శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలో ఘటన.
చిల్లకూరు: శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. పశువులను మేపేందుకు వెళ్లిన వృద్ధుడి చేతికి ఉన్న బంగారు ఉంగరాన్ని తస్కరించేందుకు గుర్తుతెలియని వ్యక్తులు ఆయన్ను దారుణంగా హతమార్చారు. పోలీసుల వివరాల మేరకు.. చిల్లకూరు మండలం నెలబల్లిరెట్టపల్లి గ్రామానికి చెందిన ఏడెం రమణారెడ్డి(84) పశువులను మేపుకొచ్చేందుకు రోజూ మాదిరిగానే ఓడూరు పరిధిలోని పొలాల్లోకి శుక్రవారం ఉదయం వెళ్లారు. సాయంత్రం పశువులు మాత్రమే ఇంటికి వచ్చాయి. రమణారెడ్డి రాకపోవడంతో పలు చోట్ల గాలించినా ఆచూకీ లభించలేదు. శనివారం ఉదయం జామాయిల్ తోటలో ఆయన విగతజీవిగా పడి ఉండటాన్ని కొందరు గుర్తించి పోలీసులకు సమాచారమిచ్చారు. ఏఎస్పీ సీహెచ్ సౌజన్య ఆధ్వర్యంలో పోలీసులు ఘటనాస్థలాన్ని పరిశీలించారు. మృతుడి తలపై గాయం ఉండడం,చేతిలోని నాలుగు గ్రాముల బంగారు ఉంగరం మాయం కావడంతో గుర్తుతెలియని వ్యక్తులు హత్య చేసి బంగారం దొంగిలించినట్లు ప్రాథమికంగా వారు అంచనాకు వచ్చారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్పీ తెలిపారు.
Also read
- Andhra Pradesh: మనిషి రూపంలో శివలింగం.. ఏడవ శతాబ్దం నాటి అద్భుత ఆలయం గురించి తెలుసా..?
- విద్యార్థిపై వార్డెన్ ల దాష్టీకం..ముగ్గురిపై కేసు నమోదు
- వాలెంటైన్స్ డే సాక్షిగా.. ఇన్స్టాగ్రామ్లో మొదలై.. సెప్టిక్ ట్యాంక్లో ముగిసిన ప్రేమకథ..!
- 4 గ్రాముల బంగారం కోసం వృద్ధుడి దారుణ హత్య!
- వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నారని.. కన్న బిడ్డలను చంపేసింది





