నగరంలోని చందానగర్లో స్పా సెంటర్పై పోలీసులు దాడులు చేశారు. నలుగురు యువతులు, ముగ్గురు విటులను అదుపులోకి తీసుకున్నారు.
హైదరాబాద్: నగరంలోని చందానగర్లో స్పా సెంటర్ పై పోలీసులు దాడులు చేశారు. నలుగురు యువతులు, ముగ్గురు విటులను అదుపులోకి తీసుకున్నారు. స్పా ముసుగులో వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. పక్కా సమాచారంతో హ్యూమన్ ట్రాఫికింగ్ పోలీసులు దాడి చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
మరో ఘటనలో కేపీహెచ్బీ నాలుగో రోడ్డులోని సెలూన్ షాప్పై పోలీసులు దాడులు చేశారు. సెలూన్, స్పా ముసుగులో వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. ముగ్గురు యువతులు, ఇద్దరు విటులను అదుపులోకి తీసుకున్నారు.
హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లోని బార్లు, పబ్లపై ఆకస్మిక దాడులు చేశారు. హైదరాబాద్లో 12, రంగారెడ్డిలో 13 బార్లు, పబ్బులపై శనివారం రాత్రి తనిఖీలు నిర్వహించారు. ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ కమలాసన్రెడ్డి ఆదేశాల మేరకు తనిఖీలు చేశారు. 25 ప్రముఖ బార్లు, పబ్బులపై 25 ప్రత్యేక బృందాలతో దాడులు జరిగాయి. డ్రగ్స్ వినియోగంపై 12 ప్యానెల్ డ్రగ్స్ డిటెక్షన్ కిట్స్తో పరీక్షలు చేశారు.
Also read
- అమెరికా వీసా రాక యువతి ఆత్మహత్య
- తల్లితో వివాహేతర సంబంధం.. కూతురుపై అత్యాచారం..!
- Andhra: రేయ్.. ఏంట్రా ఇది.. బయట బోర్డేమో ఒకటి.. లోపల మాత్రం కథ వేరు.. అనుమానం వచ్చి వెళ్లగా..
- AP Crime: నెల్లూరులో దారుణం.. మహిళను వేధించాడు.. నడి రోడ్డుపై నరికారు
- నేటి జాతకములు….14 ఆగస్టు, 2025