July 3, 2024
SGSTV NEWS
Andhra PradeshAssembly-Elections 2024Political

పంచాయతీ వ్యవస్థలను నిర్వీర్యం చేశారు, స్థానిక సంస్థల అధికారాలను లాగేసుకున్నారు..

*మచిలీపట్నం*
*06/04/2024*

*పంచాయతీ వ్యవస్థలను నిర్వీర్యం చేశారు, స్థానిక సంస్థల అధికారాలను లాగేసుకున్నారు…*

*వైసీపీ ప్రభుత్వ హయాంలో తాగునీటి సమస్య ఏ విధంగా ఉందో స్పష్టంగా అర్థం అవుతోంది…..*

*మచిలీపట్నం నియోజకవర్గం అభివృద్ధి, సంక్షేమం తెలుగుదేశం, జనసేన, బిజెపి కూటమి తోనే సాధ్యం…*

*తెలుగుదేశం పార్టీ తెలుగు రైతు రాష్ట్ర అధికార ప్రతినిధి, కృష్ణాజిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్, గొర్రెపాటి గోపీచంద్ మచిలీపట్నం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో శనివారం నిర్వహించిన పాత్రికేయుల సమావేశం వివరాలు….*

వైసీపీ పాలనలో ప్రజలకు
మంచినీరు కూడా అందించలేని దౌర్భాగ్య స్థితిలో పాలకులు, అధికారులు ఉండటం సిగ్గుచేటు అన్నారు. మూడు రోజులకు ఒకసారి ఇచ్చే మంచినీరు కూడా స్వచ్ఛమైన నీరు ఇవ్వకుండా బురదతో మడ్డిగా రావడం వలన ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు అన్నారు.

వైసీపీ పాలనలో పంచాయతీ వ్యవస్థలను నిర్వీర్యం చేసి పంచాయతీల అభివృద్ధి, సంక్షేమాన్ని అడ్డుకున్నారు అని మండిపడ్డారు.

నేటి వైసిపి పాలకులు స్థానిక సంస్థల అధికారాలను కూడా లాగేసుకుని ఇష్టారాజ్యంగా వ్యవహరించడం దుర్మార్గం కాద అన్నారు.

గత టిడిపి ప్రభుత్వంలో మంచినీటి ఎద్దడి ఎప్పుడు రాలేదని, గ్రామాలలో చివర వరకు మంచినీరు అందించామని, ట్యాంకర్ల ద్వారా కూడా చివరి గ్రామాలకు మంచినీరు అందించామని, నేటి వైసిపి పాలనలో కనీసం గ్రామాలకు మంచినీటి ట్యాంకర్లు కూడా పంపకుండా ప్రజలను ఇబ్బందులకు నేటి వైసిపి పాలకులు
గురి చేస్తున్నారు అన్నారు.

గత టిడిపి ప్రభుత్వంలో దోమలపై దండయాత్ర అనే కార్యక్రమాన్ని పెట్టి దోమల వల్ల వచ్చే వ్యాధులను అరికట్టే విధంగా డ్రైనేజీలలో మడ్డి ఆయిల్, రంపపు పొట్టు, దోమలు చనిపోయే విధంగా ఆయిల్ బాల్స్ డ్రైనేజీల్లో, నీరు నిలవ ఉండే చోట వేసి దోమలను అరికట్టే వారని, నేటి వైసిపి ప్రభుత్వం లో అలాంటి చర్యలు ఏమీ లేవని అందువలన దోమల ప్రభావం ఎక్కువగా ఉండి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు అన్నారు.

నేటి వైసీపీ ప్రభుత్వంలో ముఖ్యంగా యువత జీవితాలు చీకటిమయమయ్యాయి అన్నారు.

వచ్చే ఎన్నికలలోఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తే ఇచ్చే సూపర్ సిక్స్ పథకాలతో ప్రజల జీవితాల్లో వెలుగులు వస్తాయి అన్నారు.

దేశంలో 24 శాతం నిరుద్యోగత ఉన్న రాష్ట్రం మన ఏపీ అన్నారు. భవిష్యత్తులో యువతకు 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని, మెగా డీఎస్సీ నిర్వహిస్తామని, యాట జాబ్ క్యాలెండర్ ఇస్తామని, యువతకు ఉద్యోగాలు వచ్చేంతవరకు నెలకు 3000 రూపాయలు నిరుద్యోగ భృతి కల్పిస్తామని చంద్రబాబు యువతకు పెద్దపీట వేశారు అన్నారు.

నకిలీ బ్రాండ్లు అరికట్టి, ప్రజల ప్రాణాలు కాపాడుతామని కూడా చంద్రబాబు ప్రకటించారు  అన్నారు.

మచిలీపట్నం నియోజకవర్గంలో నేటి వైసిపి పాలకులు మట్టి మాఫియా, భూ దోపిడీతో వేల కోట్లు దోచేశారు అని మండిపడ్డారు.

మచిలీపట్నం నియోజకవర్గం ప్రజల అభివృద్ధి, సంక్షేమం తెలుగుదేశం, జనసేన, బిజెపి కూటమితోనే సాధ్యం అన్నారు.

ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ మచిలీపట్నం నగర కార్పొరేషన్ అధ్యక్షుడు, గడ్డం రాజు, తెలుగుదేశం పార్టీ మచిలీపట్నం నగర కార్పొరేషన్ ప్రధాన కార్యదర్శి, పిప్పళ్ళ వెంకట కాంతారావు, తెలుగుదేశం పార్టీ కృష్ణా జిల్లా ప్రచార కార్యదర్శి, పి. వి. ఫణి కుమార్ , జనసేన నాయకుడు, దేవనూరి వీరబాబు
తదితరులు పాల్గొన్నారు.

Also read

Related posts

Share via