీలు, కాంట్రాక్టర్లలో అవినీతికి పాల్పడుతున్నాడు. ప్రతి పేటలోనూ జగ్గిరెడ్డి మార్క్ అవినీతి కనిపిస్తోంది. లంకల్లో మట్టి మాఫియా, భూ కబ్జాలు, సెటిల్మెంట్లు, లే అవుట్లు వేయాలంటే కప్పం కట్టాల్సిన పరిస్థితి దాపురించింది. 250 ఎకరాల్లో పంట సాగు చేసినట్లు చెప్పి బీమా కొట్టేశాడు. ఐదేళ్లలో జగ్గి రెడ్డి చేసిన ఏకైక పెట్టుబడి మద్యం బార్. పేదలకు ఇళ్ల స్థలాల పేరుతో వందల కోట్లు వెనకేసుకున్నాడు. పంట కాలువల్లో పూడిక తొలగింపూ చేతలేదు. భవన నిర్మాణ రంగం నాశనం చేశాడు. కాంట్రాక్టర్లను వేధిస్తున్నాడు. చిన్న కాంట్రాక్టర్లు ఆత్మహత్యలు చేసుకోవాల్సిన పరిస్థితి కల్పించాడు.

నియోజకవర్గాన్ని అభివృద్ధిలో పరుగులు పెట్టించే బాధ్యత నాది. కొబ్బరిని గతంలో నాఫెడ్ ద్వారా కొనుగోలు చేశాం. అధికారంలోకి రాగానే కొబ్బరి ఉత్పత్తుల పరిశ్రమలు ఏర్పాటుకు చొరవ తీసుకుంటాను. పనులు చేసి చూపించే బాద్యత నాది. ఓట్లు వేసే బాధ్యత ప్రజలు తీసుకోవాలి. బండారు సత్యానందరావు సీనియర్ నాయకుడు. ప్రజలంటే ఎంతో అభిమానం ఉండే వ్యక్తి. మరో వ్యక్తి యువకుడు, కోనసీమ ముద్దుబిడ్డ బాలయోగి వారసుడు. దళిత జాతికి వన్నె తెచ్చిన వ్యక్తి బాలయోగి వారసుడు. స్పీకర్ గా నియమించి అత్యున్నత గౌరవం కల్పించాను. ఏ నమ్మకంతో ఆ సీట్లో కూర్చోబెట్టానో.. అంతకు మించి న్యాయం చేసిన వ్యక్తి బాలయోగి. కోనసీమలో ఏడుగురు ఎమ్మెల్యే అభ్యర్ధుల్ని, ఎంపీగా గెలిపించండి. అభివృద్ధి చేసి చూపించే బాధ్యత నేను తీసుకుంటా.

ఒక్క ఓటు తేడాగా పడినా.. మనకి భవిష్యత్ ఉండదని గుర్తుంచుకోవాలి. రాష్ట్రాన్ని కాపాడుకునే సైనికులుగా టీడీపీ జనసేన బీజేపీ కార్యకర్తలు పని చేయాలి. ప్రతి కార్యకర్తనూ ఆదుకునే బాధ్యత నేను తీసుకుంటా.

Also read

Related posts

Share via