March 15, 2025
SGSTV NEWS
Andhra PradeshCrime

Posani Bail: బెయిల్ రాకపోతే మరణమే.. కన్నీళ్లు పెట్టకున్న పోసాని



Posani Bail Petition:వైసీపీ నేత, నటుడు కమ్ నిర్మాత, దర్శకుడు పోసాని కృష్ణ మురళికి మరో భారీ షాక్ తగిలింది. చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేశారని సీఐడీ నమోదు చేసిన కేసులో ఆయనను గుంటూరు కోర్టులో హాజరు పరిచారు.

Posani Bail Petition: పోసాని కృష్ణమురళిపై కూటమి ప్రభుత్వం పకడ్బందీగా ఒక దాని తర్వాత మరొకటి కేసుల మీద కేసులు నమోదు చేస్తూనే ఉంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఆయనపై ఆంధ్ర ప్రదేశ్ లోని పలు జిల్లాలో పలు కేసులు నమోదు చేశారు. ఒక దానిపై బెయిల్ వస్తే.. మరొక కేసులో బెయిల్ రాకుండా పకడ్బందీగా  కేసులు నమోదు చేస్తారు. ఈ నేపథ్యంలో సీఐడీ నమోదు చేసిన కేసులో గుంటూరు కోర్టులో హాజరు పరిచారు. 

ఈ నేపథ్యంలో   ఇరు వైపుల వాదనలు విన్న కోర్టు..పోసాని కృష్ణ మురళికి 14 రోజుల రిమాండ్‌ విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఈనెల 28వ తేదీ వరకు రిమాండ్‌లో ఉండనున్నారు. అంతకుముందు జడ్జి ఎదుట పోసాని బోరున విలపించారు. తన ఆరోగ్యం బాగాలేదని, రెండు సార్లు ఆపరేషన్‌ చేసి స్టంట్లు వేశారని కంటతడి పెట్టాడు.


బెయిల్‌ రాకుంటే ఆత్మహత్యే శరణ్యమని జడ్జి ఎదుట వాపోయాడు. రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో పోసానిపై కేసులు నమోదు అయ్యాయి. బెయిల్‌పై విడుదలైనా మళ్లీ ఏదో ఒక పోలీస్ స్టేషన్ నుంచి పోలీసులు పీటీ వారెంట్‌పై పోసాని కృష్ణమురళిని తీసుకెళ్లే అవకాశం ఉంది. మొత్తంగా పోసాని కృష్ణమురళి చేసిన అనుచిత వ్యాఖ్యలకు ఏపీలోని కూటమి ప్రభుత్వం తగిని శాస్తి చేసిందని పలువురు టీడీపీ, జనసేనా కార్యకర్తలు అంటున్నారు. మరోవైపు వైసీపీ నేతలు కూడా ఆలీలా కొంత కంట్రోల్ తప్పుకుండా ఉంటే బాగుండేది. మొత్తంగా పోసాని ఇష్యూతో మిగిలిన వైసీపీ నేతలు కంట్రోల్ అవుతారనే ఉద్దేశ్యంతో కూటమి ప్రభుత్వం పోసాని కృష్ణమురళికి నరకాన్ని స్పెల్లింగ్ ఎలా ఉంటుందో చూపిస్తున్నారు. 

Related posts

Share via