SGSTV NEWS
CrimeUttar Pradesh

ఎంతకు తెగించావ్రా ప్రొఫెసర్‌ .. విద్యార్థులను రేప్ చేసి వెబ్‌సైట్లలో వీడియోలు అప్‌లోడ్!


ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో విద్యార్థులను లైంగికంగా వేధించాడనే ఆరోపణలు ఎదుర్కొంటున్న 50 ఏళ్ల ప్రొఫెసర్‌ను పోలీసులు అరెస్టు చేశారు. 65 కి పైగా వీడియోలు కొన్ని అశ్లీల వెబ్‌సైట్లలో అప్‌లోడ్ కూడా చేశాడని పోలీసులు తెలిపారు.

ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో విద్యార్థులను లైంగికంగా వేధించాడనే ఆరోపణలు ఎదుర్కొంటున్న 50 ఏళ్ల ప్రొఫెసర్‌ను పోలీసులు అరెస్టు చేశారు. నగ్న వీడియోలను ఉపయోగించి విద్యార్థులను బ్లాక్ మెయిల్ చేశాడని, అలాగే లైంగిక వేధింపులకు గురిచేశాడనే ఆరోపణలు అతనిపై ఉన్నాయి.  హత్రాస్‌లోని సేథ్ ఫూల్ చంద్ బాగ్లా పీజీ కళాశాల చీఫ్ ప్రొక్టర్ రజనీష్ కుమార్ పై ఈ ఆరోపణలు వచ్చినప్పటి నుండి పరారీలో ఉన్నాడు, విద్యార్థులపై లైంగిక వేధింపులకు గురిచేసిన వీడియోలు పోలీసులకు చేరాయి.

ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ను ఇన్‌స్టాల్
రజనీష్ కుమార్ ఎంత మంది మహిళలను వేధించాడో తనకే తెలియదని వెల్లడించాడని పోలీసులు చెబుతున్నారు. విద్యార్థులకు పరీక్షల్లో ఎక్కువ మార్కులు వేయడానికి, ఉద్యోగాలు ఇప్పించడానికి లంచాలు కూడా తీసుకున్నాడని, లైంగిక వేధింపులకు కూడా పాల్పడేవాడని పోలీసుల విచారణలో వెల్లడైంది.  హత్రాస్‌లోని పోలీసు సూపరింటెండెంట్ చిరంజీవ్ నాథ్ సిన్హా ప్రకారం, కుమార్ తన అత్యాచార వీడియోలను రికార్డ్ చేయడానికి తన కంప్యూటర్‌లో ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ను ఇన్‌స్టాల్ చేసుకున్నాడని తెలిపారు.  65 కి పైగా వీడియోలు కొన్ని అశ్లీల వెబ్‌సైట్లలో అప్‌లోడ్ చేశాడని పోలీసులు తెలిపారు.

Also Read

Related posts

Share this