December 3, 2024
SGSTV NEWS
Andhra Pradesh

సమాజ అసమానతలు రూపుమాపేందుకు పూలే మార్గం అనుసరణీయం…….ఐ.ఫ్.టి.యు.

సమాజ అసమానతలు రూపుమాపేందుకు పూలే మార్గం అనుసరణీయం……. తీపర్తి వీర్రాజు, జిల్లా కమిటీ సభ్యులు, ఐ.ఫ్.టి.యు.
      సత్య శోధక్ సమాజ్ 152 వ ఆవిర్భావ వారోత్సవాల నిర్వహించాలన్న సి.పి.ఐ.యం.ల్ (న్యూడెమోక్రసీ) పార్టీ పిలుపు లో భాగంగా నిడదవోలు యార్న్ గూడెం రోడ్ లో ఇఫ్టు స్థూపం వద్ద ఇఫ్టూ జిల్లా కమిటీ సభ్యులు తీపర్తి వీర్రాజు ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ 151 సంవత్సరాల క్రితమే నాటి సమాజంలో వున్న అసమానతలు, దళితులు, మహిళలు, అణగారిన వర్గాల అణిచివేత, కనీసం సాటి మనుషులు గా కూడా చూడలేని తీవ్ర మైన పరిస్థితులలో, మహిళా విద్య కోసం, మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా నిచ్చెన మెట్ల కుల వ్యవస్థ ను రూపు మాపేందుకు సత్య శోధక్ సమాజ్ స్థాపించారనీ, ఐతే ఆ సంస్థ ఆశయాలు నేటికీ నెరవేరని కారణంగా పూలే-సావిత్రి బాయి ఆచరణ నేటికీ ఆదర్శ నీయమన్నారు.
      ఐ.యఫ్.టి.యు జిల్లా సహాయ కార్యదర్శి ఈమని గ్రీష్మ కుమార్ మాట్లాడుతూ దేశంలో బి.జె.పి అధికారంలోకి వచ్చాక మతం పేరిట ప్రజల్లో అలజడులు సృష్టిస్తోందనీ, స్వయానా బిజెపి ఎంపిలు, ఎం.యల్.ఏ., నాయకులు అనేక అత్యాచార, హత్యా సంఘటనల్లో ముద్థాయిలు గా వుండి కూడా ఏవిధమైన శిక్షలు పడకుండా, తప్పించుకొని తిరుగుతున్నారని బిల్కిస్ భాను, కాశ్మీర్ (కధువా) బాలికల సంఘటనలే దీనికి నిదర్శనం అన్నారు. భూత కల్లోలానికి కారణమౌతూ , తన మాతృ సంస్థ ఆర్.యస్.యస్. మనువాద భావజాలం ప్రజలపై రుద్దుతూ ప్రశ్నించిన వారిపై నిర్భంధ చట్టాలు అమలు చేస్తోందనీ, తన అప్రజాస్వామిక విధానాలు మెరుగు పరచడానికి, ప్రజల దైనందిన సమస్యలు చర్చలోకి రాకుండా, ఒక ప్రక్క మణిపూర్ అల్లర్లు, పౌర స్మృతి, ఒకటే మతం, ఒకే జాతి, ఒకే ఎన్నికలు, ఒకే పన్ను విధానం అంటూ మరో ప్రక్క తన ఫాసిస్ట్ విధానాలు అమలు చేస్తు న్న నేపధ్యంలో సామాజిక అసమానతలు రూపుమాపేందుకు పూలే మార్గం, సత్య శోధక్ సమాజ్ ఆశయాలు కొనసాగింపు అవశ్యమన్నారు.
       పై కార్యక్రమంలో పిచ్చా సూర్య కిరణ్, లంకాడ గణపతి, వీర రాఘవులు, సోమరాజు, కోనేటి మల్లేశ్వర రావు, కోడి అబ్బులు, నాగరాజు, ప్రకాశం, సుబ్బారావు, వాసు తదితరులు నాయకత్వం వహించారు.

Also read

Related posts

Share via