పశ్చిమగోదావరి జిల్లా పెనుమంట్ర మండలం మాముడూరు లో మాజీ మంత్రి ఆచంట టిడిపి జనసేన బిజెపి ఉమ్మడి అభ్యర్థి పితాని సత్యనారాయణ విజయాన్ని ఆకాంక్షిస్తూ పితాని సత్యనారాయణ కోడలు నాగ సాహితీ ఇంటింటా ప్రచారం నిర్వహించారు. మీ అమూల్యమైన ఓటును మీ అభ్యర్థి పితాని సత్యనారాయణ సైకిల్ గుర్తుకు ఎంపీ అభ్యర్థి కమలం గుర్తుకు ఓటు వేసి అఖండ విజయాన్ని చేకూర్చాలని ఓటర్లను అభ్యర్థించారు. తెలుగుదేశం పార్టీ సూపర్ సిక్స్ పథకాలు మహిళలకు అధిక ప్రాధాన్యత ఇస్తుందన్నారు. ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితం, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ప్రతి మహిళకు నెలకు పదిహేను వందల రూపాయలు, తల్లికి వందనం పథకం ద్వారా ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఒక్కొక్కరికి 15 వేల రూపాయలు, నిరుద్యోగ భృతి కింద మూడు వేల రూపాయలు, పింఛన్లు వృద్ధులకు నెలకు 4000 ఇంటి వద్దకే అందజేస్తామని నాగ సాహితీ ప్రచారంలో ప్రతి మహిళకు అర్థమయ్యేలా వివరించారు. ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు మాముడూరు గ్రామంలో తాగునీటి చెరువు పచ్చగడ్డిల నిండి పోయిందని అసమర్థుల పాలనలో తాగునీటి చెరువు ఈ దుస్థితి దాపరించిందని మహిళలు పితాని నాగ సాహితీ కి మొరపెట్టుకున్నారు. ఎన్నికల్లో పితాని సత్యనారాయణ గెలిపించండి మావయ్యతో చెప్పి సమస్య పరిష్కరిస్తామంటూ మహిళలకు హామీ ఇచ్చారు. అభివృద్ధి సంక్షేమం పితాని సత్యనారాయణ తో సాధ్యమని పితాని సత్యనారాయణకు అఖండ విజయాన్ని చేకూర్చాలని అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో బిజెపి మహిళా మోర్చా నాయకురాలు మాలతి, జనసేన వీర మహిళలు, తెలుగుదేశం పార్టీ తెలుగు మహిళలు తదితరులు పాల్గొన్నారు.
Also read
.
- DNA test: దివ్యాంగ సోదరిపై అత్యాచారం.. నాలుగేళ్లకు ‘డీఎన్ఏ’ పరీక్షలో దొరికిపోయి!
- ఉరేసుకొని వివాహిత ఆత్మహత్య
- నువ్వు చాలా అందంగా ఉన్నావు…. తక్కువ వయస్సులా కనిపిస్తున్నావు..
- మాజీ ప్రియురాలిపై రౌడీ షీటర్ లడ్డూ దాడి
- బాత్రూంలో కెమెరాలతో భార్యపై నిఘా.. ప్రసన్న-దివ్య కేసులో బిగ్ ట్విస్ట్