April 11, 2025
SGSTV NEWS
Crime

Pinipe Srikanth: ప్రశ్నిస్తే కేసులు.. ఎదురు తిరిగితే దాడులు


అధికార బలంతో రెచ్చిపోయారు. తండ్రి మంత్రి పదవిని అడ్డం పెట్టుకొని ఇష్టారాజ్యంగా ప్రవర్తించారు. ఎవరైనా ప్రశ్నిస్తే.. పోలీస్ స్టేషన్కు పిలిపించి వారిని ఇబ్బంది పెట్టడం.. దూషణలకు పాల్పడేవారు.

తండ్రి విశ్వరూప్ అధికారంతో రెచ్చిపోయిన శ్రీకాంత్ దళిత యువకుడి హత్య కేసులో సూత్రధారిగా నిర్ధారణ

రాజమహేంద్రవరం, , అమలాపురం పట్టణం, పి.గన్నవరం: అధికార బలంతో రెచ్చిపోయారు. తండ్రి మంత్రి పదవిని అడ్డం పెట్టుకొని ఇష్టారాజ్యంగా ప్రవర్తించారు. ఎవరైనా ప్రశ్నిస్తే.. పోలీస్ స్టేషన్ కు పిలిపించి వారిని ఇబ్బంది పెట్టడం.. దూషణలకు పాల్పడేవారు. వైకాపా ప్రభుత్వ హయాంలో డా. బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా అమలాపురం మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి పినిపె విశ్వరూప్ తనయుడు శ్రీకాంత్ వ్యవహారశైలి ఇది. 2022 జూన్ 6న జరిగిన అయినవిల్లికి చెందిన దళిత యువకుడు, వాలంటీర్ జనుపల్లి దుర్గాప్రసాద్ హత్య కేసులో ప్రధాన సూత్రధారి శ్రీకాంతన్ను తమిళనాడులోని మదురైలో ఆదివారం రాత్రి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గతేడాది అంబేడ్కర్ జయంతి సందర్భంగా కొందరు ద్విచక్ర వాహనాల సైలెన్సర్లు తొలగించి అమలాపురంలో ర్యాలీ చేయగా, నాలుగు వాహనాలను పోలీసులు స్టేషన్కు తరలించారు.

వాటిని తమ వారికి ఇచ్చేయాలని శ్రీకాంత్ డీఎస్పీ మాధవరెడ్డిని కోరారు. ధ్రువపత్రాలతో రావాలని చెప్పడంతో ఆగ్రహంతో వెళ్లిన శ్రీకాంత్ తండ్రి విశ్వరూప్ తోపాటు అనుచరులను తీసుకొని స్టేషన్కు వచ్చారు. ‘మీరు అన్నెససరీ చేస్తున్నారు.. చలో అమలాపురానికి పిలుపునివ్వమంటారా? ఇంతకు వందరెట్లు పోలీసులను తెచ్చుకున్నా సరిపోరు’ అంటూ విశ్వరూప్ డీఎస్పీపై ఆగ్రహించారు. పోలీసుల అనుమతి లేకుండానే వాహనాలను పట్టుకుపోయారు. అమలాపురం మండలం కామనగరువులో గతేడాది ఆగస్టు 31న శ్రీకాంత్ ‘గడప గడపకు’ కార్యక్రమం నిర్వహించారు. కోనసీమ 5 జిల్లా పేరు మార్పు విషయంలో తమను అన్యాయంగా కేసుల్లో ఇరికించారని పలువురు యువకులు ఆయన్ను నిలదీశారు. దీంతో ఆ ముగ్గురు యువకులను పోలీసు స్టేషన్కు తీసుకెళ్లి రాత్రయినా పంపలేదు. స్థానికుల ఆందోళనతో అర్ధరాత్రి విడిచిపెట్టి కేసులు పెట్టారు. తాను కాబోయే ఎమ్మెల్యేనంటూ శ్రీకాంత్ ప్రచారం చేసుకున్నారు. ఉద్యోగుల నియామకాలు, బదిలీల్లో సైతం జోక్యం చేసుకునేవారనే ఆరోపణలున్నాయి.

Also read

Related posts

Share via