వార ఫలాలు (ఫిబ్రవరి 23-29, 2025) మేష రాశి వారి ఆర్థిక పరిస్థితి ఇదివరకటి కంటే బాగా మెరుగుపడుతుంది. నిరుద్యోగులకు ఆశించిన ఉద్యోగావకాశాలు లభిస్తాయి. వృషభ రాశి వారికి అనుకోకుండా మంచి పెళ్లి సంబంధం కదురుతుంది. నిరుద్యోగులకు సొంత ఊర్లోనే ఆశించిన ఉద్యోగం లభించే అవకాశం ఉంది. మిథున రాశి వారికి కెరీర్ పరంగా ఒకటి రెండు శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. కుటుంబ జీవితంలో ఎదురు చూస్తున్న శుభవార్తలు వినే అవకాశం ఉంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి వారఫలాలు ఎలా ఉన్నాయంటే..
మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)
వృత్తి, ఉద్యోగాల్లో పని ఒత్తిడి నుంచి, అదనపు బాధ్యతల నుంచి విముక్తి లభిస్తుంది. వ్యాపారాలు లాభదాయకంగా సాగిపోతాయి. ఆదాయం బాగా పెరుగుతుంది. ముఖ్యమైన పనులు, వ్యవహారాలు సానుకూలంగా పూర్తవుతాయి. ప్రయాణాల వల్ల లాభాలు కలుగుతాయి. ఆర్థిక పరిస్థితి ఇదివరకటి కంటే బాగా మెరుగుపడుతుంది. కుటుంబ సభ్యుల మీద ఖర్చులు బాగా పెరిగే అవకాశం ఉంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఆర్థిక లావాదేవీలు పెట్టుకోకపోవడం మంచిది. వ్యక్తిగత సమస్యలు చాలావరకు తగ్గుముఖం పడతాయి. నిరుద్యోగులకు ఆశించిన ఉద్యోగావకాశాలు లభిస్తాయి. ఉన్నత స్థాయి కుటుంబంతో పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. ఒకరిద్దరు బంధు మిత్రులకు ఆర్థికంగా సహాయపడతారు. చాలా కాలంగా ఎదురు చూస్తున్న శుభవార్తలు వింటారు.
వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)
అనుకోకుండా మంచి పెళ్లి సంబంధం కదురుతుంది. నిరుద్యోగులకు సొంత ఊర్లోనే ఆశించిన ఉద్యోగం లభించే అవకాశం ఉంది. వృత్తి, ఉద్యోగాల్లో శ్రమ ఎక్కువగా ఉన్నప్పటికీ, ఆశించిన ప్రోత్సాహకాలు లభిస్తాయి. వ్యాపారాలు నిలకడగా సాగిపోతాయి. సొంత పనుల మీద శ్రద్ధ పెట్టడం మంచిది. ఆకస్మిక ధనలాభానికి అవకాశం ఉంది. రాదనుకుని వదిలేసుకున్న డబ్బు కూడా చేతికి అందుతుంది. కొన్ని ముఖ్యమైన ఆస్తి, ఆర్థిక వ్యవహారాలతో కుటుంబ సభ్యుల సలహాలు, సూచనలు బాగా కలిసి వస్తాయి. గృహ, వాహన ప్రయత్నాల మీద దృష్టి కేంద్రీకరిస్తారు. కుటుంబ జీవితం బాగా అనుకూలంగా సాగిపోతుంది. ఆరోగ్యంలో మెరుగుదల కనిపిస్తుంది. ఇతరుల వ్యవహారాల్లో తలదూర్చకపోవడం మంచిది. ధనపరంగా ఎవరికీ వాగ్దానాలు చేయడం శ్రేయస్కరం.
మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)
కెరీర్ పరంగా ఒకటి రెండు శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. కుటుంబ జీవితంలో ఎదురు చూస్తున్న శుభవార్తలు వినే అవకాశం ఉంది. ఆస్తి వివాదం ఒకటి పరిష్కారమయ్యే సూచనలు న్నాయి. ఉద్యోగ జీవితం సాఫీగా, హ్యాపీగా సాగిపోతుంది. వృత్తి, వ్యాపారాల్లో ఆర్థిక లావాదేవీలు, కార్యకలాపాలు బాగా పెరుగుతాయి. పెళ్లి ప్రయత్నాల విషయంలో బంధువులు సహాయ సహ కారాలు అందిస్తారు. ఆర్థిక వ్యవహారాల్లో సరైన నిర్ణయాలు తీసుకుని బాగా లాభపడతారు. భాగ స్వామ్య వ్యాపారంలో లాభాలు పెరుగుతాయి. నిరుద్యోగులకు దూర ప్రాంతంలో మంచి ఉద్యోగానికి ఆఫర్ వచ్చే అవకాశం ఉంది. పిల్లలు కొద్ది ప్రయత్నంతో ఘన విజయాలు సాధిస్తారు. భారీగా వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. పెళ్లి ప్రయత్నాలు విజయవంతం అయ్యే అవకాశం ఉంది.
కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)
ఒకటి రెండు ముఖ్యమైన వ్యక్తిగత, ఆర్థిక సమస్యలు పరిష్కారమై ఊరట లభిస్తుంది. ఆదాయం బాగా పెరిగే అవకాశం ఉంది కానీ, కుటుంబం మీద ఖర్చులు బాగా పెరిగే అవకాశం ఉంది. ఉద్యోగ జీవితం సానుకూలంగా సాగిపోతుంది. ఆశించిన శుభవార్తలు వినే అవకాశం కూడా ఉంది. వృత్తి, వ్యాపారాలు నిలకడగా సాగిపోతాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. సోదరులతో స్థిరాస్తి వ్యవహారాలు పరిష్కార దిశగా సాగుతాయి. ఆకస్మిక ప్రయాణాలకు అవకాశం ఉంది. కుటుంబ జీవితం సాఫీగా సాగిపోతుంది. పిల్లలకు సంబంధించి విద్య, ఉద్యోగాలు సంతృప్తికరంగా సాగిపోతాయి. ఆరోగ్యం చాలావరకు అనుకూలంగానే ఉంటుంది. కొందరు బంధుమిత్రులతో అను కోకుండా అపార్థాలు తలెత్తే అవకాశం ఉంది. నిరుద్యోగులకు ఒకటి రెండు ఆఫర్లు అందుతాయి.
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)
ఉద్యోగంలో అధికారులు అదనపు బాధ్యతలను అప్పగించే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాల్లో శ్రమాధిక్యత ఉన్నా ఆశించిన ప్రతిఫలం ఉంటుంది. ముఖ్యమైన వ్యవహారాల్లో శ్రమ, తిప్పట తప్పకపోవచ్చు. ఆదాయం ఆశించిన స్థాయిలో కలిసి వస్తుంది. ముఖ్యంగా షేర్ల వల్ల బాగా లాభాలు కలుగుతాయి. అదనపు ఆదాయ ప్రయత్నాలు కూడా బాగా అనుకూలంగా ఉంటాయి. బంధు మిత్రులతో ఆచితూచి వ్యవహరించడం మంచిది. ఆరోగ్యం విషయంలో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. ఆర్థిక వ్యవహారాల్లో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకపోవడం మంచిది. నిరుద్యోగులకు ఆశించిన శుభవార్త అందే అవకాశం ఉంది. కొందరు బంధుమిత్రులకు ఆర్థికంగా సహాయం చేస్తారు. పెళ్లి ప్రయత్నాల్లో ఆశించిన సంబంధం కుదిరే అవకాశం ఉంది. పిల్లలు వృద్దిలోకి వస్తారు.
కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)
చాలా కాలంగా ఎదురు చూస్తున్న శుభవార్తలు అందుతాయి. పెండింగ్ పనులన్నిటినీ పట్టుదలగా పూర్తి చేస్తారు. ఉద్యోగ జీవితం నల్లేరు కాయల మీద బండిలా సాగిపోతుంది. వృత్తి, వ్యాపా రాలు నష్టాల నుంచి చాలావరకు బయటపడే అవకాశం ఉంది. ప్రతి విషయంలోనూ ప్రణాళికా బద్ధంగా వ్యవహరించడం మంచిది. ఆదాయం అనేక విధాలుగా వృద్ధి చెందుతుంది. ఆర్థిక వ్యవహారాలు సానుకూలంగా సాగిపోతాయి. పిల్లలు కొద్ది శ్రమతో చదువుల్లో ఘన విజయాలు సాధిస్తారు. చిన్ననాటి మిత్రులతో సరదాగా కాలక్షేపం చేస్తారు. దైవ కార్యాల్లో పాల్గొంటారు. ప్రయాణాల్లో కొద్దిగా జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉంది. ఆర్థిక పరిస్థితి నిలకడగా ఉంటుంది. అనవసర ఖర్చులు తగ్గించుకోవడం చాలా అవసరం. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి.
తుల (చిత్త 3,4,స్వాతి, విశాఖ 1,2,3)
ఉద్యోగంలో మంచి గుర్తింపు లభిస్తుంది. అధికారుల నుంచి ఊహించని ప్రతిఫలం లభిస్తుంది. హోదా పెరిగే అవకాశం కూడా ఉంది. జీతభత్యాలతో పాటు అదనపు రాబడి కూడా పెరిగే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాల్లో ఊహించని అవకాశాలు అందివస్తాయి. అదనపు ఆదాయ మార్గాలను వీలైనంతగా సద్వినియోగం చేసుకోవడం మంచిది. అనుకున్న పనులు, వ్యవహారాలు అనుకున్నట్టు పూర్తవుతాయి. ఆదాయం బాగా వృద్ధి చెందే అవకాశం ఉంది కానీ, విలాసాల మీద ఖర్చులు బాగా పెరుగుతాయి. కొందరు ఇష్టమైన బంధువులతో శుభ కార్యాల్లో పాల్గొంటారు. వ్యక్తి గత సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. ఆరోగ్యం మీద శ్రద్ద పెట్టడం మంచిది. బాగా పరిచయస్థు లతో అనుకోకుండా పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. నిరుద్యోగులకు ఉద్యోగ యోగం పడుతుంది.
వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ఠ)
ఉద్యోగంలో పని భారం బాగా పెరుగుతుంది. అధికారులు మీ పనితీరుతో సంతృప్తి చెందుతారు. మీ సమర్థతకు తగిన గుర్తింపు లభిస్తుంది. వృత్తి, వ్యాపారాల్లో ఆశించిన లాభాలను పొందుతారు. మంచి పరిచయాలు ఏర్పడతాయి. కుటుంబంతో కలిసి ఆలయాలను సందర్శిస్తారు. సామాజిక సేవా కార్యక్రమాల్లో కూడా పాల్గొంటారు. సొంత ఇల్లు కొనుగోలు ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి. జీవిత భాగస్వామితో కలిసి వస్త్రాభరణాలను కొనుగోలు చేస్తారు. కొద్దిపాటి శ్రమ, తిప్పటతో ముఖ్యమైన వ్యవహారాలను పూర్తి చేస్తారు. కుటుంబ వ్యవహారాల మీదా, సొంత పనుల మీదా మరింతగా శ్రద్ధ పెట్టడం మంచిది. ఆరోగ్యం బాగానే ఉంటుంది. ప్రయాణాల వల్ల ఇబ్బందులు పడే అవకాశం ఉంది. నిరుద్యోగులకు సొంత ఊర్లో చిన్నపాటి ఉద్యోగం లభించే అవకాశం ఉంది.
ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)
ధనార్జనకు సమయం బాగా అనుకూలంగా ఉంది. ఆదాయ వృద్దికి ఎటువంటి ప్రయత్నం తల పెట్టినా విజయవంతం అవుతుంది. ఉద్యోగ బాధ్యతల్లో సానుకూల మార్పులు, చేర్పులు చోటు చేసుకుంటాయి. వృత్తి, వ్యాపారాలు బాగా బిజీ అయిపోతాయి. రాబడి బాగా పెరిగే అవకాశం ఉంది. ఉద్యోగంలో అధికారులు మీ సలహాలు, సూచనల వల్ల బాగా ప్రయోజనం పొందుతారు. ఆర్థిక వ్యవహారాలన్నీ విజయవంతంగా పూర్తవుతాయి. ఉద్యోగ ప్రయత్నాలకు సంబంధించి విదేశాల నుంచి కీలక సమాచారం అందుతుంది. పెళ్లి ప్రయత్నాల్లో అనుకోకుండా ఒక శుభవార్త వినే అవకాశం ఉంది. ఆకస్మిక ధన లాభానికి అవకాశం ఉంది. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టడం మంచిది. కుటుంబ జీవితం సాఫీగా సాగిపోతుంది.
మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2)
ఉద్యోగంలో అనుకూల వాతావరణం ఉంటుంది. అధికారులు అనేక విధాలుగా ప్రోత్సహిస్తారు. సహోద్యోగుల సహకారం కూడా లభిస్తుంది. వృత్తి జీవితంలో కార్యకలాపాలు బాగా వృద్ధి చెందుతాయి. వ్యాపారాల్లో లాభాలు పెరగడంతో పాటు కొత్త అవకాశాలు అందుతాయి. ఆర్థికంగా ఇతరులకు సహాయం చేయగల స్థితిలో ఉంటారు. కుటుంబ జీవితం సాఫీగా, సానుకూలంగా సాగి పోతుంది. ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది కానీ, అనవసర సహాయాలు చేయకపోవడం చాలా మంచిది. ముఖ్యమైన వ్యవహారాలు విజయవంతంగా పూర్తవుతాయి. తల్లితండ్రుల జోక్యంతో ఆస్తి వివాదం ఒకటి సానుకూలంగా పరిష్కారమవుతుంది. కొందరు బంధుమిత్రులకు అండగా నిలబడతారు. ఇంటా బయటా కొద్దిగా ఒత్తిడి ఉంటుంది. ఆరోగ్యం బాగా అనుకూలంగా ఉంటుంది.
కుంభం (ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)
ఆదాయానికి లోటుండదు. చిన్న ప్రయత్నంతో అత్యధికంగా ఆదాయం పెరుగుతుంది. అనుకున్న పనుల్ని అనుకున్నట్టు పూర్తి చేస్తారు. బాగా పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి. కుటుంబ సభ్యుల సహాయంతో వ్యక్తిగత సమస్య ఒకటి పరిష్కారం అవుతుంది. ఉద్యోగంలో బరువు బాధ్యతలు బాగా పెరుగుతాయి. అధికారులు బాగా ఎక్కువగా ఉపయోగించుకునే అవకాశం ఉంది. కుటుంబ సభ్యుల నుంచి కూడా సహాయ సహకారాలు లభిస్తాయి. కొందరు బంధుమిత్రుల నుంచి రావలసిన సొమ్మును రాబట్టుకుంటారు. ఇంతవరకూ వసూలు కాని బాకీలు కూడా వసూలు అవుతాయి. సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇంటా బయటా మీ మాటకు విలువ పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాల్లో శ్రమాధిక్యత ఉన్నా ఫలితం ఉంటుంది.
మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)
ఆదాయ పరిస్థితి బాగా మెరుగ్గా ఉంటుంది. ముఖ్యమైన అవసరాలతో పాటు, ఒకటి రెండు ఆర్థిక సమస్యలు కూడా తీరిపోతాయి. షేర్ల వల్ల బాగా కలిసి వస్తుంది. ఉద్యోగంలో అధికారులు అతిగా ఆధారపడడం వల్ల పని ఒత్తిడికి గురి కావడం జరుగుతుంది. వృత్తి, వ్యాపారాల్లో డిమాండ్ బాగా పెరుగుతుంది. ఆర్థిక లావాదేవీలు పెట్టుకోకపోవడం మంచిది. ధనపరంగా ఎవరినీ గుడ్డిగా నమ్మక పోవడం శ్రేయస్కరం. కుటుంబంలో కొద్దిగా ఒడిదుడుకులు ఉండే అవకాశం ఉంది. అనవసర ఖర్చులు తగ్గించుకోవడం, పొదుపు చేయడం అవసరం. గట్టి ప్రయత్నంతో ముఖ్యమైన వ్యవహారాలను పూర్తి చేస్తారు. స్నేహితుల వల్ల కొద్దిగా ఇరకాట పరిస్థితులు ఎదురయ్యే అవకాశం ఉంది. కుటుంబ జీవితం ప్రశాంతంగా సాగిపోతుంది. నిరుద్యోగులకు మంచి ఉద్యోగం లభించవచ్చు.
గమనిక :- ప్రస్తుతకాల గోచార గ్రహస్థితి, దశాంతర్ధశ, ద్వాదశ భావలు, వాటిపై దృష్టులు, ఉచ్చ నీచ స్థానాలు, షడ్బలాలు మొదలగు అనేక అంశాలను, అలాగే అన్ని రంగాల, వర్గాల వారిని దృష్టిలో పెట్టుకుని సామూహిక ఫలితాలు తెలియజేయడం జరుగుతుంది, ఈ ఫలితాలు మొత్తం తమ ఒక్కరికే వర్తిస్తాయని భావించవద్దు. పేరుతో రాశి ఫలితాలు చూసుకోవడం అనేది సరైన పద్దతి కాదు, ఇది గమనించగలరు. వ్యక్తిగత జాతక వివరాల కొరకు మీకు దగ్గర లో ఉన్న అనుభవజ్ఞులైన జ్యోతిష పండితులను సంప్రదించి వారికి దక్షిణ, తాంబూలాదులనిచ్చి మీ జాతక వివరాలను, తరుణోపాయలను అడిగి శుభ ఫలితాలను పొందగలరు . . ఆధురి భాను ప్రకాష్
తాజా వార్తలు చదవండి
- బ్రహ్మకు జ్ఞానోపదేశం చేసిన శివుడు
- Maha Shivaratri 2025 : మహాశివరాత్రికి జాగరణ ఎందుకు చేయాలి?
- నేటి జాతకములు 24 ఫిబ్రవరి, 2025
- AP news : పోలవరం కాల్వలో పడి ఇద్దరు యువకుల మృతి
- పదిరోజులకే పెళ్లి పెటాకులు.. హనీమూన్లో గొడవ.. చివరికి బిగ్ ట్విస్ట్!
- High Court: మైనర్ బాలికలు శృంగారం చేస్తే తప్పుకాదు.. హైకోర్టు సంచలన వ్యాఖ్యలు!
- TG Crime: మొదటి భర్త చనిపోయి రెండో పెళ్లి చేసుకుంటే.. పాపం దారుణం!
- రాజలింగమూర్తి హత్య కేసులో బిగ్ ట్విస్ట్ .. ఏడుగురు అరెస్ట్!
- Hyderabad: టీచర్ మందలించాడనీ.. స్కూల్ బిల్డింగ్పై నుంచి దూకిన 8వ తరగతి విద్యార్ధి!
- Andhra News: బ్యాంకులో తనఖా పెట్టిన బంగారం విడిపించుకునేందుకు వచ్చిన ఖాతాదారుడు.. కట్ చేస్తే