March 12, 2025
SGSTV NEWS
CrimeTelangana

Hyderabad: విషాదం.. ఫార్మసీ విద్యార్థిని బలిగొన్న రెండక్షరాల ప్రేమ



బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోప్రియాంక అనే ఫార్మసీ విద్యార్థి ప్రైవేట్ హాస్టల్‌లో ఉంటూ చదువుతోంది. ప్రేమించిన వ్యక్తి పెళ్లికి నిరాకరించడంతో సూసైడ్ లేఖ రాసి హాస్టల్ గదిలోనే ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు వెంటనే కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

ప్రేమించిన వాడి కోసం ఓ యువతి ఆత్మహత్య చేసుకున్న దారుణ ఘటన హైదరాబాద్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని వెన్నెలగడ్డలో ప్రియాంక అనే ఫార్మసీ విద్యార్థి ప్రైవేట్ ఆసుపత్రిలో చదువుతోంది. ప్రియాంక ప్రైవేట్ హాస్టల్‌ గదిలోనే ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. తోటి హాస్టల్ విద్యార్థులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు ఘటనా స్థలానికి చేరుకుని, ప్రియాంక గదిని చూడగా ఓ సూసైడ్ నోట్ లభించింది.

ప్రేమికుడు పెళ్లికి నిరాకరించాడని..
ప్రేమ వల్లే తాను చనిపోతున్నట్లు తెలిపింది. రవికుమార్ (28), తాను ప్రేమించుకున్నారని, కానీ పెళ్లి చేసుకోవడానికి తాను రెడీగా లేడని తెలిపింది. పెళ్లికి రవికుమార్ నిరాకరించడంతో తీవ్ర మనస్తాపానికి గురై ఆ యువతి ఆత్మహత్య చేసుకోవడానికి డిసైడ్ అయినట్లు సూసైడ్ నోట్‌లో తెలిపింది. పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చి.. పోలీసులు కేసు నమోదు చేశారు.

ఇదిలా ఉండగా.. హైదరాబాద్‌లోని హబ్సీగూడలో కూడా విషాద ఘటన చోటుచేసుకుంది. ఓ కుటుంబంలోని నలుగురు మృతి చెందారు. ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడలేక ఓ వ్యక్తి తన భార్య, పిల్లలను చంపేసి తాను చనిపోయాడు. గతంలో ప్రైవేట్ కాలేజీలో లెక్చరర్‌గా ఉద్యోగం చేసిన అతను ప్రస్తుతం ఉద్యోగం చేయడం లేదు. ఈ క్రమంలో ఆర్థిక సమస్యలు, వీటితో పాటు ఆరోగ్య సమస్యలు ఉన్నాయని అందుకే ఆత్మహత్య చేసుకున్నట్లు సూసైడ్ లేఖ రాశాడు. దీంతో విషయం బయటపడింది.

Also read

Related posts

Share via