– ప్రకాశం జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్
– అధిక శబ్దం చేసే మాడిఫైడ్ సైలెన్సర్ల లను రోడ్ రోలర్ తో ధ్వంసం.
– మాడిఫైడ్ సైలెన్సర్లు వాడే బైకర్లపై ఉక్కుపాదం.
– ప్రతి వాహనదారుడు ట్రాఫిక్ నిబంధనలు మరియు రోడ్డు భద్రత నియమాలను పాటించాలి.
ఒంగోలు::
జిల్లాలోని శాంతిభద్రతలు, నేరాలు నియంత్రణ, వాహనదారుల ట్రాఫిక్ ఉల్లంఘనలు జరగకుండా రోడ్డు భద్రతా నియమాలను పాటించేలా చూడటమే లక్ష్యంగా ఒంగోలు టౌన్ పరిధిలో విపరీతమైన ధ్వని పుట్టించే సైలెన్సర్లు వాడుచున్న బైకర్లపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. నెల రోజులో ఒంగోలు టౌన్ పరిధిలో ట్రాఫిక్ పోలీస్ లు స్పెషల్ డ్రైవ్ తనిఖీలు చేపట్టి తమ ద్విచక్ర వాహనాలకు మాడిఫైడ్ సైలెన్సర్లు వాడి అధిక శబ్దం చేసే 515 సైలెన్సర్ లను నగరంలోని అద్దంకి సెంటర్ వద్ద రోడ్ రోలర్ తో ధ్వంసం చేశారు. ఈ సందర్భముగా ఎస్పీ దామోదర్ మీడియాతో మాట్లాడుతూ… నంబర్ ప్లేట్లు లేని/ సరైన నంబర్ ప్లేట్లు లేని 1050 బైకులను గుర్తించి వాటి పై చట్టపరమైన చర్యలు తీసుకున్నామని తెలిపారు. మోటార్ వాహనాల చట్టం నిబంధనలు ఉల్లంఘించి ద్విచక్ర వాహనాల కంపెనీ తయారీదారులు ఇచ్చిన సైలెన్సర్ స్థానంలో అధిక శబ్దాన్నిచ్చే సైలన్సర్లతో ప్రయాణించే వాహనాలను ఉపేక్షించమన్నారు. బైకులకు విపరీత శబ్దాన్నిచ్చే సైలెన్సర్ అమర్చుకుని శబ్ద కాలుష్యం సృష్టిస్తే చట్టపరమైన చర్యలు తీసుకోవడమే కాకుండా జరిమానా విధిస్తామని, వాహనాలకు మాడిపైడ్ సైలెన్సర్లను విక్రయించే షాపుల యజమానులు, వాటిని బిగించే మెకానిక్ లపై కూడా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
బైకులకు కంపెనీలు నిర్ధేశించిన సైలెన్సర్స్ తీసివేసి వేరే సైలెన్సర్లను మార్చడం వలన ధ్వని, గాలి కాలుష్యం జరుగుతుందని, భారీ శబ్దాలను చేస్తున్న వాహనాల వల్ల గుండె జబ్బులు కలిగిన వారు, వృద్ధులు భయపడుతున్న పరిస్థితులు ఎదురవుతున్నాయని చెప్పారు. ప్రతి వాహనదారుడు ట్రాఫిక్ నిబంధనలు మరియు రోడ్డు భద్రత నియమాలను పాటించాలని, వాహనాలకు రణగొణ ధ్వనులు చేసే సైలెన్సర్ అమర్చుకొని ప్రజలకు, తోటి ప్రయాణికులకు అసౌకర్యం కల్గించకుండా బాధ్యతాయుతంగా ఉండాలని కోరారు.
త్రిబుల్ రైడింగ్, డ్రైవింగ్ లైసెన్స్, నెంబర్ ప్లేట్స్ లేని వాహనాలు, ఓవర్ స్పీడ్, మాడిఫైడ్ సైలెన్సర్‌లు ఉన్న ద్విచక్ర వాహనాలపై చట్టపరమైన చర్యలు తీసుకోవటం జరుగుతుంది. వాహనాల నెంబర్ ప్లేట్లు యం.వి యాక్ట్ నిబంధనల ప్రకారం ఉండాలని, వాహనదారులు డ్రైవింగ్ లైసెన్స్, రిజిస్ట్రేషన్, ఇన్సూరెన్స్ ఇతర ధ్రువపత్రాలు కలిగి ఉండాలన్నారు.

జిల్లా ఎస్పీ వెంట ఒంగోలు డిఎస్పీ ఆర్.శ్రీనివాసరావు, ఎస్బి ఇన్స్పెక్టర్ కె.వి.రాఘవేంద్ర, ఒంగోలు ట్రాఫిక్ సీఐ పాండు రంగారావు, ఒంగోలు తాలూకా సిఐ అజయ్ కుమార్, ఒంగోలు వన్ టౌన్ సీఐ నాగరాజు మరియు సిబ్బంది పాల్గొన్నారు.
Also read
- Palnadu: భార్యపై అనుమానంతో భర్త ఘాతుకం.. ఏం చేశాడో తెలుస్తే షాక్!
- AP Crime: ఏపీలో దోపిడి దొంగల బీభత్సం.. పట్టపగలే ఇళ్లలోకి దూరి!
- అప్పు ఇచ్చిన వ్యక్తితో అక్రమ సంబంధం.. మొక్కజొన్న చేను దగ్గర సైలెంట్‌గా లేపేసింది!
- వరూధుని ఏకాదశి రోజున తులసితో ఈ పరిహారాలు చేయండి.. పెండింగ్ పనులు పూర్తి అవుతాయి..
- Swapna Shastra: కలలో ఈ మూడు పక్షులు కనిపిస్తే మీకు మంచి రోజులు వచ్చాయని అర్ధమట..