*నిర్వాహకులతో పాటు మహిళ అరెస్ట్
వెంగళరావునగర్: వ్యభిచార గృహంపై దాడి చేసి నిర్వాహకులతో పాటు ఓ మహిళను అదుపులోకి తీసుకున్న సంఘటన సోమవారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం… రమంత్ నగర్ లోని ఓ గృహంలో వ్యభిచారం జరుగుతున్నట్టుగా మధురానగర్ పీఎస్ కు సమాచారం వచ్చింది.
దీంతో ఎస్ఐ అవినాష్ తన సిబ్బందితో వెళ్ళి దాడి చేశారు. అక్కడ నిర్వాహకులు వంశీ, అతని భార్య ఉన్నారు. వారితో పాటుగా వైజాగ్ కు చెందిన మహిళ కూడా ఉంది. నిర్వాహకులను పోలీసులు ప్రశ్నించగా వైజాగ్ కు చెందిన మహిళతో వ్యభిచారం చేయిస్తున్నట్టుగా అంగీకరించారు. దీంతో వారిని అదుపులోకి తీసుకొని వారి వద్ద ఉన్న కండోమ్స్, ఫోన్ లు స్వాదీనం చేసుకున్నారు. ఈ మేరకు మధురానగర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Also read
- Garuda Puranam: పునర్జన్మ అంటే ఏంటి..? గరుడ పురాణం ఏం చెబుతోంది..?
- నేటి జాతకములు…1 మే, 2025
- Lady Aghori: జైల్లో అఘోరీతో బడా పొలిటీషియన్ ములాఖత్.. అతడు ఎవరంటే?
- అయ్యో.. మూడేళ్ల క్రితమే పెళ్లి.. సింహాచలంలో సాఫ్ట్వేర్ దంపతులు దుర్మరణం!
- నెల్లూరులో ఇంట్లోకి దూసుకెళ్లిన కారు.. ఆరుగురు దుర్మరణం!