SGSTV NEWS
Andhra PradeshCrime

Palnadu Ragging: పల్నాడు లో ర్యాగింగ్ కలకలం.. కర్రలతో కొడుతూ.. కరెంట్ షాక్ పెడుతూ!  వైరల్


పల్నాడు జిల్లాలో ర్యాగింగ్ కలకలం రేపింది. దాచేపల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో సీనియర్ విద్యార్థులు ర్యాగింగ్ పేరుతో తమను దారుణంగా కొడుతున్నారని జూనియర్స్ ఆందోళనకు దిగారు.

Palnadu Ragging: కాలేజీల్లో ర్యాగింగ్ అరికట్టేందుకు కఠిన చర్యలు తీసుకుంటున్నప్పటికీ విద్యార్థుల తీరు మారడం లేదు. ర్యాగింగ్ పేరుతో జూనియర్ విద్యార్థుల పట్ల అమానుషంగా ప్రవర్తిస్తున్నారు సీనియర్లు. ర్యాగింగ్ తట్టుకోలేక విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్న ఘటనలు కూడా ఉన్నాయి. అయితే తాజాగా మరోసారి ర్యాగింగ్ కలకలం రేపింది. పల్నాడు జిల్లాలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలోని విద్యార్థులు ర్యాగింగ్ పేరుతో సీనియర్లు  తమను దారుణంగా కొడుతున్నారని ఆందోళనకు దిగారు. హాస్టల్ కి తీసుకెళ్లి కొడుతూ.. కరెంట్ షాక్ కి గురిచేస్తూ చిత్రహింసలు పెడుతున్నారని వాపోయారు. అంతేకాదు ఆ దృశ్యాలను వీడియోలు తీస్తూ పైశాచిక ఆనందం పొందుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బయటకు చెబితే చంపుతామని బెదిరింపులకు గురిచేసినట్లు తెలిపారు. ఈ విషయం గురించి  పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ పట్టించుకోవడం లేదని బాధిత తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.

Also read

Related posts

Share this