భార్యాభర్తల మధ్య వివాదం చిలికి చిలికి గాలివానై భర్త హత్యకు దారితీసింది. ఈ ఘటన తూర్పుగోదావరి జిల్లాలో జరిగింది.
నిడదవోలు : భార్యాభర్తల మధ్య వివాదం చిలికి చిలికి గాలివానై భర్త హత్యకు దారితీసింది. ఈ ఘటన తూర్పుగోదావరి జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తూర్పుగోదావరి జిల్లా ఉండ్రాజవరం మండలంలోని రెడ్డి చెరువు గ్రామానికి చెందిన చింతలపూడి శ్రీనివాసరావు, రాణి దంపతుల మధ్య కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో మంగళవారం రాత్రి వారిద్దరి మధ్య గొడవ జరిగింది. ఆ సమయంలో రాణి తన భర్త శ్రీనివాసరావు గుండెలపై కత్తెరతో పొడిచింది. తీవ్రంగా గాయపడిన శ్రీనివాసరావును అతని తమ్ముడు తణుకులోని జిల్లా కేంద్రాసుపత్రికి తరలించాడు. అక్కడ చికిత్స పొందుతూ శ్రీనివాసరావు మృతి చెందాడు. మృతుడి అన్న గోవిందరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఉండ్రాజవరం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఐపీసీ 302 సెక్షన్ కింద కేసు నమోదు చేశామని, నిందితురాలిని అరెస్ట్ చేస్తామని సీఐ శ్రీనివాసరావు తెలిపారు.
Also read
- అమెరికా వీసా రాక యువతి ఆత్మహత్య
- తల్లితో వివాహేతర సంబంధం.. కూతురుపై అత్యాచారం..!
- Andhra: రేయ్.. ఏంట్రా ఇది.. బయట బోర్డేమో ఒకటి.. లోపల మాత్రం కథ వేరు.. అనుమానం వచ్చి వెళ్లగా..
- AP Crime: నెల్లూరులో దారుణం.. మహిళను వేధించాడు.. నడి రోడ్డుపై నరికారు
- నేటి జాతకములు….14 ఆగస్టు, 2025