పోలీసుల అదుపులో గ్యాంబ్లింగ్ రాయుళ్లు
కాయిన్స్‌తో జూదం ఆడిస్తున్న సీడ్స్ సైంటిస్ట్
14 మందిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
రూ.53,510 నగదు, రూ.61,620 విలువైన గ్యాంబ్లింగ్ కాయిన్స్ స్వాధీనం
మేడ్చల్: ఓ విత్తన పరిశ్రమలో పని చేసే సీడ్ సైంటిస్ట్ నిర్వహిస్తున్న గేమింగ్ స్థావరంపై ఎస్‌ఓటీ పోలీసులు దాడి చేసి 14 మందిని అదుపులోకి తీసుకున్నారు. రూ.53,510 నగదు, రూ.61,620 విలువైన గ్యాంబ్లిగ్ కాయిన్స్ స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం వివరాలు.. మేడ్చల్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని కండ్లకోయ గ్రామంలో టీచర్స్ కాలనీలో ఫ్లాట్ నంబర్– 12లో ఓ సీడ్స్ కంపెనీలో సీనియర్ సైంటిస్ట్‌గా పెగినేని రాజేష్ పనిచేస్తున్నాడు. ఇతను పెద్ద ఎత్తున గ్యాంబ్లింగ్ నిర్వహిస్తున్నాడనే సమాచారం తెలియడంతో పోలీసులు దాడులు చేశారు. అక్రమ సంపాదనకు అలవాటు పడ్డ రాజేష్ గత మూడేళ్లు స్థావరాలు మారుస్తూ పేకాట, గ్యాంబ్లింగ్ నిర్వహిస్తున్నాడు.
గ్యాంబ్లింగ్ పాల్గొనేవారి నుంచి అడ్వాన్స్‌గా రూ.20వేల నగదు తీసుకుని వారికి గ్యాంబ్లింగ్ ప్లాస్టిక్ కాయిన్స్ ఇస్తున్నాడు. రోజుకు 20 ఆటలు ఆడించే అతను ఒక్కో ఆటకు రూ.1,000 వసూలు చేస్తున్నాడు. నగదు రూపంలో కాకుండా కాయిన్స్ రూపంలో గ్యాంబ్లింగ్ నడిపిస్తూ జోరుగా అక్రమ దందా నిర్వహిస్తూ లక్షలాది రూపాయలు గడిస్తున్నాడు. కండ్లకోయలో గ్యాంబ్లింగ్ నిర్వహిస్తున్నారనే సమాచారంతో సైబరాబాద్, మేడ్చల్ ఎస్‌ఓటీ టీం పోలీసులు దాడులు చేశారు. పోలీసులు అదుపులోకి తీసుకున్న వారిలో ప్రధాన నిర్వాహకుడు పెగినేని రాజేష్, తోట శ్రీనివాస్, వాసుబాబు, తులసి వెంకటరావు, శంకర్, కోట బాలరాజు, తోకటి శంకర్, విజయ్‌కుమార్ వర్మ, మాధవరెడ్డి, యాదగిరి, రమణకుమార్, హేమంత్‌రాయుడు, రామరాజు, పవన్‌కుమార్, కండ్లకోయకు చెందిన రాజేందర్‌లు ఉన్నారు.
Also read
- ఆ ఆలయంలో పూజ చేస్తే అపమృత్యు దోషం దూరం! ఎక్కడుందంటే?
- నేటి జాతకములు….25 అక్టోబర్, 2025
- Telangana: 45 ఏళ్ల మహిళతో పరాయి వ్యక్తి గుట్టుగా యవ్వారం.. సీన్లోకి కొడుకుల ఎంట్రీ.. కట్ చేస్తే
- ఉపాధి కోసం కువైట్ వెళ్తానన్న భార్య.. వద్దన్న భర్త ఏం చేశాడో తెలుసా?
- Telangana: వారికి జీతాలు ఇచ్చి ఆ పాడు పని చేపిస్తున్నారు.. పొలీసులే నివ్వెరపోయిన కేసు ఇది..




