గద్వాల్‌లో భర్త, కుమార్తె ఉన్న తల్లి పుల్లన్న అనే వ్యక్తితో వెళ్లిపోయింది. కూతురిని చూడాలనిపించి తిరిగి రావడంతో గొడవలు జరిగాయి. మనస్తాపం చెంది ఆ వ్యక్తి పురుగులు మంది తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. ఆ మహిళ ఇంట్లోనే ఉరేేసుకుని ఆత్మహత్య చేసుకుంది.
ఈ మధ్య కాలంలో వివాహేతర సంబంధాలు ఎక్కువ అవుతున్నాయి. వయస్సుతో సంబంధం లేకుండా చాలా మంది ఇతరులతో రిలేషన్‌లో ఉంటున్నారు. ఈ వివాహేతర సంబంధాల వల్ల చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఇలాంటి ఘటన జోగులాంబ గద్వాల్ జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. రాజోలికి చెందిన ఓ మహిళకు భర్త, కుమార్తె ఉన్నారు. వీరిని వదిలేసి పుల్లన్న అనే వ్యక్తికితో వెళ్లిపోయింది.
కూతురిని చూడాలనిపించి..
ఒకే గ్రామానికి చెందిన వ్యక్తితో రిలేషన్ పెట్టుకుని మే 12వ తేదీన భర్త, కుమార్తెను వదిలి వెళ్లిపోయింది. వెంటనే పోలీస్ స్టేషన్‌లో మిస్సింగ్ కేసు నమోదు చేశారు. అయితే కూతురిని చూడాలనిపించి తల్లి గ్రామానికి వచ్చింది. తన ఇష్టంతోనే వెళ్లినట్లు పోలీసులకు చెప్పింది. ఈ సమయంలో రెండు కుటుంబాల మధ్య గొడవలు జరిగాయి. దీంతో మనస్తాపం చెంది పుల్లన్న ఎలుకల మందు తాగాడు
వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పుల్లన్న ఆత్మహత్యాయత్నం చేసుకోవడంతో పాటు తన భర్త కూడా బాధపడుతున్నాడని ఆ మహిళ ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. వెంటనే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు
Also read
- అమెరికా వీసా రాక యువతి ఆత్మహత్య
- తల్లితో వివాహేతర సంబంధం.. కూతురుపై అత్యాచారం..!
- Andhra: రేయ్.. ఏంట్రా ఇది.. బయట బోర్డేమో ఒకటి.. లోపల మాత్రం కథ వేరు.. అనుమానం వచ్చి వెళ్లగా..
- AP Crime: నెల్లూరులో దారుణం.. మహిళను వేధించాడు.. నడి రోడ్డుపై నరికారు
- నేటి జాతకములు….14 ఆగస్టు, 2025